Sravani Kondapalli Death: గంటకో మలుపు తిరుగుతున్న నటి శ్రావణి కేసు...
-బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు...
-ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవ రాజు, సాయి కామెంట్స్ పై దృష్టి పెట్టిన పోలీసులు...
-కేసులో కొత్త కొత్తగా తెరపైకి వస్తున్న ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పేరు...
-ఎస్ ఆర్ నగర్ పిఎస్ లో జూన్ లోనే దేవరాజ్ పై ఫిర్యాదు చేసిన శ్రావణి...
-ఆ కేసు కొనసాగుతున్న సమయంలోనే శ్రావణి ఆత్మహత్య....
-మరికాసేపట్లో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ద్రవరాజు లొంగిపోనునట్లు సమాచారం...
Telangana latest news: మెదక్ అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఐదుగ్గురు అరెస్ట్..
ఏసీబీ అప్ డేట్స్.....
-మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఇంకా కొనసాగుతూనే ఉన్న ఏసీబీ సోదాలు...
-ఆర్డీవో అరుణా రెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసిమ్ హైమ్మద్,జీవన్ గౌడ్ లను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తీసుకొచ్చిన ఏసీబీ...
-మరికొద్ది సేపట్లో మెదక్ ఇంచార్జ్ కలెక్టర్ నగేష్ ను ఏసీబీ కార్యాలయంకు తీసుకు రానున్న ఏసీబీ...
-నగేష్ ఇంట్లో జరిపిన సోదాల్లో భూ డాక్యుమెంట్లు, బినామి పేర్ల మీద ఆస్తులను గుర్తించిన ఏసీబీ....
-విఆర్ఓ , విఆర్ఏ పాత్ర పై ఆరా తీస్తున్న ఏసీబీ..
-అరెస్ట్ చేసి ఐదుగురు నిందితులను నేడు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్న ఏసీబీ.
-112 ఎకరాల విస్తీర్ణంలో భూమి NOC ఇవ్వడం కోసం లంచం డిమాండ్
-ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ12లక్షలు లంచం డిమాండ్
-ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం
-ఆడియో టేపులతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
Legislative Assembly: శాసనమండలిలో చర్చకు రానున్న ప్రశ్నలు..
1) ఫాస్ట్ టాగ్ విధానాన్ని ప్రవేశ పెట్టుట
2) మక్కా మసీదు నవీకరణ
3) ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ltc సౌకర్యం పునరుద్ధరణ.
4) పారిశ్రామిక అభివృద్ధి కోసం రంగారెడ్డి జిల్లాలో భూ సేకరణ
5) చెన్నూరు సమీపంలో గోదావరి నదిపై పలుగుల వంతెన నిర్మాణం.
6) బాలానగర్ పారిశ్రామిక భూముల రిజిస్ట్రేషన్.
TS-Legislative Assembly: శాసనసభలో చర్చకు రానున్న ఆరు ప్రశ్నలు..
1) పామ్ ఆయిల్ సాగు
2) ఆసరా పింఛన్ పథకం.
3) తండాలో గిరిజన ఆదివాసి గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చుట
4) సంగారెడ్డి వద్ద వైద్య కళాశాల
5) రైతులకు ఆధునిక వ్యవసాయ మెలకువలు
6) విద్యుత్ శాఖలో జేఎల్ఎం ఉద్యోగాల భర్తీ.
Telangana Latest news: నేడు తెలంగాణ శాసనసభ, మండలి లో బిజినెస్.
గురువారం
-నేడు తెలంగాణ శాసనసభ, మండలి లో బిజినెస్.
-తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నాలుగవరోజు.
-ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం.
-మొదట ప్రశ్నోత్తరాల సమయం.
-శాసనమండలిలో ఉదయం మొదటి గంట ప్రశ్నోత్తరాలు, తర్వాత
-పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశ పెట్టనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
మండలిలో కొవిద్-19 పై స్వల్పకాలిక చర్చ
శాసనసభలో 4 ఆర్డినెన్సు లను బిల్లును ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.
1) తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020ని బిల్లు రూపంలో రానుంది.
2) ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ను బిల్లు రూపంలో శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు
3) ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002
4)ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను బిల్ బిల్లు రూపంలో రానుంది.
KCR Meeting at Pragathi Bhavan: ఈరోజు ప్రగతి భవన్ లో ఎంపీలతో కేసీఆర్ భేటీ
- ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభావన్ లో పార్టీ ఎంపీలతో భేటీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
- సీఎం తో జరిగే ఈ సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరవుతారు.
- ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
- రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జిఎస్టి విషయంలో కేంద్రం వైఖరి.
- ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందని సీనియర్ అధికారులు కూడా పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.