Live Updates: ఈరోజు (సెప్టెంబర్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-08 01:11 GMT
Live Updates - Page 2
2020-09-08 10:37 GMT

Coronavirus updates: అసెంబ్లీలో కరోనా కలకలం..

-అసెంబ్లీలో పాసులు ఇష్యూ చేసే ఉద్యోగికి కరోనా.

-వందల సంఖ్యలో ఉద్యోగులకు సిబ్బంది కి పాసులు ఇష్యూ చేసిన అసెంబ్లీ ఉద్యోగి.

-కరోనా పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతి అన్న అధికారులు.

-ఎక్కడ చేక్ చేయని భద్రతా సిబ్బంది.

2020-09-08 10:19 GMT

Telangana updates: పివి కి భారత రత్న తీర్మాణం పై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు..

-పివి నరసింహరావు ప్రధాని కాకముందు దేశ పరిస్థితి వేరేలా ఉంది.

-అటల్ బిహారి వాజ్ పేయి తో పివికి మంచి సాన్నిహిత్యం ఉంది.

-ఆర్ధిక సంస్కరణల్లో పివి తీసుకున్న నిర్ణయాన్ని అటల్ బిహారి వాజ్ పేయి ప్రతిసారి మద్దతు ఇచ్చారు..

-పివి ఒక మహానియా వ్యక్తి...

-ప్రధానిగా పనిచేసిన పివికి ఆయన మరణించిన తరువాత తగిన గౌరవం దక్కలేదు..

-పివి భారత రత్న ఇవ్వాలన్న ప్రభుత్వ తీర్మానం కు బీజేపీ మద్దతు తెలుపుతుంది...

2020-09-08 10:14 GMT

Telangana updates: పివి నరసింహరావు కు భారత రత్న ఇవ్వాలన్న ప్రభుత్వం తీర్మానం కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది..జీవన్ రెడ్డి..

జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ..

-ఇందిరా గాంధీ కి పివి అత్యంత సన్నిహితుడు...

-భూ సంస్కరణల్లో గుర్తింపు పొందారు..

-దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ కి పివి అండగా నిలిచారు..

-కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పివి కృషి చేసారు...

-దేశ ఆర్థిక వ్యవస్థ ను ముందుకు తీసుకువెళ్లారు...

-భారత రాజకీయాల్లో పివి ది ప్రత్యేక స్థానం...

-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కి పివి పేరు పెట్టాలి..


2020-09-08 09:57 GMT

TS-Legislative Council updates: పివికి భరత రత్న తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..

శాసన మండలి..

-భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ఆర్థిక పరిస్థితి ని గాడిలో పెట్టారు..

-ఆర్ధిక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి..

-కాశ్మీరు లో శాంతి నెలకొల్పారు.

-భూసంస్కరణలు చేసి పేద ప్రజలకు భూములు అందజేసిన వ్యక్తి పివి..

-పివి నరసింహ రావు బహు బాషా కోవిధుడు..

-పివి పాండిత్యం చాలా గొప్పది...

-ప్రధానిగా మన దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లారు...

-పీవీ కి భారత రత్న ఇప్పటికే ఆలస్యం అయింది...ఇప్పటికి అయినా పివి భారత రత్న తక్షణమే ఇవ్వాలి...

-పార్లమెంట్ ప్రాంగణంలో పివి విగ్రహం పెట్టాలి..

-హైదరాబాద్ విశ్వవిద్యాలయనికి పివి పెరు పెట్టాలి...

2020-09-08 09:44 GMT

Telangana updates: రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లులు, చట్టాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది:చాడా వెంకట్ రెడ్డి...

చాడా వెంకట్ రెడ్డి...సిపిఐ రాష్ట్ర కార్యదర్శి....

-రాష్ట్రంలో చెరువులు, కుంటలు అన్యాక్రాంత మైతున్నాయని పలు మార్లు విన్న వించిన పట్టించుకోలేదు.

-ప్రశ్నించే వారిని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు...

-సమగ్ర సర్వే చేయకుండా ఎల్ ఆర్ ఎస్ అమలు చేయడం అసాధ్యం

-రెవెన్యూ చట్టానికి సంబంధించి ముసాయిదా పెట్టి ప్రజలలో చర్చకు పెట్టాలి...

-కరోనా పై అసెంబ్లీలో బలమైన చర్చ జరగాలి...

-రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి....

-తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం....

2020-09-08 09:32 GMT

TS High court: పెంఛనర్ల పిటీషన్ పై హైకోర్టు లో విచారణ..

టీఎస్ హైకోర్టు....

-అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో పెన్షనర్ల పిటీషన్ పై ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉందన్న ఏజీ

-అసెంబ్లీ సమావేశాలోపు పెంఛనార్ల పై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామన్న హై కోర్ట్

-లేని పక్షంలో తాము ఆదేశాలు ఇస్తామన్న హైకోర్ట్.

-తదుపరి విచారణ అక్టోబర్ 1 కు వాయిదా వేసిన హైకోర్టు..

2020-09-08 08:52 GMT

Medchal–Malkajgiri updates: మేడిపల్లి మండలం నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు రియల్టర్ల ధర్నా...

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా....

-ఎల్ ఆర్ ఎస్ లేని ప్లాట్లను కూడా యధావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్...

-ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ...

-131 జీవో ద్వారా ఎల్ ఆర్ ఎస్ చార్జీలు పెంచడం సామాన్య ప్రజలను ముంచడమే...

-2వందల గజాల లోపు ఉన్న ప్లాట్లను ఒక రూపాయికి ఎల్ ఆర్ ఎస్ ఇవ్వాలి...

-స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్ల లోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు...

-నామమాత్రపు రుసుముకే ఎల్ ఆర్ ఎస్ ఇవ్వాలి..

-lrs ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న రియల్టర్లు..

2020-09-08 08:27 GMT

Telangana updates: రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా..సోము వీర్రాజు..

సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు..

-హిందుత్వాన్ని పరిరక్షింస్తుందా లేదా తేల్చి చెప్పాలి.

-రాష్టంలో దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలు పై భాజపా ఒక కమిటీ వేస్తాం.

-అంత్యర్వేది ఘటన పై టిడిపి మాట్లాడే హక్కు లేదు .

-గోదావరి,కృష్ణ, పుష్కరాల సమయంలో ఎన్నో దేవాలయాలు టిడిపి ప్రభుత్వం కూల్చి వేసింది.

2024 లో అన్ని మతాలకు మేలు చేసేలా మేనిఫెస్టో నిర్మిస్తునాం...

పెద్ద సంఖ్యలో స్వామిజీ లు తూర్పుగోదావరి చేరుకుంటున్నారు..రేపు నేను వెళ్తున్నాను.:

2020-09-08 08:23 GMT

Telangana updates: గన్ పార్క్ నుండి ప్లకార్డుల తో ప్రదర్శనతో అసెంబ్లీ కి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్ర రావు...

-అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు..

-ప్లకార్డులు బయటే పెట్టి అసహనంతో లోపలికి వెళ్లిన బీజేపీ నేతలు...

-ప్లకార్డుల్లో పలు డిమాండ్లు..

-ప్రభుత్వ ఉద్యోగులకు , ఉపాధ్యాయులకు పీఆర్సీ ,ఐఆర్ ప్రకటించాలి..

-కరోన కట్టడిలో ప్రభుత్వం విఫలం...

-జీవో నెం 131 ని ఎల్ ఆరేస్ పై ఉపసహరించుకోవాలి ..

-ప్రయివేటు స్కూల్ టీచర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..

2020-09-08 08:19 GMT

Yadadri Bhuvanagiri updates: -కెసిఆర్ ని ఉద్దేశిస్తూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్...

యాదాద్రి భువనగిరి జిల్లా..

-భువనగిరి బైపాస్ వద్ద ఓ హోటల్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్.....కామెంట్స్...

-సెప్టెంబర్ 17 ని అధికారికంగా నిర్వహించాలి...

-రాష్ట్రాన్ని ఏలని వాడు, దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడు...

- కేసీఆర్ మజ్లీస్ తో లోపాయకారి ఒప్పందం తో రాష్ట్రాన్ని దివాళా తీయించారు...రేపు దేశాన్ని అప్పగిస్తే ఓ పాకిస్థాన్ కో, ఆఫ్ఘనిస్తాన్ కో అంటగడుతారు...

- ఎల్ ఆర్ ఎస్ పేరు తో హైదరాబాద్ లోని వారి అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరణ చేసుకోవటానికే...

- ఎల్ ఆర్ ఎస్ పేరుతో పేదల రక్తం తాగుతున్నారు...

- రెవిన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. పేదలకు అన్యాయం చేస్తున్నారు.

-ప్రజల దృష్టి ని మరల్చడానికి కొన్ని పత్రికలలో అనుకూల వార్తలు రాయించుకుంటున్నారు .

Tags:    

Similar News