Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-05 01:30 GMT
Live Updates - Page 2
2020-10-05 08:28 GMT

Ex- MLA Dronamraju Srinivasa Rao: ద్రోణంరాజు శ్రీనివాసరావు అంతిమయాత్ర

విశాఖ: మాజీ విప్ ,మాజీ శాసన సభ్యుడు ,విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు అంతిమయాత్ర ప్రారంభం.

- పోలీస్ కవాతు,అభిమానుల నివాళులు మధ్య అంతిమయాత్ర

- పెద్దవాల్తేర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు సాగనున్న అంతిమయాత్ర.

2020-10-05 08:25 GMT

JEE MAINS: నెల్లూరు నారాయణ జేఈఈ మెయిన్స్ లో విజయకేతనం

నెల్లూరు నారాయణ డీన్ రాయుడు కామెంట్స్..

- 45,102,116,357లతో పాటు మరిన్ని ర్యాంకులు మరియు ఓపెన్ కేటగిరీలో చేజిక్కించుకున్న నారాయణ విద్యార్థులు..

- జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించటానికి నారాయణ విద్యాసంస్థల్లో బోధనలే కారణం..

- అన్ని పోటీ పరీక్షలలో రాణిస్తున్న నెల్లూరు నారాయణ..

- రాబోయే నీట్ పరీక్షలలో కూడా నెల్లూరు నారాయణ విజయకేతనం ఎగురవేస్తుంది.

- శివ కిరణ్ 45వ ర్యాంకు విద్యార్థి కామెంట్స్..

- 8వ తరగతి నుండి నారాయణ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నాను..

- నా చదువులో నన్ను నారాయణ విద్యా సంస్థలు సిబ్బంది వెన్నంటి నడిపిచ్చారు..

- మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వలనే చదువుకోవడంలో రాణించగలిగాను.

- 345 విద్యార్థిని సుమశ్రీ కామెంట్స్...

- నారాయణ విద్యాలయంలో బోధనా సిబ్బంది తర్ఫీదు అత్యుత్తమమైనది.

2020-10-05 08:20 GMT

AMARAVATHI: అమరావతి రాజధాని పై 229 రిట్ పిటిషన్స్: హైకోర్టు న్యాయవాది సుంకర

అమరావతి: హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ పీసీ...

- అమరావతి రాజధానికి సంబంధించి రిట్ పిటిషన్స్ 229 ఉన్నాయి.

- ఇవి మధ్యంతర ఉత్తర్వులు కోసం కోర్ట్ ముందుకు వచ్చాయి.  

- వీటిని వర్గీకరించి బ్యాచ్ లుగా విభజిస్తున్నారు.

- ఇళ్లపట్టలు కు సంబంధించి లిటీగషన్స్ విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఏ జి.

- ప్రాధాన్యత రాజధాని కేస్ లకే ఇస్తాము అన్న సీజే.

- రిట్ పిటిషన్ లు ఒక్కొక్కటి ఒకొక్క రిలీఫ్ కోరుతున్నాయి అలా ఉన్న వాటిని ఒక బాచ్ గా చేయాలని సీజే ఆదేశించారు.

-  పోయిన వాయిదా రోజు విశాఖ కు సంబంధించి సీఎస్ ను అఫిడవిట్ వేయాలన్నారు.

- 29 న సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు.

- పూర్తి స్థాయి వివరాలు ఇవ్వలేదు అని పిటిషనర్ వాదన వినిపించారు.

- విశాఖ గెస్ట్ హౌస్ ఖర్చు వివరాలు అఫిడవిట్ లో అంటూ అబ్యఅంతరం.

- రాష్ట్రపతి భవనం 5 ఎకరాల్లో ఉన్నది. 30 ఎకరాల్లో విశాఖలో గెస్ట్ హౌస్ ఎందుకు అనే వాదనలు కొనసాగాయి. తిరుపతి కాకినాడ లలో అంతా అవసరం లేదు అని ఏ జి వివరణ ఇచ్చారు.

- గెస్ట్ హౌస్ రాజధాని తరలింపుకు సంబంధం లేదు అని ప్రభుత్వం పేర్కొందన్న అడ్వొకేట్ జనరల్.

- హైబ్రిడ్ విచారణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెయ్యొచ్చు అయితే పూర్తిస్థాయి విచారణ భౌతికంగా జరిపే అవకాశాలు పరిశీలన.

- రెపటినుంచి ఉదయం 10 నుండి 1.30 వరకు రాజధాని కేస్ ల పై విచారణ. ఇవి 2,3 నెలలు పట్టొచ్చు అన్న ధర్మాసనం.

2020-10-05 08:15 GMT

AP THREE CAPITALS: మూడు రాజధానులపై హైకోర్టులో ముగిసిన విచారణ

అమరావతి: మూడు రాజధానులపై హై కోర్టులో ముగిసిన విచారణ.

- తదుపరి విచారణ రేపటి కి వాయిదా.

- ముందుగా స్టే కు సంబంధం లేని 34 పిటీషన్ లను విచారించనున్న ధర్మాసనం

- రేపటి నుండి పిటిషన్లను అంశాల వారీగా విభజించి విచారణ జరపనున్న ధర్మాసనం

2020-10-05 08:11 GMT

యార్లగడ్డ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన వల్లభనేని వంశీ

కృష్ణాజిల్లా: యార్లగడ్డ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపంలో గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ

- పార్టీ తరఫున వంశీతో చర్చిస్తున్న మంత్రి కొడాలి నాని   మనస్తాపానికి గురైన వల్లభనేని వంశీ

2020-10-05 08:08 GMT

TDP: ఏపీలో రాజ్యాంగం అమలు కావ‌డం లేదు: టిడిపి వర్ల రామయ్య

టిడిపి వర్ల రామయ్య

- దళితుల పై దాడులు జరుగుతున్నా.. స్పందించడం లేదు

- బాధితుల బాధలను పట్టించుకోకుండా కేసులను తారుమారు‌ చేస్తారా

- పోలీసులు ఎవరూ శిరో మండనం‌‌ చేయరు

- తప్పు అనిపిస్తే ఒక దెబ్బ కొట్టడమే పోలీసులకు తెలుసు

- కానీ పోలీస్ స్టేషను లో శిరోమండనం వెనుక ఎవరి హస్తం ఉందో తీయాలి

- ఎవరి ఫోన్ తో ఆ పని చేశారో.. ఆ పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలి

- ప్రశ్నించిన నోరు నొక్కడమే ఈ ప్రభుత్వం విధానం

-  రాష్ట్రం లో పాలెగాళ్ల పాలన ఉందే కానీ.. ప్రజాస్వామ్య పాలన లేదు

- బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎపి లో అమలు లేదు

- సిఎం జగన్ చెప్పిందే చట్టం, చేసిందే శాసనం అని కొంతమంది అధికారులు భావిస్తున్నారు

- వామపక్ష పార్టీలు చేసే పోరాటానికి టిడిపి మద్దతు ఉంటుంది

- నిద్ర నటిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ని మేల్కొనేలా అందరూ ఉద్యమం చేయాలి

2020-10-05 07:11 GMT

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ భేటీ మరోసారి వాయిదా.

అమరావతి: ఏపీ క్యాబినెట్ భేటీ మరోసారి వాయిదా.

- ఈ నెల 8న జరగాల్సిన ఏపీ క్యాబినెట్ సమావేశం వాయిదా.

2020-10-05 07:07 GMT

మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు రాజీనామా చేయాలి: పిసిసి

గుంటూరు: పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి

- గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా యూపీలో జరిగిన ఘటనకు నిరసనగా సత్యాగ్రహ దీక్షను చేపట్టం

- భారతదేశ వ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైంది

- మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు రాజీనామా చేయాలి

- తక్షణమే ప్రాంతీయ పార్టీలు దీనిపై తమ గళం వినిపించాలి

- సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పోరాటం చేయాలి

- లేదంటే వీళ్ళందరు ప్రధాని మోడీ కి ఊడిగం చేస్తున్నట్లే.

- ప్రధాని మోడీ ఆర్థికంగా భారతదేశాన్ని దెబ్బతీస్తున్నారు.

- దేశ ప్రజలు అందరు ఏకమై ప్రధాని నియంత పోకడలు ఖండించాలి

- మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

2020-10-05 07:02 GMT

ద్రోణం రాజుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

విశాఖ: ద్రోణం రాజు శ్రీనివాస్ కు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.

ఇంటివద్ద భౌతిక కాయానికి నివాళి అర్పించిన జిల్లా అధికార యంత్రాంగం

2020-10-05 07:00 GMT

CM JAGAN: పులివెందులకు చేరుకున్న సిఎం వైఎస్ జగన్ .....

కడప : పులివెందులకు చేరుకున్న సిఎం వైఎస్ జగన్ .....

వైఎస్ఆర్ ఆడిటోరియంలో మామ డాక్ట్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు హజరు .....

పాల్గొన్న వైసీపీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఎంపీలు విజయసాయి రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు...

Tags:    

Similar News