Live Updates: ఈరోజు (సెప్టెంబర్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 07 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | పంచమి ( సా. 6-11వరకు) తదుపరి షష్ఠి | భరణి నక్షత్రం పూర్తిగా | అమృత ఘడియలు (రా. 12-58 నుంచి 2-44 వరకు) | వర్జ్యం (మ.2-21 నుంచి 4-07 వరకు) | దుర్ముహూర్తం (మ.12-22 నుంచి 1-11 వరకు తిరిగి మ.2-50 నుంచి 3-39 వరకు) | రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) | సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-07
ఈరోజు తాజా వార్తలు
అమరావతి: సోషల్ మీడియా కేంద్రంగా తమ పార్టీని అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నిస్తోన్న వారిపై జనసేనాని సీరియస్
కుట్రపూరితంగా తమ పార్టీపై అసత్యప్రచారం చేస్తున్నారని భావిస్తోన్న జనసేన అగ్రనాయకత్వం
కొంతమంది సీనియర్ న్యాయవాదులతో ప్యానల్ ఏర్పాటు
సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని సమీక్షించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిన జనసేన
కుట్రపూరిత వార్తలు, కథనాలపై కేసులు పెట్టే యోచనలో జనసేన న్యాయవిభాగం
పార్టీ నాయకుల సూచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఇటీవల నటి మాధవీలత సోషల్ మీడియా లో పెట్టిన పొస్తుపై దుమారం రేగిన నేపథ్యంలో నిర్ణయం
విశాఖ: 2024 లో మళ్ళీ బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
తప్పకుండా ఈ సారి విశాఖ కార్పొరేషన్ బిజేపి కైవసం చేసుకుంటుంది.
జనతాదళ్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిజేపి దక్షిణ భారతదేశంలో విశాఖ కార్పొరేషన్ లో, మొదటిసారిగా విజయకేతనం ఎగురు వేసింది.
బిజేపి ప్రభుత్వం చైనాను గడగడలాడించింది. అలాంటి బిజేపి సారధ్యంలో మరిన్ని విజయాలు సాధించాలి.
ఈ రాష్ట్ర రాజకీయాలలో బిజేపి, జనసేన కలసి మార్పులు తీసుకొస్తాయి.
రాబోయే రోజుల్లో సంయుక్తంగా ముందుకు వెళ్తాము.
మేము కూడా రాజకీయాలను శాసిస్తాం.
నేడు వెన్నుపోటు రాజకీయాలు చూసి ఎందుకు భయపడాలి.
1982 ఒక వాహనం పై యాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్.
ఇందిరా మృతి చెందిన సమయం దేశంలో కాంగ్రెస్ గాలి ఉంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్లో టిడిపి గెలిచింది, కేంద్రంలో ప్రతిపక్ష స్థానం లో పనిచేసింది.
ఇప్పుడు రాజకీయాలను డబ్బు నడుపుతోంది.అలాంటి రాజకీయాలను పాలద్రోలుతాం.
మేము ఓట్లు కోసం ,సీట్లు కోసం లెము. దేశం కోసం , సమాజం కోసం ఉన్నాము.
-చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీ, కెవిబి పురం, బుచ్చినాయుడు ఖండ్రిగ, వరదాయపాలెం, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, కార్వేటినగర్ నాగలాపురం, వెదురుకుప్పం , రేణిగుంట.
-కడప జిల్లాలో టి.సుండుపల్లి, పుల్లంపేట, రాజంపేట, వీరబల్లి, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, పెనగలూరు.
-నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, బలయపల్లి, రాపూర్ .
-మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.
-పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.
-సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.
-విపత్తుల నిర్వహణ శాఖ..
అమరావతి..
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి..
-గత ప్రభుత్వం ఇన్సెంటివ్స్ బకాయిలు పెట్టీ వెళ్ళింది
-వైఎస్ఆర్ నవోదయం ద్వారా 10 వేల MSME లను ఆదుకున్నాం
-గతంలో లా పేపర్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు పెట్టుబడిదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు
-వాటి స్కోరింగ్ పరిగణం లోకి తీసుకుని ఈ సారి ర్యాంక్ లు ఇచ్చారు
-100 శాతం సర్వే ఆధారంగానే ఈ ర్యాంక్ లు ఇచ్చారు
-మేము దాదాపు 7000 పరిశ్రమల వివరాలు కేంద్రం కు అందించాం
-లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అర్కిటేక్ట్స్ వివరాలు కూడా అందించాం
-ర్యాంక్ విషయం తెలియగానే నేను సీఎం కి చెప్పే లోపు లోకేష్ ట్వీట్ చేశారు
-అంతా గత ప్రభుత్వం వల్లే అని లోకేష్ చెప్పుకున్నారు
-గత ప్రభుత్వం 32 లక్షల కోట్లకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు
-కనీసం 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాలేదు
-ఆపిల్ ప్రాడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి
-భూ కేటాయింపు లో సంస్కరణలు చేస్తున్నాం
అమరావతి..
-ప్రైవేట్ యూనివర్శిటీల ప్రతిపాదనల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు.
-ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమ చంద్రారెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ,
-60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
విజయవాడ..
-కోవిడ్ రోగి వైద్యానికి 15 లక్షలు తీసుకుని నిర్లక్ష్యంగా చికిత్స చేశారంటూ కలెక్టర్, విజయవాడ నగర కమీషనర్ కు ఫిర్యాదు
-కలెక్టర్ కు నివేదిక అందించిన కృష్ణా జిల్లా డి.ఎం.హెచ్.ఓ శాస్త్రి
-లిబర్టీ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం
విజయనగరం...
-మొదవలస సమీపంలో ని ఐండియన్ ఆయిల్ పెట్రోలు బంకు పై తూనికలు కొలతలు , విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు
-ఆయిల్ కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు
-వ్యత్యాసం ఉన్న పెట్రోల్ పంపు ని సీజ్ చేసిన అధికారులు
విశాఖ..
-కేజీహెచ్ లో సి ఎస్ ఆర్ బ్లాక్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు.
-కోవిడ్ సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు.
-జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
-విశాఖలో కోవిడ్ సేవలను మెరుగు పరచటానికి కె జి హెచ్ లో కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసాం.
-ప్రస్తుతం 500 పడకలు అందుబాటులో ఉన్నాయి.
-కార్పొరేట్ హాస్పటల్ కు దీటుగా సిఎస్ ఆర్ బ్లాక్ నిర్మాంచాం
-పేద, మధ్యతరగతి వారికి కరోనా వైద్యం అందించటానికి ఈ బ్లాక్ ఉపయోగపడుతుంది.
-'ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం 2020 పాత్ర పై జరిగిన గవర్నర్ల సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ హరి చందన్.
-నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి కమిటీ ఏర్పాటు చేసామని చెప్పిన గవర్నర్.
-నూతన జాతీయ విద్యా విధానాన్ని సంపూర్ణంగా రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పిన గవర్నర్ .
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర విద్యా శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రులు
-ఏపీ నుండి సమావేశంలో పాల్గొన్న
-రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి..
-తదుపరి విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు
-విచారణ ఎవరిపై చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ప్రొసీడింగ్స్ రికార్డులను కోర్టులో సబ్ మిట్ చేయాలని ఆదేశం
-తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
-ఎన్నికల సంఘం లో ఉద్యోగులను విధులు నిర్వర్తించకుండా సీఐడీ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ..