Telangana updates: ఈరోజు నుండి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతాం: రాజాసింగ్..
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..
-తెలంగాణలో ఎన్నో ప్రజా సమస్యలున్నాయి
-కరోనా విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది
-ఎంఐఎం కి ఎంత సమయం ఇస్తున్నారో మాకూ అంతే సమయం ఇవ్వాలి
-బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రా రావు
-పీఆర్సీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళం విప్పుతాం
-నిరుద్యోగ సమస్యపై మాట్లాడతాం
Jayaprakash Reddy passed away: జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
-ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
-ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
-అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సిఎం అన్నారు.
PV-Bharat Ratna: పీవీ కి భారత రత్న ఇవ్వాలనే ప్రభుత్వ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం..
*ఇవ్వాళ అసెంబ్లీ కి
హాజరు కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు*
-నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో పీవీ కి భారత రత్న ఇవ్వాలనే ప్రభుత్వ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం
-ఇవ్వాళ అసెంబ్లీ కి గైరాహాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు
Telangana updates: అసెంబ్లీలో పివి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరిన సీఎం..
-దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి వచ్చే పార్లమెంటు సమావేశాలలో భారత ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ఆసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.
-త్వరలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తానని సభకు హామీ ఇచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
Telangana updates: మొదటిసారి సీఎం కేసీఆర్ మేము ఇచ్చిన లేఖ పై స్పందించారు...విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు...
విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు...
-రెవెన్యూ చట్టం లో లోపాలు ఉన్నాయి...
-కీసర భూ కుంభకోణం లో నాగరాజు తో పాటు చాలా మంది ఉన్నారు...
-గతంలో ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు..
-ప్రజాస్వామ్యం లో పత్రికల పాత్ర కీలకమైనది.అసెంబ్లీ మీడియా పాయింట్ ను తొలగించి బయటకు పంపించారు...
-ఎమ్మార్వో ,విఆర్వో ల దాదాగిరి బంద్ కావాలి..
-బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన విహెచ్..
-ఓల్డ్ సిటీ లో చేయి ఎత్తితే న్యూ సిటీ లో చెయ్ తీసేస్తా అంటూ బండి సంజయ్ మాటలు సరికాదు..
-జీహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని సంజయ్ వ్యాఖ్యలు చేసాడు..
TS High court updates: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన నిర్మాణం పై నేడు హైకోర్టు విచారణ...
టీఎస్ హైకోర్టు.....
-ఉస్మానియా ఆసుపత్రి పై ఇప్పటి వరకు ధాఖలైన పిటిషన్ల కలిపి నేడు మరోసారి విచారించనున్న హైకోర్టు..
-ప్రస్తుతం ఉన్న భవనం శితిలావస్థకు చేరిందని దీనిని తొలగించి నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వం కౌంటర్ ధాఖలు..
-ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనం పురాతన కట్టడం అని దానిని కూల్చివేయ్యద్దన్న పిటీషనర్ల వాదనలు...
-ఎర్రమంజిల్ భవనం పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన పిటిషనర్లు..
-ఉస్మానియా గూగుల్ సైట్ మ్యాప్ నేడు హైకోర్టు కు సమర్పించనున్న ప్రభుత్వం.
Telangana updates: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు..
-ఉభయ సభల్లో క్వశ్చన్ అవర్ రద్దు..
-BAC లో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు సీఎం కేసీఆర్ ఉంచనున్నారు
-4 ఆర్డీనెన్స్ లను సభలో పెట్టనున్న మంత్రులు
-సభ ముందుకు బిల్లు రూపంలో వస్తున్న ఆర్డినెన్స్ లు
-ప్రయివేటు యూనివర్సిటీల ఆర్డినెన్స్ ని ప్రవేశపెట్టనున్న మంత్రి సబితారెడ్డి
-ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020
-ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2020
-ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్
-సభలో పీవీ నర్సింహ్మరావు శతజయంతి వేడుకలపై చర్చ
-పీవికి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న తెలంగాణ ఉభయ సభలు
Telangana Updates: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: బండి సంజయ్
- తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ముందు నుండి ఉద్యమం చేస్తుంది...
- ఏ ప్రభుత్వం ఉన్న సరే 17 సెప్టెంబర్ ని అధికారికంగా నిర్వహించాలని కోరుతాం...
- కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటాం అనుకున్నాం...
- ఉద్యమ పార్టీగా ఉన్న టీఆరెస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అప్పుడు ఆందోళన చేశారు ఇప్పుడు ఏమైంది...
- కేసీఆర్ మోసపూరిత విధానాలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు...
- దశాబ్దాలుగా జరిగిన ఉద్యమాన్ని కనుమరుగు చేయడానికి నేనే రాష్ట్రం సాధించిన అని చెప్పుకోవడానికి వ్యవహరిస్తున్నారు...
- ఆనాటి త్యాగధనులను తలుచుకోవడానికి ఈరోజు భువనగిరి లో ప్రారభించే యాత్ర రేపు నిజామాబాద్ దాశరథి జైలు వరకు కొనసాగుతుంది...
Police Coombing in Adilabad dist: ఉమ్మడి అదిలాబాద్ జిల్లలో పోలీసుల కూంబింగ్
- ఉమ్మడి అదిలాబాద్ లో కోనసాగుతున్న మావోల వేట...
- మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలలో కోనసాగుతున్న కూంబింగ్..
- మావోయిస్టు నాయకుడు బాస్కర్, కమిటీ సభ్యులకోసం అడవులను గాలింపు చేస్తున్న పోలీసులు..
- ప్రాణహిత సరిహద్దు ప్రాంతాలలో కోనసాగుతున్న కూంబింగ్..
- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పోలీసులు..
- అనుమానం ఉన్న వాహనాలను అపి తనిఖీలు చేస్తున్న పోలీసులు
Saraswathi Barriage updates: సరస్వతి బ్యారేజ్ సమాచారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- సరస్వతి బ్యారేజ్ 2 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
- ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,000 క్యూసెక్కులు