Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05
ఈరోజు తాజా వార్తలు
ఏసీబీ అప్ డేట్స్......
-ఐదుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు...
-మరి కాసేపట్లో న్యాయమూర్తి నివాసంలో హాజరు పరచనున్న ఏసీబీ...
-కలెక్టర్ నివాసంలో బ్యాంకు లాకర్ ను గుర్తించిన ఏసీబీ..
-లాకర్ కీ తన వద్ద లేదంటున్న అడిషనల్ కలెక్టర్ నగేష్...
-బ్యాంకు కు నోటిసులు ఇచ్చిన ఏసీబీ..
-ఇతర ఉద్యోగుల పాత్ర, మాజీ అధికారి పాత్ర పై ఏసీబీ ఆరా..
-ఆడియో టేపులు, చెక్ లు, ల్యాండ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్లను నిందితుల ముందు ఉంచి విచారిస్తున్న ఏసీబీ.
-అడిషనల్ కలెక్టర్ నగేష్ వద్ద కీలక ఆధారాలు సేకరిస్తున్న ఏసీబీ..
-నిందితుల నివాసాలలో దొరికిన నగదు, నగలు ఆస్తులను పరీశీలించిన ఏసీబీ....
కొల్లూరు..
-తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతుదన్న కేటీఆర్
-జిహెచ్ఎంసి పరిధిలో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం.
-ఈ సంవత్సరం డిసెంబర్ మాసానికి సుమారు 85వేల ఇళ్లను పేదలకి అందిస్తాం.
-కొల్లూరులో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న భారీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాజెక్టుని శాసనసభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి సందర్శించిన కేటీఆర్
-అక్కడ కొనసాగుతున్న పనులను కేటీఆర్ సమీక్షించారు.
-స్పీకర్, మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ ఉన్న సౌకర్యాలు, పనులు జరుగుతున్న తీరు ని తెలుసుకున్నారు.
-అంతకుముందు ముగ్గురు నిర్మాణం పూర్తయిన ఇళ్లల్లోకి వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించారు.
-ఈ టౌన్ షిప్ రికార్డుల్లోకెక్కుతుందని గుర్తు చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
-ఇళ్ళు లేని నిరు పేదల కోసం, ప్రత్యేకంగా టౌన్ షిప్ నిర్మించడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి అన్న పోచారం.
-దేశంలోనే పేదల హౌసింగ్ కార్యక్రమాల్లో కొల్లూరు ఒక ఆదర్శమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది.
రాజారావు వాతావరణ అధికారి @ హైదరాబాద్..
-3.6కిమీ ఎత్తున షీర్ జోన్స్ ఏర్పడడం వల్ల ఈరోజు నుండీ వచ్చే 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
-ఈనెల 13 న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో ఆంద్రప్రదేశ్ తీరానికి వెంబడి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది..
-13 నుండి తెలంగాణ జిల్లాలో ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
-గత 10 రోజులుగా నిన్నటి వరకు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి...
-నిన్న భద్రాచలం లో 36.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది..
-నిన్నటి వరకు ఎలాంటి ఉపరితల అవర్తనాలు ఏర్పడలేవు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్లే వాతావరణం లో మార్పులు...
సికింద్రాబాద్..
-సికింద్రాబాద్ మార్కెట్ పోలిస్ స్టేషన్..
-శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన మార్కెట్ పోలీసులు..
-మృతురాలు బన్సీలాల్ పేట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళ గా గుర్తించిన పోలీసులు..
-మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించనున్న నార్త్ జోన్ డీసీపీ కళామేశ్వర్.
ఏసీబీ అప్ డేట్స్......
-అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంకు తీసుకొచ్చిన ఏసీబీ...
-హైదరాబాద్ ఏసీబీ ప్రధాన కార్యాలయం లో ఐదుగురు నిందితులను విచారిస్తున్న ఏసీబీ అధికారులు...
-ఉన్నతాధికారి పాత్ర తో పాటు కింది స్థాయి ఉద్యోగుల పాత్ర పై నిందితులను నుండి వివరాలు సేకరిస్తున్న ఏసీబీ...
-స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు రాసిన లేఖ తో మాజీ కలెక్టర్ పాత్ర పై అనుమానాలు...
-మాజీ కలెక్టర్ రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు లేఖ..
-దీంతో మాజీ కలెక్టర్ పై బలపడుతున్న అనుమానాలు...
-అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను ఉస్మానియా ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించనున్న ఏసీబీ...
-అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న ఏసీబీ అధికారులు...
నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి..
-ప్రయివేటు స్కూల్ లో పనిచేసే టీచర్లు ఉద్యోగాలు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు..
-దీనిమీద ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం అడ్డుకోకపోవడంతో టీచర్లు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు...
-తక్షణమే ప్రభుత్వం ప్రయివేటు టీచర్లకు డబ్బులు రుణాలు ఇప్పించాలి వాళ్ళని ఆదుకోవాలి...
-ఆత్మహత్యయత్నం చేసిన టీచర్ కి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి..
కామారెడ్డి..
-తమ్మినేని కామెంట్స్..
-తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
-తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది
-నిజాం సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలపై ఐలమ్మ పోరాడింది
-ఆమె స్పూర్తితో మేము పోరాటాలకు సిద్ధం అవుతున్నాము
-సీఎం కేసీఆర్ తెచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం
-రైతుబంధు సమయంలో కూడా కౌలు రైతులను గుర్తించలేదు
-ఈ చట్టంలో రెవిన్యూ లోపాలు, కుంభకోణాల జోలికి వెళ్ళలేదు
-కొత్తగా భూ సర్వే పై శాసన సభలో చట్టం చేయాలి
ప్రగతి భవన్..
-సమావేశానికి ప్రభుత్వం ఉన్నతాధికారులను కూడా పిలిచిన కేసీఆర్.
-కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, జిఎస్టి వాటా, పరిపాలన అనుమతులు, కొత్త విద్యుత్ చట్టం పై చర్చ.
-పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్..
-రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ @ అరణ్య భవన్
-హుస్సేన్ సాగర్ పరిదిలో సచివాలయం నిర్మాణం వస్తుంది
-2006తరువాత మ్యాపులే ఉంచి.. పాతవి మాయం చేసింది
-ఎన్జీటి బృందం ను తప్పు దోవ పట్టించారు
-సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో ఉన్న బ్రిటిష్ లైబ్రరీ లో పాత మ్యాప్ ఉంది
-సచివాలయంకు అన్ని అనుమతులు వచ్చాయని .. త్వరలోనే సచివాలయం నిర్మాణం చేస్తామని సునీల్ శర్మ ప్రకటించారు
-400కోట్ల నుంచి 700కోట్లకు అంచనాలు పెంచేసారు
-హుస్సేన్ సాగర్ చుట్టు ఉన్న నిర్మానాలు అన్ని తాత్కాలిక మైనవే
-మక్తాకూడా హుస్సేన్ సాగర్ అని తేల్చింది
-ఖైరతాబాద్ నుంచి మింట్ కంపౌండ్.. అమృత కస్టల్.. బండ్ వరకు హుస్సేన్ సాగర్ అని కేంద్ర కమిటీ తీర్పు ఇచ్చింది
-గుళ్ళను కూల్చిలేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
-ఎర్రగడ్డ కేసీఆర్ జన్మస్థలం..
-ఎన్జీటి కమిటీ వచ్చిందని నన్ను హౌజ్ అరెస్ట్ చేసారు
-సీఎం తో జరిగే ఈ సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరవుతారు.
-ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
-రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జిఎస్టి విషయంలో కేంద్రం వైఖరి.
-ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందని సీనియర్ అధికారులు కూడా పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.