Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 05 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
కర్నూలు జిల్లా..
-అవాస్తవాల ప్రచారం మాని
-అభివృద్ధి పై అవగాహన పెంచుకొవాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి కి ఎమ్మెల్యే భుమా బ్రహ్మానందరెడ్డి హితవు
-కుందూ,చామకాల్వ వెడల్పు పనులు మేము చేయ్యడం వల్లనే పట్టణం ముంపుకు గురికాలేదు..
-కుందూనది పై బ్రిడ్జ్ విషయంలో గెజిట్ ను ఫాలో చేసి బ్రిడ్జ్ పనులు పూర్తిచేయ్యాలని...డిమాండ్
కృష్ణాజిల్లా..
-గన్నవరం ఎంఎల్ఏ వంశీ అనుచరులు..
-గన్నవరంలో ఎమ్మెల్యే వంశీకి మద్దతు ఇవ్వాలని దుట్టా చెప్పారు
-గత కొద్ది రోజులుగా పధకం ప్రకారం ఎమ్మెల్యే వంశీపై దుష్ప్రచారం చేస్తున్నారు
-అందరూ ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లోకి వస్తారు
-అధినాయకుడు సీఎం జగన్ ఆదేశాలు ధిక్కరించడం సరైనది కాదు
-జగన్ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం అందరి పైన ఉంది
-నియోజకవర్గంలో చిన్న చిన్న విషయాలు పెద్దవి చేయడం సరైనది కాదు
-యార్లగడ్డ వెంకట్రావు కూడా టీడీపీ నేపథ్యం ఉన్న వ్యక్తి
-వైఎస్సార్ సీపీలో చేరి యార్లగడ్డ 2019లో గన్నవరం నుండి పోటీ చేశారు
-యార్లగడ్డ జన్మదిన వేడుకలను పోలీసులు చేత వంశీ, ఓ మంత్రి అడ్డుకున్నారని విమర్శలు చేయడం సబబు కాదు
-జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే వంశీ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు
-గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ నాయకుడుగా ఎవరిని పంపినా నిబద్ధతతో మద్దతు తెలిపి గెలుపుకు కృషి చేసాం
అమరావతి..
సజ్జల రామకృష్ణ రెడ్డి..
-ఎపెక్స్ కౌన్సిల్ భేటీలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్మించకపోతే జరిగే నష్టం గురించి వివరిస్తాం..
-రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ఎలాంటి రాజీ ఉండదు..
-సీఎం ఢిల్లీ టూర్ లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల గురించి ఆడడం జరుగుతుంది..
-ప్రత్యేక హోదా గురించి మరోసారి అడుగుతారు..
విజయవాడ
గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్
జగన్ వెంట ఎంపీలు సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి..పలువురు ఉన్నతాధికారులు
రేపు ఉదయం ప్రధాని మోడీ తో భేటీ కానున్న సీఎం జగన్
ప్రధాని తో భేటీలో మాట్లాడాల్సిన అంశాల పై అందుబాటులో ఉన్న ఎంపీ లతో చర్చించనున్న సీఎం
ఇటీవల రెండుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో రెండు సార్లు భేటీ అయిన సీఎం జగన్
ప్రధాని తో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సాయం తో పాటు పలు రాజకీయ అంశాల పై కూడా చర్చ జరిగే అవకాశం
అమరావతి
మూడు రాజధానుల అంశంపై పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్సీ లు పోతుల సునీత,శివ నాథ్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ షరీఫ్ ను కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
ఈ నెల 28 వ తేదీన ఇద్దరి సభ్యుల వివరణ తీసుకుంటానని చెప్పిన చైర్మన్
చైర్మన్ చర్యలు తీసుకునేలోపే వారిద్దరూ స్వయంగా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ నెల 22 న పార్టీ ఫిరాయింపు పై తగిన ఆధారాలతో మరోసారి చైర్మన్ కు ఫిర్యాదు చేస్తాం : బుద్ధా వెంకన్న
తిరుమల
నవరాత్రి బ్రహ్మోత్సవాలపై పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సమన్వయ సమావేశం
కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన అధికారులు
వాహనసేవలను వీక్షించడానికి టీటీడీ నిబంధనలకు అనుగుణంగా భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తాం
బ్రహ్మోత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ విజిలెన్స్ తో చర్చించాం
కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
రమేష్ రెడ్డి, ఎస్పీ, తిరుపతి అర్బన్
తిరుమల
అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ
రూ 300 దర్శన టికెట్లను అదనపు కోట విడుదల చేసిన టీటీడీ
రాత్రి 9,10 గంటల స్లాట్ దర్శనం
ఒక స్లాట్‌కు 1500 టిక్కెట్లు
ఒకరోజుకు 3000 టికెట్లను విడుదల చేసిన టీటీడీ
యార్లగడ్డ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపంలో గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ
పార్టీ తరఫున వంశీతో చర్చిస్తున్న మంత్రి కొడాలి నాని
రాజకీయాల నుంచీ వంశీ వైదొలగుతారని ప్రచారం
గతంలో కూడా టీడీపీ నుంచీ మనస్తాపంతో బయటకి వచ్చిన వంశీ
మరి కొద్దిసేపట్లో మీడియా ముందుకు వల్లభనేని వంశీమోహన్
రాజకీయాల నుంచీ వైదొలగడంపై క్లారిటీ ఇవ్వనున్న వంశీ
శ్రీకాకుళం జిల్లా..
అధికార, ప్రతిపక్ష నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..
తన పై మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన టిడిపి నేత కూన రవికుమార్..
నిన్నగాక మొన్న మంత్రి అయిన అప్పలరాజు బెదిరింపులకు భయపడటానికి చంటి పిల్లాడిని కాదు..
మంత్రి అప్పలరాజు బరువు తగ్గించటానికి పలాస ప్రజలు సిద్దంగా ఉన్నారు..
జాగ్రత్తగా మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు..
టిడిపి పనైపోయిందన్న నాయకులంతా ప్రస్తుతం కనుమరుగైపోయారన్న విషయాన్ని వైకాపా నేతలు గుర్తించాలి..
తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్న వైకాపా నేతలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి..
అమరావతి రైతులు టీషర్టులు వేసుకోవటం, విమానాలు ఎక్కడం తప్పా..
వైకాపా నేతలకు ధమ్ముంటే రాజీనామా చేసి ప్రజల దగ్గరకు రావాలని సవాల్..
ప్రజాక్షేత్రంలో ఓడిపోతే జగన్ తో సహా కేబినెట్ మంత్రులంతా అమరావతి వెళ్లి రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలి..
అమరావతి: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
- ఎంతో మంది కరోనా బాధితులకు సేవ చేసిన రాధిక గారు అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడవడం దిగ్భ్రాంతికి గురి చేసింది.
- ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను.
- ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలి.
- కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదు.
- పూర్తికాని భవనంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చెయ్యడం ఏంటి..? ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.