Live Updates: ఈరోజు (సెప్టెంబర్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-07 02:11 GMT
Live Updates - Page 2
2020-09-07 09:48 GMT

Amaravati updates: వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌..

అమరావతి...

-క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించిన సీఎం.

-అంతకు ముందు పలు జిల్లాల నుంచి లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌.

-సీఎం వైయస్‌ జగన్‌ పాయింట్స్

-ఇవాళ ప్రారంభిస్తున్న వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలు నిజంగా మంచి చేయడంలో సంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు.

-గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారన్నది ఎవరూ ఆలోచన చేయలేదు.   వారికి ఏం చేయాలన్నది ఆలోచించలేదు.

-హెల్తీ బాడీ. హెల్తీ మైండ్‌. అన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు.

-చాలీ చాలని విధంగా నిధులు ఇచ్చేవారు.

-ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా ఉండేది.

-మన పిల్లలు రేపటి పౌరులు, రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే స్థితిలో ఉన్నారా? లేరా? అన్నది చూశాక వారిలో మార్పు తీసుకురావాలని అన్ని కోణాల్లో   ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.

-నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లభించడం లేదు.

-పిల్లలు, తల్లిదండ్రులు ఆ పరిస్థితిలో ఉన్నారు. వారందరిలో మార్పు తీసుకురావడం కోసమే ఈ పథకాలు.

-పేదల పిల్లలకు బలహీనత, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.

-వాటికి సంబంధించి మన పిల్లలు ఎలా ఉన్నారన్నది చూస్తే, అలాగే తల్లుల పరిస్థితి చూస్తే.. గర్భవత్లులో దాదాపు 53 శాతం మంది రక్తహీనతతో బాధ   పడుతున్నారు.

-31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు అలాగే ఉంటున్నారు.

-17.2 శాతం మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. మరో 31 శాతం మంది పిల్లలు బరువుకు తగ్గ ఎత్తులో లేరు.

-ఇంత దుస్థితి ఉంది, ఇవి కొత్తగా వచ్చినవి కావు, కానీ గతంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

-ఈ నెంబర్లు మారాలి, పరిస్థితి మారాలి. పిల్లల ఎదుగుదల లేక, వారు వెనకబడి పోతున్నారు.

-ఇంట్లో తినడానికి తగిన ఆహారం లేకపోతే, అది పిల్లల మేధస్సు, ఎదుగుదలలో కనిపిస్తోంది. తల్లిదండ్రులకు తగ్గట్లుగా పిల్లలు కూడా తగిన ఎదుగుదల లేక   ఉన్నారు.

-ఇవన్నీ తెలిసినా, గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. ఆ దిశలోనే పిల్లలు, గర్భిణీలు, బాలింతల బాగు కోసం   ఈ పథకాలు.

-55607 అంగన్‌వాడీల పరిధిలో పూర్తి మార్పులు చేస్తూ, పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తున్నాం.

-బాగా డబ్బున్న వారి కుటుంబాల వారి పిల్లలు ప్రాథమిక స్థాయిలో

-రకరకాల చదువులు చదువుతున్నారు, పేద పిల్లలు అలాగే చదవాలన్న తపనతో ఈ మార్పులు చేస్తున్నాం.

-పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తూ, ఇంగ్లిష్‌ మీడియమ్‌లో గట్టి పునాది వేసేలా అంగన్‌వాడీల్లో మార్పు చేస్తున్నాం.

2020-09-07 09:35 GMT

Visakhapatnam update: టీడీపీ నేత పుచ్చా విజయ్ కుమార్ కామెంట్స్..

విశాఖ...

-ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి దళితులపై 150 దాడులు జరిగాయి...

-భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రం కోసం పని చేస్తానన్న సీఎం దళితులపై జరుగుతున్న దాడులను ఖండించాలి..

-దాళితుల పై జరుగుతున్న దౌర్జన్యాలు బాదకరం..

-రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వైసీపీ పార్టీ కోసమా పని చేస్తుంది...

-రాష్ట్రం లో దళితులు బయపడనవసరం లేదు...

-ఛలో కృష్ణా జిల్లా ఐనం పూడి గ్రామానికి వెళ్తే ఆడ్డుకుంటున్నారు

-దళితుల దాడులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.

-హోం మంత్రి దళితులపై దాడులకు స్పందించాలి...

2020-09-07 08:59 GMT

Visakhapatnam updates: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం జగన్..

విశాఖ..

-ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశాఖ జిల్లా కాలెక్టరేట్ లో వీడియో కాన్ఫెరెన్సు నుంచి పాల్గున్న మంత్రి ఆవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

-మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

-పేదలకు పోషకాహారం అందించే విధంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ముఖ్యమంత్రి ప్రారంభించారు.

-ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని ఆశిస్తున్నాం.

-ఈ పథకం ద్వారా ధనికులతో సమానంగా పేదవారికి పోషకాహారం అందుతుంది.

-పోషక ఆహారం ద్వారా మహిళల్లో రక్తహీనత ,పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

2020-09-07 08:55 GMT

Vijayawada updates: రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసనగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిరసన ధర్నా..

విజయవాడ..

-సత్య రవికుమార్ వి.హెచ్.పి నేత

-వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయి

-ఇన్ని దాడులు, దారుణాలు జరుగుతున్నా మంత్రులు, అధికారులులు స్పందించడం లేదు

-దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి

-ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు

-ప్రభుత్వం సిబిఐ తో దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలి

-అతి పెద్ద ఆదాయం కలిగిన దేవాలయాలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది

-హిందూ ఆలయాల ఆస్తులను కొల్లగొట్టడమే ప్రభుత్వం ఉద్దేశం

-హిందూ‌ధర్మాన్ని నీరు గార్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి

-మతి‌ స్థిమితం లేని వారు చేసిన చర్యలుగా ప్రకటించడం సరి కాదు

-దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మేము న్యాయ స్థానాలను ఆశ్రయిస్తాo

-గవర్నర్ ని కలిసి ప్రభుత్వం తీరు పై ఫిర్యాదు చేస్తాం

-హిందూ ఆలయాల‌ నిర్వహణ ను ధార్మిక మండలిలకి అప్పగించాలి

-హిందూ ఆలయాల లెక్కలు‌ అన్నీ చెప్పాలి... ఇది మరెవరికీ వర్తించదు

-మంత్రాలయం మఠం‌ భూములు కొట్టేయాలని చూస్తున్నారు.

2020-09-07 07:19 GMT

Kadapa district updates: రైతు ఏడ్చిన రాజ్యం-ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడదని పెద్దల అభిప్రాయం...

కడప :

-వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.22 ను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరికిరణ్ ను కలిసి   వినతిపత్రాన్ని అందజేసిన ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి...

-కామెంట్స్...

-2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది...

-ఈ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక...

-వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగించడమంటే రైతు మెడకు ఉరితాడు బిగించడమే....

-గతంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని చంద్రబాబు ఇంకొంత మంది అవమాన పరిచే విధంగా మాట్లాడారు...

-కానీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు పరిచి చూపించింది....

-2004 లో కాంగ్రెస్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దివంగత నేత వైఎస్ఆర్ మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫ…

2020-09-07 07:03 GMT

Guntur updates: జగన్ సీఎం గా ప్రమాణస్వీకరం చేయడం దళిత సోదరులు సంతోష పడ్డారు:-మద్దిరాల నాని..

గుంటూరు ః....

-టిడిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల నాని, 

-బైబిల్ పట్టుకోని

-కానీ పాలనలో మాత్రం దళితులపై నిత్యం వేదింపులు జరుగుతున్నాయి,

-ప్రజా వేదిక కూల్చివేత తో ప్రారంభమై నేటికి అరాచక పాలన సాగుతుంది.

-దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి,

-ప్రశ్నించిన దళిత నేతలపై అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

-జగన్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారు.

2020-09-07 06:29 GMT

Guntur updates: అయినంపూడి లో దళిత మహిళా పై సజీవ దహనానికి యత్నించారు..

గుంటూరు ః....

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

-టిడిపి , దళిత , ప్రజా సంఘాలు చలో అయినంపూడి కి పిలుపునిస్తే ప్రభుత్వం అడ్డుకుంటుంది.

-బాధితులకు అండగా ఉండేందుకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు,

-దళిత సోదరులు అంతా భుజాన వేసుకోని వైసిపి ని అధికారంలోకి తెచ్చారు.

-దళితులు పై దాడి చేసే హక్కు తమదే అన్నట్లు వైసిపి వ్యవహరిస్తుంది.

-శివప్రసాద్ శిరోమండనం ఘటనపై ప్రభుత్వం చర్యలు ఉంటే శ్రీకాంత్ శిరోమండనం జరిగేది కాదు.

-దళితుల పై సుమారు 150 పైగా దాడులు వైసిపి ఏడాది పాలన లో జరిగాయి,

-దళితుల పై దాడులు అన్ని విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

-అమరావతి లో అంబేద్కర్ విగ్రహాలు మాయమైతే ప్రభుత్వం కనీసం స్పందించలేదు.

-అంబేద్కర్ స్మృతి వనం ని నిర్వీరం చేయడానికి ప్రభుత్వం కుట్ర .

-అంబేద్కర్ అంటే వైసిపి కి చులకన భావం .

-దళితుల పై జరిగిన దాడులు అన్నింటి పైనా విచారణ చేపట్టాలి.

-దళిత , ప్రజా సంఘాలు అన్నింటి తో కలసి పోరాటం చేస్తాం.

2020-09-07 06:23 GMT

Antarvedi updates: చినరాజప్ప కామెంట్స్..గొల్లపల్లి సూర్యారావు కామెంట్స్..

తూర్పు గోదావరి జిల్లా....

-అంతర్వేది దేవస్థానం లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప , గొల్లపల్లి సూర్యారావు, తెలుగుయువత గంటి హరీష్

-చినరాజప్ప కామెంట్స్:

-ఈ ఘటన కచ్చితంగా ఎవరో చేసినదే

-చంద్రబాబు ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీగా మమ్మల్ని పంపారు

-ఈ కమిటీలో నేను మాజీ మంత్రి గొల్లపల్లి ఉన్నాం.

-జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగాయి

-ఈ ఘటనపై సిబిఐ లేదా జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయించాలి.

-----------------------------------------

-గొల్లపల్లి సూర్యారావు కామెంట్స్:

-నిన్నటి వరకు బడుగు బలహీనవర్గాల మీద దాడులు జరిగాయి.

-నేడు మతాల మీద దాడులు జరుగుతున్నాయి.

2020-09-07 03:17 GMT

Bus service to Hyderabad: హైదరాబాద్ కు మొదలైన ప్రయివేటు బస్సులు!

విజయవాడ

- అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రైవేటు బస్సులు రోడ్డెక్కాయి

- రవాణాశాఖ అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు

- 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ విధానాన్ని మొదలుపెట్టారు

- హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా ఒప్పందం కుదరలేదు

- సర్వీసుల పెంపునకు టీఎస్‌ ఆర్టీసీ ససేమిరా అంటోంది

- ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలంటోంది టీఎస్ఆర్టీసీ

- ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్‌ ఆర్టీసీ తెగేసి చెబుతోంది

2020-09-07 03:06 GMT

East Godavari Updates: తూర్పుగోదావరి జిల్లలో తెరుచుకున్న ఆలయాలు


- కోవిడ్ ఆంక్షలు సడలింపు తో  తూర్పుగోదావరి జిల్లాలో  నేటి నుంచి తెరుచుకోనున్న ప్రముఖ ఆలయాలు..

- పిఠాపురం పాదగయా క్షేత్రంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించునేందుకు అనుమతి..

- ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకోనున్న సామర్లకోట భీమేశ్వరాలయం..

- అభిషేకాలు, ప్రత్యేక పూజలకు అనుమతి ఇచ్చిన ఎండోమెంట్స్ అధికారులు..

- వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ పునఃప్రారంభమైన ఆర్జిత సేవలు

Tags:    

Similar News