Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-10 00:28 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-09-10 12:43 GMT

అమరావతి..

-రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారణ

-పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ

-మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ

-పట్టణాల్లో 22.5 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్లు నిర్ధారణ

-గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడి

-కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ

-నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడి

-రాష్ట్రంలో కరోనా వచ్చిపోయిన వారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారణ

2020-09-10 12:39 GMT

తూర్పు గోదావరి జిల్లా..

అమలాపురం..

-కామనగరువు తోపాటు మూడు ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించిన మంత్రి

-రెండు రోజుల్లో స్థల సర్వే జరిపి విస్తీర్ణంతో నివేదిక ఇవ్వాలని మండల రెవెన్యూ అధికారులు ఆదేశించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి

2020-09-10 12:33 GMT

అమరావతి..

-సీఎం వద్దకు చేరిన 13 జిల్లాల కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల జాబితా.

-ఈరోజు సాయంత్రానికి సీఎం ఫైనల్ చేసే అవకాశం.

-మొత్తం 52 కార్పొరేషన్లతో పాటు అదనంగా మరో 4 కార్పొరేషన్ల ఏర్పాటు.

-కార్పొరేషన్ చైర్మన్ల, డైరెక్టర్ల భర్తీలో మహిళలకు పెద్ద పీట వేసిన సీఎం.

-మొత్తంలో 50 శాతం మహిళలకే కేటాయించిన సీఎం.

2020-09-10 12:27 GMT

విశాఖ...

-బుద్దిడి విగ్రహం, హునుమాన్ ఆలయ స్థంభాలను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది..

-ఆలయ స్థంభాల తొలగించడం పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన స్థానికులు

-స్థానికుల సమాచారంతో ఘటన స్థలం కు చేరుకున్న సాధుమఠం స్వామిజీ శివానంద, హిందూ పరిషత్ సభ్యులు..

-ఆలయ స్థంభాలు, బుద్దిడి విగ్రహం తొలగింపు పై ఆందోళన..

-ఘటన స్థలం కు చేరుకుని స్థానికులకు నచ్చజెప్పి పంపిన పోలిసులు..

2020-09-10 12:25 GMT

అమరావతి...

-జరిగిన సంఘటన పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది..

-ఈవోను వెంటనే ప్రభుత్వం తొలగించింది..

-కొత్త రథాన్ని తయారు చేయడం కోసం 95 లక్షలు కేటాయించింది..

-మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి..

-జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి..

-సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాలు కులాలు సమానమే..

-తిరుపతి వెళ్లే బస్సు టికెట్లు మీద అన్యమత ప్రచారం చేసి దాన్ని వైఎస్సార్ సీపీ మీద నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు నవ్వుల పాలయ్యారు..

-విజయవాడలో 39 పురాతన దేవాలయాలను కులదోయించిన చరిత్ర చంద్రబాబుది..

-సీబీఐ మీద ఎప్పుడు నమ్మకం కలిగిందో చెప్పాలి..

-సీబీఐ విచారణ వేయడానికి మాకు ఎలాంటి అభ్యతరం లేదు..

-కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు...

-మానవ రూపంలో ఉన్న దెయ్యం చంద్రబాబు నాయుడు..

2020-09-10 12:19 GMT

విశాఖ...

-హైదరాబాద్ నుండి విశాఖ కు దిగుమతి చేసి విశాఖ విధ్యార్థులు కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వర్మ రాజు అనే యువకుడు ని అదుపులోనికి తీసుకున్న     పోలీసులు. 

-200మీ గ్రా ఎండీఎంఏ బ్లాట్స్, ఓఎస్డీ షీట్లు గంజాయీ, గోగో ప్లస్ షీట్స్ ను గుర్తించిన పోలిసులు...

-వర్మరాజు ఇచ్చిన సమాచారం మేరకు రుషికొండ వద్ద ఓ రెస్టారెంట్ లో డ్రగ్స్ నిల్వలను గుర్తించిన పోలిసులు..

-డ్రగ్స్ సీజ్ చేసి నిందితులు లను అదుపులోనికి తీసుకున్న పోలీసులు

2020-09-10 12:17 GMT

విశాఖ..

-శ్రీకాంత్ శిరోముండనము కేసు..

-నూతననాయుడుభార్య మధుప్రియ,ఇందిరా,వరహలను కస్టడీకి అనుమతించిన కోర్టు

-రెండు రోజుల పోలీసులు కస్టడీ కి అనుమతించిన కోర్టు

-రెండు రోజుల పాటు ముగ్గురు నిందితులు ను విచారించనున్న పోలీసులు

2020-09-10 09:35 GMT

అమరావతి...

-జోగి రమేష్...వైసీపీ ఎమ్మెల్యే....

-హత్యకేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని పరామర్శించేందుకు రాష్ట్రానికి లోకేష్ వచ్చారు.. రాష్ట్ర ప్రజలు కోసం రాలేదు..

-40 మందిని జైలుకు పంపిస్తామని లోకేష్ అంటున్నాడు..

-ఒక ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు చూపించు..

-సవాల్ చేసి హైదరాబాద్ పారిపోవడం కాదు..

-నీ దగ్గర ఆధారాలు ఉంటే బైట పెట్టాలి..

-లోక జ్ఞానం లేని లోకేష్ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు..

-ప్రజాలు కష్టాల్లో ఉంటే మీరు హైదరాబాద్ లో ఉంటారా..

-కరోనాకు భయపడి హైదరాబాద్ పారిపోతారా..

-14 ఏళ్ల సీఎంగా చంద్రబాబు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి ఏడాదిలో చేశారు..

-అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారు..

2020-09-10 09:28 GMT

విశాఖ..

-మాజీ మంత్రి అయ్యనపాత్రుడు కామెంట్స్...

-తూర్పు గోదావరి జిల్లాలోని సింహాచలంనకు చెందిన భూముల్లోని ఇసుక, గ్రావెల్ ను చైర్మన్ తను స్వయంగా కలెక్టర్ కు లెటర్ రాసి, అమ్మకం చేయడం   అన్యాయం - మాజీ మంత్రి అయ్యన్న

-నిబంధనల ప్రకారం పాలకమండలిలో తీర్మానం చేస్తే ఆలయ ఈవో చర్యలు తీసుకోవాల్సి ఉంది. దానికి

-భిన్నంగా చైర్మన్ వ్యవహారించడం దారుణం..

-15 నెలల కాలంలో మూడు దేవాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి..

-16 గుళ్ల గోపురాలు పడగొట్టడం జరిగింది. వీటిపై సీఎం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు...

-అంతర్వేది ఘటనపై పట్టించుకున్న మాదిరిగానే సింహాచలం దోపిడీలపై జిల్లా మంత్రులు కూడా స్పందించాలి...

2020-09-10 08:23 GMT

అమరావతి..

-చిన్న రాజప్ప మాజీ మంత్రి

-ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు రాజోలు బందు నిర్వహణ

-పార్టీలకతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలి

-రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుండి శనివారం వరకు సూర్య దేవాలయాల వద్ద పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది.

-ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిస్తున్నాం.

-ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలి.

Tags:    

Similar News