Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-09 00:20 GMT
Live Updates - Page 2
2020-09-09 07:27 GMT

Bandi Sanjay tour to Komaram Bheem district: రెబ్బెన మండలం గోలేటీకి చేరుకున్న బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్..

కుమ్రంబీమ్ జిల్లా..

-ఘనస్వాగతం పలికిన బిజెపి నాయకులు..

-తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్...

-జోడేఘాట్ సందర్శించి గిరిజన వీరుడు కుమ్రంబీమ్ కు నివాళి అర్పించనున్నా సంజయ్

2020-09-09 07:21 GMT

Telangana updates: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 50 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి...అన్వేష్ రెడ్డి..

-అన్వేష్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు...

-ఏకకాలంలో రుణమాఫీ చేసి ప్రభుత్వాన్ని ఆదుకోవాలి...

-2014 నాటి రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు...

-మొక్క జొన్న కేంద్రాలు ప్రారంభించక పోవడం వల్ల మద్దతు ధర 1850 ఉంటే దళారులు 1300 కె కొనుగోలు చేస్తున్నారు...

-భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేలు నష్టపరిహారం చెల్లించాలి

-రబీ లో జరిగిన వరి ధాన్యం కొనుగోలులో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి...

-సబ్సిడీ ద్వారా ఇచ్చిన సోయా విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000 చెల్లించాలి..


2020-09-09 07:09 GMT

Telangana Assembly: కోత్త‌గా 4 వేల 3 వంద‌ల 83 తండాల‌ను, ఇత‌ర ఆవాసాల‌ను పంచాయతీలుగా మార్చాము..

శాసనమండలి లో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

-తెలంగాణ రాష్ట్రంలో పంచాయ‌తీ రాజ్ రోడ్ల పొడ‌వు 67 వ‌లే 6 వంద‌ల 64 కి.మీ.

-2014కు ముందు తెలంగాణ‌కు చెందిన రోడ్ల వివ‌రాలు స‌రిగా మ్యాప్ చేసి పంప‌నందు వ‌ల్ల మ‌న రాష్ట్రానికి, కొత్త‌గా PMGSYలో ఇచ్చే రోడ్ల లో 2 వేల 57 కి.మీ. త‌క్కువ రావ‌డం జ‌రిగింది.

-ఈ త‌ప్పిదాన్ని స‌రి చేసి, తెలంగాణ‌కు రావాల్సిన మొత్తం 4వేల 485 కి.మీ. రోడ్ల‌ను ఇవ్వాల్సి ఉన్నా, కేవ‌లం 2వేల 4 వంద‌ల 27 కి.మీ. మాత్ర‌మే సూచించ‌డం జ‌రిగింది. 

2020-09-09 07:03 GMT

Telangana Assembly: కొత్త‌గా 4 వేల 3 వంద‌ల 83 తండాల‌ను, ఇత‌ర ఆవాసాల‌ను పంచాయ‌తీలుగా మార్చాము..

శాసనమండలి లో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

-రాష్ట్రంలో గ‌తంలో ఉన్న 8 వేల 3 వంద‌ల 69 గ్రామ పంచాయ‌తీల‌కు అద‌నంగా 2018 సంవ‌త్స‌రంలో తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా 4 వేల 3 వంద‌ల 83 తండాల‌ను, ఇత‌ర ఆవాసాల‌ను ప్ర‌త్యేక గ్రామ పంచాయ‌తీలుగా ఏర్పాటు చేయ‌డం ద్వారా రాష్ట్రంలో మొత్తం 12 వేల 7 వంద‌ల 52 గ్రామ పంచాయ‌తీలు అయ్యాయి.

-12 వేల 751 గ్రామ పంచాయ‌తీలో 11 వేల 2 వంద‌ల 6 గ్రామ పంచాయ‌తీల‌కు బీ.టీ. రోడ్డు సౌక‌ర్యం ఉంది.

-7 వంద‌ల 13 గ్రామాల‌కు త్వ‌ర‌లోనే బీటీ రోడ్ల స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తుంది. ప‌నులు వివిధ ద‌శ‌ల్లో పురోగ‌తిలో ఉన్నాయి.

2020-09-09 06:58 GMT

TS-Legislative Council: మోడల్ స్కూల్.. లో మెరుగైన విద్యను అందిస్తున్నాము:సబితా ఇంద్రారెడ్డి..

- శాసనమండలి లో ప్రశ్నోత్తరాల సమయంలో విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

-ఆరు నుండి‌ పదవతరగతి వరకు ఇంగ్లీషు మీడియం లో విద్యను అందిస్తున్నాము......

-194 మోడల్ స్కూల్ లో కోన్ని ప్రిన్సిపాల్ కాలిగా ఉన్నాయి... మీగతా అన్ని పోస్టులు భర్తీ చేశాము

-కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ప్రారంభించి తర్వాత చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల ఆర్థిక భారం అయినప్పటికీ స్కూల్స్లో నాణ్యమైన విద్యను అందిస్తుంది

-ఖాళీ ఉన్న పోస్టులలో తాత్కాలికంగా ఉపాధ్యాయులను భర్తీ చేసి బోధనా అందించడం జరుగుతుంది

2020-09-09 06:04 GMT

Medak district updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ ట్రాప్....

-కోటి 12 లక్షల లంచం కేసులో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు...

-మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ఇంట్లో కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు...

-గడ్డం నగేష్ ఇంటి తో పాటు బంధువులు, బినామీల ఇండ్లలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

-మొత్తం12 చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ.

2020-09-09 06:01 GMT

Telangana updates: శాసన మండలి లో కరోనా పై ప్రశ్నోత్తరాల సమయంలో..ఈటెల రాజేందర్..

-ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..

-24408 మందికి రేమిదేవిసిర్ ఇంజక్షన్ లు ఇచ్చాము...

-కరోనా నేపథ్యంలో కోట్ల సంఖ్యలో మందులు సమకూర్చుకున్నాము..

-కరోనా విషయంలో బ్రిటన్,అమెరికా లాంటి దేశాలు కుప్పిగంతులు వేసాయి...

-మన రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నాము..

-ఒక్కో ఇంజెక్షన్ బ్లాక్ లో లక్ష రూపాయలకు అమ్ముతున్నారు...

-మేము ఐ సీఎం ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మందులు వాడుతున్నాము..

-రేమిదేవిసిర్, ఇంజెక్షన్ తో పాటు ఇతర మందులు కూడా ఈనాటికి నూరు శాతం పనిచేసినట్టు ఆధారాలు లేవు...

-ఆక్సిజన్ కూడా సరిపడ అందుబాటులో పెట్టుకున్నాము..

-0.6 శాతం మాత్రమే మన దగ్గర డెత్ రేట్ ఉంది...

-అన్ని రకాలుగా ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది..

2020-09-09 05:49 GMT

Peddapalli updates: గోదావరిఖని లో పర్యటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

పెద్దపల్లి జిల్లా

-రాష్ట్రం లో నిజాం పాలన కొనసాగుతుంది.

-అమరుల స్ఫూర్తితో కేసీఆర్ పాలనపై ఉద్యమం చేయాలి

-సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం గా అధికారికంగా ప్రకటించాలి

-పివి నరసింహ రావు పేరు వాడుకొని కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

-సింగరేణి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించి లాభాల వాటాను ప్రకటించాలి.

-నీళ్ళు ఫామ్ హౌస్ కు నిధులు కాంట్రాక్టర్లకు తరలిస్తున్న ముఖ్యమంత్రి

-హైదరాబాద్ లోని కబ్జాలకు గురైన ఖరీదైన భూముల కోసమే ఎల్ ఆర్ ఎస్

-ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా సింగరేణి ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తున్నాడు

2020-09-09 05:45 GMT

New Revenue Act: కొత్త రెవెన్యూ బిల్లు ప్రధాన అంశాలు...

రెవెన్యూ బిల్లు ముక్యంశాలు.

-కొత్త చట్టం కేవలం వ్యవసాయయోగ్యమైన భూమికి మాత్రమే వర్తిస్తుంది.

-పట్టదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రం గా పరిగన.

-తహసీల్దార్ దార్ కు సబ్ రిజిస్టర్ అధికారాలు అప్పగింత.

-భూసమస్యల పరిష్కారం కోసం ఒక్కరు లేదా ఇద్దరు సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.

-ప్రతిగ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ గా నిర్వహించబడును.

-ప్రతి గ్రామం రిజర్డులు డిజిలైజేషన్ చెయ్యాలి.

-కొత్త పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కుల రోకార్డుగా పరిగణిస్తారు.

2020-09-09 05:41 GMT

Legislative Council: ఆధునిక వ్యవసాయం యాంత్రీకరణ పై ఉభయ సభల సభ్యులను విదేశీ పర్యటనకు తీసుకువేళ్ళలి అనుకున్నాం..మంత్రి నిరంజన్ రెడ్డి...

శాసన మండలి...

ప్రశ్నోత్తరాల సమయంలో...

మంత్రి నిరంజన్ రెడ్డి...

కానీ కరోనా వల్ల వాయిదా వేసం...త్వరలోనే అధ్యయనానికి తీసుకెళ్తాము...

వ్యవసాయం లో ఆధునీకరణ అవసరం ఉంది...

కేంద్ర, రాష్ట్ర స్కిం లతో సబ్సిడీ లు అమలు చేస్తాం...

రాష్ట్రంలో 92 శాతం భూమి చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది..

సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేస్తాం..

కోటి 42 లక్షల ఎకరాల్లో ఈసారి పంటలు వేశారు..

రాష్ట్రంలో వ్యవసాయ పరికరాల అవసరాల పై నివేదిక రూపొందిస్తున్నాం...

మన రాష్ట్రంలో వ్యవసాయ యంత్ర పరికరాలు తయారీ పై కసరత్తు చేస్తున్నాం...

Tags:    

Similar News