YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంలో 13జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్..
అమరావతి..
-సీఎం క్యాంపు కార్యాలయంలో 13జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
-స్పందనలో సీఎం వైయస్.జగన్
-కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు
-ఈనేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి
-మరో 11 వేల మంది ట్రైనీ నర్స్‌లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం
-దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదు, వాటిని వెంటనే పూర్తి చేయాలి
-మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి.
Jaya Prakash Reddy Death: ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి తెలుగు సినీ ప్రపంచానికి తీరనిలోటని హోంమంత్రి మేకతోటి సుచరిత.....
-హోంమంత్రి సుచరిత....
-జయప్రకాష్ రెడ్డి తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు....
-జయప్రకాష్ కుటుంబానికి నా ప్రగడ సానుభూతి...
Guntur updates: రేపల్లె లో లాకప్ డెత్ ?
గుంటూరు ః...
-ఓ కేసులో రాఘవేంద్ర అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-కేసు విచారణ లో భాగంగా రాత్రింతా పోలీసులు కొట్టినట్లు సమాచారం.
-స్టేషన్ లోనే ప్రాణాలు విడిచిన వ్యక్తి.
-ఆసుపత్రి కి తరలించిన పోలీసులు
Jaya Prakash Reddy Daeth: జయప్రకాష్ రెడ్డి గారి అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది:అమిత్ షా..
- అమిత్ షా , కేంద్ర హోం మంత్రి..
-విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం.
-పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది.
-ఆయన స్థానం భర్తీ చేయలేనిది.ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.
East Godavari updates: అంతర్వేది వచ్చిన మంత్రులను నిలదీసిన హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు..
తూర్పుగోదావరి...
-ఈ నేపథ్యంలో ఉద్రిక్తత
-అంతర్వేది దేవస్థానానికి భారీగా చేరుకున్నా బజరంగ్ దళ్ హిందూ పరిషత్ సభ్యులు
Jaya Prakash Reddy Death: జయప్రకాశ్ రెడ్డి మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ..
కర్నూలు...
-ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ..
-రాయలసీమ మాండలికం తో ప్రేక్షకులను ఆకట్టుకుని, అలరించిన నటుడు జయప్రకాష్ రెడ్డి .. టీజీ వెంకటేష్..
-క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా ప్రేక్షకులను మెప్పించిన జయప్రకాష్రెడ్డి మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటు .. టీజీ వెంకటేష్.
Amaravati updates: విలక్షణ నటుడిని కోల్పోయిన సినీ నాటక రంగం: విజయ్ చందర్..
అమరావతి..
ఎఫ్‌డిసి చైర్మన్ విజయ్ చందర్...
-తెలుగు సినీ రంగంలో తనదంటూ ఒక నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలాది ప్రేక్షకుల మన్ననలు పొందిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి.
-జయ ప్రకాష్ రెడ్డి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు.
-రంగ స్థల నటుడిగా ప్రస్థానం ప్రారంభించి దాదాపు వందకు పైగా చలన చిత్రాలలో నటించి, నాటక సినీ రంగంలో జయప్రకాశ్ రెడ్డి ఒక సంచలనం సృష్టించారూ.
-మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను ఉర్రుతలూగించి యాస, భావ వ్యక్తీకరణలో తనదంటూ ఒక శైలిని సృష్టించారూ.
-జయప్రకాశ్ రెడ్డితో ఇండస్ట్రీ లో తనకు కూడా మంచి అనుబంధం ఉండేది.
-తరచు ఆయనతో పరిశ్రమకు సంబంధించి అనేక అంశాలు చర్చించే వాడిని.
-జయప్రకాశ్ రెడ్డి కుటుంబానికి ప్రగఢ సానుభూతి తెలుపుతున్నా....
Amaravati updates: గ్రామ, వార్డు సచివాలయాలపై స్పందనలో సీఎం వైయస్.జగన్..
అమరావతి...
-గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నాం
-కలెక్టర్లు వారానికి రెండుసార్లు గ్రామ సచివాలయాలకు ఖచ్చితంగా వెళ్ళాలి.
-వారానికి నాలుగు సార్లు జెసిలు వార్డు, గ్రామ సచివాయాలను సందర్శించాలి
-హెచ్‌ఓడిలు, సెక్రటరీలు గ్రామ, వార్డు సచివాలయాలను నెలకు రెండు సార్లు సందర్శించాలి.
-ఇది ఖచ్చితంగా జరగాలి, దీనిని సీఎం కార్యాలయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తాం.
Kadapa updates: కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ముంపు వాసులతో డీఎస్పీ నాగరాజు, ఆర్డీవో నాగన్న భేటి..
కడప :
-సామరస్యంగా పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసిన సమావేశం..
-ఆర్డీవొ నాగన్న కామెంట్స్ ...
-పరిహారం తీసుకున్న వెంటనే ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పినందుకే గండికొటలొ నీటి నిల్వకు చర్యలు చేపట్టాం
-పునరావాస కేంద్రంలొను సమస్యలను పరిష్కరిస్తాం...
-సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది...
-అర్డీవొ ప్రతిపాదనను వ్యతిరేకించిన తాళ్లపొద్దుటూరు మహిళలు...
-మా డిమాండ్లు అన్నీ నెరవేర్చే వరకు ఖాళీ చేయం...
-ఆత్మహత్యలకైన సిద్ధమన్న ముంపు నిర్వాసితులు..
-ఉన్నఫలంగా వెళ్లిపొమ్మంటే ఎక్కడికెళ్లాలి...
-గ్రామంలొ భారీగా మోహరించిన పొలీసులు ...
Jaya Prakash Reddy's Death: జయప్రకాష్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.
గుంటూరు...
-ఆయన ప్రస్థానం ప్రారంభమైన నాటక రంగాన్ని మర్చిపోలేదు.
-స్వంత ఖర్చుతో నాటకాలను గుంటూరులో ప్రదర్శిస్తున్నారు.
-ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
-వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.