Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-08 01:49 GMT
Live Updates - Page 3
2020-08-08 10:42 GMT

సిద్దిపేట జిల్లా:

- సిద్దిపేట జిల్లా కొమురవేల్లి అయినాపూర్ గ్రామంలో 20 మంది కి కరోనా టెస్ట్ చేయడంతో అందులో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ వైద్య అధికారి వెల్లడించారు

2020-08-08 10:41 GMT

సిద్ధిపేట జిల్లా:

- ములుగు మండలం తునికి బొల్లారం లో పొలం వద్ద పనులు చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి మురళీ అనే యువ రైతు మృతి

2020-08-08 10:34 GMT

హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రులపై 1039 ఫిర్యాదులు వచ్చాయి

- హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రులపై 1039 ఫిర్యాదులు వచ్చాయి

- 130కి పైగా బిల్స్ పై ఫిర్యాదులు.

- 16 ఇన్సూరెన్స్ సంబంధించిన ఫిర్యాదులు.

- ఆస్పత్రులు మూసి వేయడం మా ఉద్దేశ్యం కాదు.

- ప్రయివేటు ఆస్పత్రులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం.

2020-08-08 10:32 GMT

DME రమేష్ రెడ్డి

- 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

- మెత్తం 18వేల పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది

- ఔట్ సోర్సింగ్ నర్సింగ్, డాక్టర్లను విధుల్లోకి తీసుకున్నాం

- కొంతవరకే ప్లాస్మా ఉపయోగపడ్తోంది. క్రిటికల్ రోగులకు ప్లాస్మాతో ప్రయోజనం ఉండదు

- కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారిలో యాంటీబాడీస్ డెవలప్ కావు

- పాజిటివ్‌ వచ్చిన వారు హైదరాబాదు రావాల్సిన అవసరంలేదు

- జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాం

2020-08-08 10:30 GMT

తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ధైర్యమే కరోనాకు మందు: డైరక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు..

- తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ధైర్యమే కరోనాకు మందు అంటోన్న డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

- సెప్టెంబరు ఆఖరు నాటికి తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతోంది

- కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి

- తెలంగాణలో పాజిటవ్ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి

- తెలంగాణలో ప్రస్తుతం 5శాతం పాజిటివ్‌ రేటు నమోదవుతోంది

- ప్రభుత్వం తాజాగా కరోనా నివారణ చర్యలకు వంద కోట్లు కేటాయించింది

- కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు

- 11వందల సెంటర్స్ లో రోజుకు 20వేలకుపైగా టెస్టులు చేస్తున్నాం

- పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం

- కోవిడ్ కేర్ సెంటర్స్ ద్వారా హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నాం

2020-08-08 10:29 GMT

శంషాబాద్ లో గత నాలుగో తేది అదృశ్యం అయిన మైనర్ బాలిక

- శంషాబాద్ లో గత నాలుగో తేది అదృశ్యం అయిన మైనర్ బాలిక రాజేంద్రనగర్ పొలిస్టేషన్ పరిధి హిమయత్ సాగర్ లో శవమై తేలింది

- శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ గుడాకు చెందిన ప్రేమలత 4 వ తేది నుండి మిస్సింగ్వి

- విజయ్ అనే యువకుడి చేతిలో గతంలో మోసపోయిందని అతడే ఏమైనా చేసుంటాడాని అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు

- విజయ్ పై అరోపణల మేరకు ఆర్జీఐఏ పొలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో హిమాయత్ సాగర్ లో శవమై తేలిన ప్రేమలత

2020-08-08 10:26 GMT

ఎల్లయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

- మాజీ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

- కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు.

- దళిత నాయకుడు, మంచి పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నాడు.

- ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.

- చాడ వెంకట్ రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

2020-08-08 09:43 GMT

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: రేవంత్ రెడ్డి

- దళిత శిఖరం, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

- ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు, తెలంగాణ సమాజానికి తీరని లోటు.

- జీవితాంతం దళిత, బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం ఎల్లయ్య పోరాడారు.

- నిమ్నవర్గాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఆయన ఘనతకు నిదర్శనం.

- కాంగ్రెస్ సిద్ధాంతాల అమలులో రాజీలేని వైఖరిని అవలంభించారు.

- రాజకీయాల్లో విలువలకు ప్రతినిధిగా నిలిచారు.

- ఆయన లేని లోటు తీర్చలేనిది.

- ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

2020-08-08 09:39 GMT

ఢిల్లీ:

👇 గజపతి రాజు, మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి

కోజికోడ్ ఎయిర్పోర్టుకు రన్ వే ఎక్స్టెన్షన్ అవసరం ఉంది

- ఈ అంతర్జాతీయ విమానాశ్రయం లో పెద్ద విమానాలు దిగేందుకు ఇది తప్పనిసరి

- మరి రన్ వే ఎక్స్టెన్షన్ చేశారా ? లేదా అన్న విషయం నాకు తెలియదు

- ఎయిర్ పోర్టు, ఎయిర్క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి

- డీజిసీఎ నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది

2020-08-08 09:37 GMT

జాతీయం:

కరోనా చికిత్స పూర్తి చేసుకుని అభిషేక్ బచ్చన్ డిశ్ఛార్జ్

Tags:    

Similar News