Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
కర్నూలు జిల్లా.....
-పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు మెయింటైన్ చేస్తూ రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-ప్రస్తుతనీటి మట్టం:885.00 అడుగులు
-పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు
-ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-ఇన్ ఫ్లో:91,458 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 1,13,000 క్యూసెక్కులు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి.
Vijayawada Kanaka Durga: దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు..
విజయవాడ..
-వచ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి.
-దసరా మహోత్సవాల సమయంలో రోజుకు 10వేలమందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
-ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు
-దేవస్థానం సిబ్బంది, అర్చకులకు కరోనా టెస్టులు తప్పనిసరి
-అమ్మవారి దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది...
Kadapa updates: ప్లాస్మా దానం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా..
కడప :
-రిమ్స్ ఆసుపత్రి లో ఉన్న బ్లడ్ బ్యాంక్ నందు ప్లాస్మా దానం చేసిన డిప్యూటీ సీఎం ...
-ఇటీవలే చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న అంజద్ భాష.
-కరోనా నుండి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మా ను దానం చేయాలని పిలుపునిచ్చిన ఉపముఖ్యమంత్రి.
Amaravati updates: గోడౌన్లు, వేర్‌హౌస్‌ల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష..
అమరావతి..
-అగ్రికల్చర్, హర్టికల్చర్, డైరీ, ఆక్వా రంగాల్లో ఫార్మ్‌గేట్ మౌలిక సదుపాయాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-సమీక్షకు హజరైన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడి, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమీషనర్ పిఎస్ ప్రద్యుమ్న, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ అరుణ్‌కుమార్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు
East Godavari Razole-పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజోలు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో జనసేన- బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ దీక్షలు..
తూర్పుగోదావరి - రాజోలు..
-తమ తమ ఇళ్ళ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టిన జనసేన బిజేపీ నేతలు
-అంతర్వేది రథం ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్
Guntur district updates: టిడిపి హాయాంలో అనేక దేవాలయాలు కూలగొట్టారు:కన్నా లక్ష్మి నారాయణ..
గుంటూరు ః....
-బిజేపి కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్.
-2019 తర్వాత ప్రభుత్వం అండతో హిందూ మతంపై విచ్చలవిడిగా దాడి చేస్తున్నారు.
-ఒక ఘటన జరిగిన తర్వాత నేరస్థులను పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు.
-మతిస్థిమితం లేని వ్యక్తి ఇతర ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేసిన ఘటన ఎక్కడా లేదు.
-గత ప్రభుత్వ హాయాంలో కూలగొట్టిన దేవాలయాలను ప్రభుత్వమే తిరిగి నిర్మించాలి.
-దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు.
-అసలు దోషులను పక్కన పెట్టేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు.
-పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తు బిజెపి నేతలను అరెస్ట్ చేస్తున్నారు.
Guntur-hindu temples: రాష్ట్రంలో దేవాలయాల పై దాడులు చేయడం,రధాలను తగలు బెట్టడం దురదృష్టకరం..బోనబోయిన శ్రీనివాస్ యాదవ్..
గుంటూరు...
బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్...
-హిందూ దేవాలయాల పై దాడులు చేయడాన్ని,అంతర్వేధిలో రధం తగలబెట్టడాన్ని ఖండిస్తూ జనసేన,బిజెపి నిరసన దీక్ష.
-జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్ష లో పాల్గొన్న పిఎసి సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,పార్టీ నేతలు.
-కులాలను,మతాలను విడదీసి వైసిపి ప్రభుత్వం పరిపాలన చేయాలని ప్రయత్నిస్తుంది.
-రెండు వందల సంవత్సరాల క్రితం తయారు చేసిన రధాలను తగలు బెట్టడం బాధాకరం.
-మతి స్థిమితం లేని వ్యక్తులు చేశారని ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం సిగ్గు చేటు.
-అన్నీ మతాలకు సమాన హక్కు కల్పించేలా జనసేన పార్టీ వ్యవహరిస్తుంది.
-రాజధాని లేకుండా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది.
-దేవాలయాల పై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి.
-దేవాలయాల పై దాడులను ప్రశ్నించిన నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటు.
-అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలి.
National hindu temples: హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి..వై సత్యకుమార్- బీజేపీ జాతీయ కార్యదర్శి..
జాతీయం..
-విదేశీ మత ప్రచారం కోసం ప్రభుత్వం పనిగట్టుకుని చేస్తున్న చర్యలుగా కనిపిస్తున్నాయి
-కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తుందేమో కానీ, జగన్ విధ్వంస పాలనకు వ్యాక్సిన్ లేదనిపిస్తోంది
-బిట్రగుంట ఘటన, పిఠాపురం ఘటన సహా ఎక్కడైనా ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోంది
-హిందూ ఆలయాలపై జరిగిన దాడిని మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు చేసిన చర్యగా తప్పుదారి పట్టిస్తున్నారు
-అన్ని మతాలను సమానంగా చూడాలన్నది బీజేపీ విధానం. కానీ ఈ పార్టీలు మైనారిటీ ఓట్ల కోసం మెజారిటీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి
East Godavari updates: అంతర్వేదిలో స్వామి వారి రథాన్నిదహనం చేసిన ఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేయాలి:- సోము వీర్రాజు
తూర్పుగోదావరి..
-అంతర్వేదిలో స్వామి వారి రథాన్నిదహనం చేసిన ఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఘటనపై బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు నిరసన దీక్ష
-రాజమండ్రి- క్వారీ సెంటర్లో బిజేపీ కార్యాలయంలో దీక్షకు కూర్చున్న సోము వీర్రాజు
-రాష్ట్రంలో హిందూదేవాలయాలపై వరుస దాడుల ఘటనల పై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనవైఖరి అవలింబిస్తోంది...
-రాష్ట్రంలో హిందుదేవాలయాలకు రక్షణ కల్పించాలి... దాడులకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోవాలి
-హిందుదేవాలయాలపై వరుస ఘటనలను నిరసిస్తూ ఇళ్ళల్లోనే మహిళలు,హిందువులు దీక్షలు చేయాలి.
Amaravati updates: మూడు రాజధానులపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్..
అమరావతి..
-రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత స్పష్టత ఇచ్చిన హోంశాఖ
-విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదన్న కేంద్రం
-కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావు పిటిషన్ అంతా అపోహలే అన్న హోంశాఖ
-రాజధానికి అవసరమైన ఆర్ధిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామన్న కేంద్రం
-రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని స్ఫష్టీకరణ.