Live Updates: ఈరోజు (సెప్టెంబర్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 08 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | షష్ఠి (రా. 8-01 వరకు) తదుపరి సప్తమి | భరణి (ఉ. 6-18 వరకు) తదుపరి కృత్తిక | అమృత ఘడియలు లేవు | వర్జ్యం (రాత్రి 7-26 నుంచి 9-11 వరకు) | దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-48 నుంచి 11-35 వరకు) | రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-07
ఈరోజు తాజా వార్తలు
అమరావతి: విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్
ఈ నెల 10 నుంచి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం.
ఎంసెట్‌లో 2,72,720 మంది నమోదు చేసుకున్నారూ.
పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఏపీ ఎంసెట్ పరీక్షను 118 పరీక్షా కేంద్రాల్లో జరుగుతుంది.
తల్లి తండ్రులు ఆందోళన చెందవద్దు.
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం.
ఎగ్జామ్ ముందు, తర్వాత కూడా హాల్‌ను శానిటైజ్ చేస్తాం.
ప్రతి సెంటర్‌లో ఐసోలేషన్ రూమ్‌లు అందుబాటులో ఉంచాం.
టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్ సంయుక్తంగా ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.
విద్యార్థులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాం.
హాల్ టికెట్‌తో పాటు పరీక్ష సెంటర్ రోడ్డు మ్యాప్ కూడా అందిస్తున్నాం’ : ఆదిములపు సురేష్
అమరావతి
- ఏపీలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
- బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్
- గిరిజాశంకర్‌కు ఎండోమెంట్ అదనపు బాధ్యతలు
- నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్.హరేంద్రియ ప్రసాద్
- నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా కె.దినేష్ కుమార్
- తెనాలి సబ్ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
- మాదాపూర్ పర్వత్ నగర్ జుంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులకు గాయాలు
- ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరు యువకులను డి కొట్టిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాన్వాయ్ లోని వాహనం
- ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు
- ఎమ్మెల్యే వాహంలో ఇద్దరు యువకులను హాస్పిటల్ కు తరలించిన సిబ్బంది
- అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వస్తున్న ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ...
- ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి డ్రగ్ స్వాధీనం.
- ఎక్స్ స్టసి పిల్స్ 46 గ్రాములు, 2 గ్రాముల MDMA, 10 గ్రాముల చరస్ స్వాధీనం.
- గోవా నుంచి సిటీ కి డ్రగ్ తరలించి నట్టు గుర్తింపు.
- నిందితులు వాడిన టూ వీలర్ ,కార్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు.
గుంటూరు ః
-బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు
-రేపల్లె లో పలువురు చిరు వ్యాపారుల వద్ద రాఘవేంద్ర మోసాలకు పాల్పడ్డాడు.
-చిరు వ్యాపారుల ఫిర్యాదు మేరకు రాఘవేంద్ర ను అదుపులోకి తీసుకున్నాం.
-కరోనా లక్షణాలతో రాఘవేంద్ర ఇబ్బంది పడపడ్డాడు.
-కోవిడ్ పరిక్షలు చేసేందుకు ఆసుపత్రికి తీసుకెళ్శారు.
-ఊపిరి ఆడక రాఘవేంద్ర మృతి చెందాడు.
-రాఘవేంద్ర గుంటూరు చుట్టుగుంట వాసి.
-చిల్లర మోసాలకు పాల్పడుతు ఉంటాడు...
అమరావతి..
-నాని మాట ఆయనింట్లో కుక్కకూడా వినదు
-సన్నబియ్యం సన్నాసి మంత్రి చెబితే, జగన్ విన్నాడంటే ఎవరు నమ్ముతారు..?
-ఒక్క రాజధానే కట్టలేని ఈ సన్నాసులు, మూడురాజధానులు ఎలా కడతారంటూ ప్రజలు అనుకుంటున్న విషయాన్ని నాని సీఎంకు చెప్పి ఉంటాడు.
-దరిద్రానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నానిలా ఉంటాడని, బూతుకు మానవరూపం వస్తే, అది నానీలా ఉంటుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.
-టీడీపీలో ఉన్నప్పుడు తండ్రి శవం ఇంట్లో పెట్టుకొని సంతకాలు సేకరించిన దుర్మార్గుడు జగన్ అని, జగన్ తో పాటు ఆయన భార్య జైలుకెళుతుందని వంశీ అనలేదా?
-జగన్ తన తల్లి విజయమ్మను విశాఖలో ఎందుకు గెలిపించుకోలేకపోయాడో నాని చెప్పాలి.
-జగన్ మాదిరి తండ్రి కంచుకోటలో గెలిచి కాలర్ ఎగరేయాలని లోకేశ్ ఎప్పుడూ భావించలేదు.
-టీడీపీకి పట్టులేని నియోజకవర్గలో గెలిచి సత్తా చూపాలని ప్రయత్నించాడు.
అమరావతి..
-ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై తనపై కేసు నమోదు, అరెస్టు జరగకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వర రావు
-ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
-తీర్పు ప్రకటించే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు ఆదేశాలు
కృష్ణా జిల్లా..
-మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామం ప్రకాష్ నగర్ కు చెందిన మూల వెంకటరెడ్డి c/o తిరుపతి రెడ్డి వయసు 26 గా గుర్తింపు..
-తన కుమారుడు గత నెల 29 తేదీ నుంచి కనిపించడం లేదని ఎంక్వైరీ చేసిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 5వ తేదీన పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన తల్లిదండ్రులు
-ఫిర్యాదు అందిన వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు
-మృతదేహం పూర్తిగా శిధిలం అవటంతో చెప్పులు దుస్తులను ఆధారంగా తన కుమారుడు అని గుర్తించిన తల్లిదండ్రులు..
-అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముసునూరు పోలీసులు
-మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
విజయవాడ:
-కరోనా ట్రీట్మెంట్ కు 15 లక్షలు తీసుకుని సరైన వైద్యం అందించక పోవడం వల్ల తన భర్త మరణించాడని ఫిర్యాదు లో పేర్కొన్న బాధితురాలు.
-15 లక్షలు తీసుకుని బిల్స్ ఇవ్వడం లేదని, కరోనా చికిత్స పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ ఫిర్యాదు.
నెల్లూరుజిల్లా..
-నెల్లూరులోని కమర్షియల్ టాక్స్ ఆఫీసు , డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్ట రీస్, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం, గూడూరులో రవాణా శాఖ కాలో ఎసిబి సోదాలు..
-వాణిజ్యపన్నుల శాఖలో నకిలీ ఏ సిబిఐ పేరుతో బెదిరించిన వారికి నగదు బదిలీ చేసిన ఓ అధికారి. డబ్బు ఎందుకు పంపారో అన్న అంశంపై సిబ్బందిని విచారిస్తున్న ఏసిబి అధికారులు..
-ఫ్ఫ్యాక్టరీ చీఫ్ డైరెక్టర్ కార్యాలయంలో రికార్డులు స్వాధీనం.