Telangana Assembly: కొత్తగా 4 వేల 3 వందల 83 తండాలను, ఇతర ఆవాసాలను పంచాయతీలుగా మార్చాము..
శాసనమండలి లో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-రాష్ట్రంలో గతంలో ఉన్న 8 వేల 3 వందల 69 గ్రామ పంచాయతీలకు అదనంగా 2018 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4 వేల 3 వందల 83 తండాలను, ఇతర ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో మొత్తం 12 వేల 7 వందల 52 గ్రామ పంచాయతీలు అయ్యాయి.
-12 వేల 751 గ్రామ పంచాయతీలో 11 వేల 2 వందల 6 గ్రామ పంచాయతీలకు బీ.టీ. రోడ్డు సౌకర్యం ఉంది.
-7 వందల 13 గ్రామాలకు త్వరలోనే బీటీ రోడ్ల సదుపాయం అందుబాటులోకి వస్తుంది. పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
Update: 2020-09-09 07:03 GMT