Live Updates: ఈరోజు (సెప్టెంబర్-04) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-04 01:04 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 04 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-విదియ (మ.12-17వరకు) తదుపరి తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం (రా.10-37 వరకు) తదుపరి రేవతి, అమృత ఘడియలు (సా.5-21 నుంచి 7-07 వరకు) వర్జ్యం (ఉ.6-51 నుంచి 8-36 వరకు) దుర్ముహూర్తం (ఉ.8-17 నుంచి 9-06 వరకు తిరిగి మ.12-24 నుంచి 1-13 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-10

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-04 15:55 GMT

హైదరాబాద్: జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డిఎ) మరియు నావల్ అకాడమీ (ఎన్ఎ) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు..

- పూణే - హైదరాబాద్ మరియు ముంబై (ఎల్టిటి )- హైదరాబాద్ మధ్య తిరగనున్న ప్రత్యేక రైళ్లు....

- ఈ నెల 5,6 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి

2020-09-04 15:16 GMT

హైదరాబాద్.

- నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న షాపులు నిర్వహించడం గోడవున లపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

- టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ఆసిఫ్ నగర్, హుమాయున్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించారు.

- ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు..

- నాలుగు లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

2020-09-04 12:27 GMT

-ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు @ అసెంబ్లీ మీడియా పాయింట్..

-ముఖ్యమంత్రి కెసిఆర్ ,స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ల ప్రత్యేక చొరవతో అసెంబ్లీ సమావేశాలకు కరోనా నేపథ్యం లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు

-ప్రజాప్రతినిధులు ,అసెంబ్లీ కి వచ్చే ప్రతి ఒక్కరు శాసన సభ లోని కరోనా నిర్ధారణ కేంద్రం లో పరీక్ష చేయించుకోవాలి

-కరోనా పరీక్ష చేసుకోకుండా ఎవ్వరూ సమావేశాలకు హాజరు కావొద్దని మనవి

-కరోనా కట్టడి లో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో పని చేస్తోంది

-ప్రజా సమస్యలను కూలంకషంగా చర్చించేందుకు ఎన్ని రోజులైనా అసెంబ్లీ ని నడుపుతామన్న సీఎం కెసిఆర్ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం

-అసెంబ్లీ ని ప్రతిపక్షాలు రాజకీయాలకు వేదిగ్గా చేయకూడదు

-ఏ సమస్య కైనా జవాబు చెప్పేందుకు పాలకపక్షంగా సిద్ధంగా ఉన్నాం.

2020-09-04 11:38 GMT

మరోసారి దాతృత్వాన్ని చాాటుకున్న మాజీ ఎంపీ ‌కల్వకుంట్ల కవిత.

-హైదరాబాద్ లో‌ సెయింట్ ‌జోసెఫ్ సెకండరీ స్కూల్ ద్వారా, అణగారిన వర్గాల పిల్లల కు ఉచిత విద్య ను అందిస్తున్న బైలా గాబ్రియల్

-కరోనా నేపథ్యంలో, ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు గాను, కంప్యూటర్ లు అందించాలంటూ ట్విట్టర్ లో అభ్యర్థన...

-వెంటనే ‌స్పందించిన మాజీ ఎంపీ ‌కవిత

2020-09-04 11:25 GMT

టిఎస్ హైకోర్టు...

ప్రయివేట్ హాస్పటల్ ఓవర్ చార్జీస్ పై 22న రిపోర్టు ఇవ్వాలి.

డిజా స్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఎవిధంగా ఉన్నాయో సమర్పించాలి..

డిజాస్టర్ మేనేజ్మెంట్ తో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని అదేశం.

పబ్లిక్ హెల్త్ పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో నివేదిక ఇవ్వాలి...

ప్రయివేట్ అస్పటల్స్ కి నోటీసులు ఇచ్చామన్నారు. ఎంత మందికి ఇచ్చారు. చర్యల పై నివేదిక. సమర్పించాలి.

ప్రయివేట్ అస్పత్రి పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు...

50శాతం బెడ్స్ పై ఢిల్లీ ప్రభుత్వం లాగా వ్యవహారించాలి. తెలంగాణలో ఎలా చేశారో నివేదిక ఇవ్వండి.

డెత్ రిపోర్ట్స్ పై అగ్రహాం.

ప్రతి రోజు 8 నుంచి 10 మంది మాత్రమే చనిపోతున్నారా..? కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు.

మార్చి నుంచి ఇదే విధంగా వ్యవహారిస్తున్నారు. కచ్చితమైన రిపోర్టులు సమర్పించాలి.

తప్పుడు రిపోర్టులు ఇస్తే మళ్లీ సి.ఎస్. ని కోర్టుకు పిలువాల్సి వస్తుంది.

ఈ రిపోర్టులు అన్ని 22వరకు నివేదించాలి.

కోవిడ్ హాస్పటల్స్ పై చర్యలు తీసుకోవడంలో వ్యతసం ఉందన్న పిటిషనర్ తరుపున్యాయవాధి.

హాస్పటల్స్ లో స్టాఫ్ ని, మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎలాంటి స్టాఫ్ ని పెంచారో నివేదిక ఇవ్వాలన్న ధర్మాసనం.

తదుపరి విచారణ ఈనెల 24 కి వాయిదా..

2020-09-04 11:04 GMT

-దేవికారాని తో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ...

-సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న ఏసీబీ..

-నిన్న 6.5 కోట్ల అక్రమాలు గుర్తించిన ఏసీబీ..

-ఈ స్కామ్ లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు

-కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ..

-కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు

-తింకశల వెంకటేష్ ల(Hemoque)హేమోవీ

-నకిలీ ఇండెన్స్, ఎక్కవగా కోడ్ చేసి తప్పుడు లెక్కలతో అక్రమాలు

-అక్రమ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చిన నిందితులు.

-సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న ఏసీబీ.

2020-09-04 10:28 GMT

-తమ్మినేని వీరభద్రం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి...

-1946 - 51 మధ్య తెలంగాణ లో ఉదృతంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది దాని ఫలితంగా రైతాంగ హక్కులు సాధించిన గొప్ప   పోరాటం...

-ఆ పోరాటం లో 4000 మంది కమ్మునిస్ట్ లు చనిపోయారు 3వేల గ్రామాలు విముక్తి సాధించాయి..

-సెప్టెంబర్ 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి సెప్టెంబర్17 వరకు వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం..

-విలినాన్ని బీజేపీ పూర్తిగా వక్రీకరిస్తుంది హిందూ -ముస్లింల విభజన గా చూస్తుంది...

-కోవిడ్ నిబంధనలకు లోబడి అన్ని కార్యక్రమాలు ఉంటాయి..

-జిఎస్టీ బాకీలు చెల్లించలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు.ఇది బాధ్యత రాహిత్యం...

-అక్రమ లే అవుట్లు కట్టడాల పై రెగ్యులరైజ్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోంది.. జీవో 131 ని వెంటనే ఉపసంహరించుకోవాలి...

-ఈ నెల 8 న రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టీ పై కేంద్ర ప్రభుత్వం కి నిరసనగా కార్యక్రమాలు ఉంటాయి..-

2020-09-04 10:16 GMT

-వి.హనుమంతరావు , కాంగ్రెస్ సీనియర్ నేత

-ల్యాండ్ సీలింగ్ తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూర్చారు.

-సీఎం కేసీఆర్.. పీవీ కి భారతరత్న అంటున్నరు. మేం మద్దతిస్తాం.. ఆయన అర్హుడు.

-పీవీ బేసిక్ ఐడియాలజీ ప్రకారం భూసంస్కరణలపై దృష్టి పెట్టండి.

-ఎస్సీ ల భూమి మాయమవడంలో తహసీల్దార్ నాగరాజు పాత్ర ఉంది. దీనిపై విచారణ జరపాలి.

-రెవెన్యూ సంస్కరణలు పక్కగా ఉండాలి. తహసీల్దార్ లు కోట్లకు పడగలెత్తుతున్నరు. రైతులు, పేదలు నష్టపోతున్నరు.

-మా పార్టీ లో డిస్కషన్ చేయాలని.. సమగ్ర భూచట్టం మీద సెమినార్ పెట్టాలని లేఖ రాశా.

2020-09-04 09:48 GMT

-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి@అసెంబ్లీ హాల్

-అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన ఏర్పాట్లను సీఎస్ ఆధ్వర్యంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నాము

-కరొనా నేపథ్యంలో ఈ సమావేశాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు.

-ప్రైవేట్ హాస్పటల్స్ కంటే ప్రభుత్వ హాస్పటల్స్ లలో రికవరీ రేట్ ఎక్కువగా ఉంది.

-పీపీఈ కిట్లు- ర్యాపిడ్ కిట్లు- ఆక్సిమిటర్స్- అంబులెన్స్ లు అసెంబ్లీ లో రెండు--శాసనసభ రెండు ఏర్పాటు.

-అసెంబ్లీ సెక్రెటరీ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు కొరొనా టెస్టులు.


2020-09-04 09:40 GMT

-ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ దూకుడు....

-నిన్న మరో 6.5 కోట్ల అక్రమాలను గుర్తించిన ఏసీబీ..

-మరో 6 గురు నిందితులను గుర్తించిన ఏసీబీ..

-కార్యాలయాలతో పాటు పలువురు నివాసాల పై 12 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ...

-ఇప్పటికే ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ...

-మాజీ డైరెక్టర్ దేవికారాని ఆస్తుల చిట్టా పై విచారణ వేగవంతం చేస్తున్న ఏసీబీ..

-10 కోట్ల బంగారం డాక్యుమెంట్లను పరీశీలిస్తున్న ఏసీబీ..

-నేడు మరికొంత మందిని విచారించనున్న ఏసీబీ.

Tags:    

Similar News