Corona updates: ములుగు జిల్లాలో దడ పుట్టిస్తున్న కరోనా...
ములుగు..
-ములుగు జిల్లాలో దడ పుట్టిస్తున్న కరోనా...
-వెంకటాపురం మండలంలోని వీఆర్కే పురంలో ఊరంతా కరోనా...
-కొంప ముంచిన దినం భోజనాలు సహపంక్తి భోజనాలు..
-ఓ కార్యక్రమంలో పాల్గొని సహపంక్తి బోజనాలు చేసిన వారిలో సగం మందికి కరోనా పాజిటివ్..
-ప్రస్తుతం 98మందికి
-కరోనా పాజిటివ్ నిర్దారణ.. మరికొందరు పరీక్షలకు గ్రామస్తుల గైర్హాజర్..
-కరోనా ఉగ్ర రూపంతో ఆ గ్రామాన్ని క్వారెంటైన్ చేసిన అధికారులు, గ్రామస్తులు
-గ్రామంలోని రహదారులు దిగ్బంధం..
Assembly monsoon meetings: సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
-సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
-హాజరైన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
-మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్, మండలి చీఫ్ విప్.
-అసెంబ్లీ కమిటీ హాల్ వన్ లో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆర్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో అసెంబ్లీ నిర్వహణ పై చర్చ.
కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖల నుంచి రావాల్సిన ఇన్ పుట్స్ పై చర్చ.
మీడియా అనుమతిపై, మంత్రులు ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది నీ అనుమతించడం పై చర్చ.
Keesara Tahasildar case updates: కీసర కేసులో స్పందించిన కలెక్టర్, ఆర్డీవో....
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా....
-తహసీల్దార్ నాగరాజు లంచం కేసు వ్యవహారం లో తనకు ఎలాంటి సమాచారం లేదు..
-తమ తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం తమ పేరును వాడుకోవడం సరైంది కాదు...
-ఈ కేసులో ఎలాంటి విచారణ కు అయిన సిద్ధం గా ఉన్నాను.
-ఆర్డీవో రవి.....
-తహసీల్దార్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు..
-తమ కార్యాలయానికి ఎంతో మంది వస్తుంటారు అంత మాత్రాన తమకు ఈ కేసులో ప్రమేయం ఉంది అనడం సరైంది కాదు..
-ఏలాంటి విచారణ కైనా సిద్ధం గా ఉన్న..
Mahbubnagar updaets: జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
-4 గేట్లు ఎత్తివేత..
-ఇన్ ఫ్లో: 63 వేల క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 60,856 వేల క్యూసెక్కులు.
-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:
-9.657 టీఎంసీ.
-ప్రస్తుత నీట్టి నిల్వ: : 5.950 టీఎంసీ.
-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
-ప్రస్తుత నీటి మట్టం: 318.516 మీ.
Medchal-Malkajgiri district: కీసర కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం.....
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా...
--నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ తో అధికారులు పాత్ర పై ఏసీబీ విచారణ...
-హన్మకొండ, తహసీల్దార్ కిరణ్ ప్రకాష్, ఆర్డీవో, కలెక్టర్ పాత్ర పై వివరాలు సేకరిస్తున్న ఏసీబీ..
-నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా అధికారులకు నోటిసులు ఇచ్చి విచారించనున్న ఏసీబీ..
-నేడు నిందితుల బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కోర్ట్ విచారణ.
-ఇప్పటికే బెయిల్ పిటీషన్ పై కౌంటర్ పిటీషన్ దాఖలు చేసిన ఏసీబీ..
-నిందితులను మరోసారి కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్న ఏసీబీ..
-ఈ కేసులో పై స్థాయి అధికారుల పాత్ర ఉంటే వారిని సైతం అరెస్ట్ చేయనున్న ఏసీబీ.
Warangal-Mulugu updates: నక్సల్స్ కోసం పోలీసుల వేట..
ములుగు జిల్లా..
-ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్..
-గుండాల ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తం..
-గోదావరి పరీవాహక ప్రాంతంలో జల్లెడ పడుతున్న స్పెషల్ పార్టీ బృందం...
-మావోయిస్టు నేతలు దామోదర్, రాజిరెడ్డి లక్ష్యంగా కూంబింగ్...
-ప్రతీకారంగా మావోయిస్టులు ఏదై నా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో అప్రమత్తమైన పోలీసులు..
-దీంతో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా చేపడుతున్నా తనిఖీలు...
Jayashankar Bhupalpally updates: లక్ష్మీ బ్యారేజ్-75 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-లక్ష్మీ బ్యారేజ్
-పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 92.00 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 1.536 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,38,535 క్యూసెక్కులు
Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ్-2 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
సరస్వతి బ్యారేజ్
-2 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 8,600 క్యూసెక్కులు
Nalgonda Raod Accident: హైద్రాబాద్ - సాగర్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం.
నల్గొండ :
- చింతపల్లి (మం)ధైర్యపురి తండా వద్ద అదుపుతప్పి కారు బోల్తా.
- ప్రమాదంలో ఐదుగురు మృతి.హైద్రాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా దుర్ఘటన.
- రోడ్డు పక్కన కృష్ణా వాటర్ పిల్లర్ ను ఢీకొని ఐదారు పల్టీలు కొట్టిన కారు.
- నిద్రమత్తు,అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం.
- కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీస్తున్న పోలీసులు.