Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-03 02:38 GMT
Live Updates - Page 3
2020-10-03 05:19 GMT

నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్ళకు అధికారుల కసరత్తు

ఈ నెల 7 నుంచి కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు.

జిల్లాలో 557 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు.

2020-10-03 05:18 GMT

మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పై రివ్యూ.

ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం.

పట్టభద్రుల ఓటర్ నమోదు సీరియస్ గా తీసుకోవాలని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకు సూచించనున్న సీఎం.

ఒక్కొక్క జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్న సీఎం కేసీఆర్.

గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదుల పై ఇప్పుటికె ప్రజలకు అవగహన కల్పిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎవరు అనేది ఎమ్మెల్యే లకు సూచించనున్న సీఎం కేసీఆర్..

ప్రగతి భవన్ కు వచ్చే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మధ్యాహ్నం భోజనం కూడా ప్రగతి భవన్ లో ఏర్పాటు చేయాలని సిబ్బంది కి ఆదేశించినట్లు సమాచారం.

2020-10-03 05:18 GMT

మధ్యాహ్నం ghmc ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ ఎన్నికల పై ఆల్ పార్టీ మీటింగ్.

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధుల హాజరు.

గ్రేటర్ ఎన్నికల పై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోనున్న సీఎస్.


2020-10-03 05:17 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా


సరస్వతి బ్యారేజ్


10 గేట్లు ఎత్తిన అధికారులు


పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు


ప్రస్తుత సామర్థ్యం 117.500 మీటర్లు


పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ


ప్రస్తుత సామర్థ్యం 7.58 టీఎంసీ


ఇన్ ఫ్లో 46,000 క్యూసెక్కులు


ఔట్ ఫ్లో 20,000 క్యూసెక్కులు


2020-10-03 05:17 GMT

హైదరాబాద్ నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద ఉన్న పురాతనమైన లింగంపల్లి మార్కెట్ కూల్చివేతను ప్రారంభించిన జిహెచ్ఎంసి అధికారులు.

మార్కెట్ శిథిలావస్థకు చేరడంతో... దానిని కూల్చివేసి , అదే స్థానంలో నూతన మార్కెట్ ను నిర్మించనున్న బల్దియా.

ఎన్నో ఏళ్లుగా తాము జీవనం సాగిస్తున్న మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలంటూ ఆందోళనకు దిగిన వ్యాపారులు.

భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతను కొనసాగిస్తున్న అధికారులు.


2020-10-03 05:16 GMT

నల్గొండ : పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు.... మధ్యాహ్నం మీడియా ముందుకు నిందితులు.


2020-10-03 05:15 GMT

సిద్ధిపేట: ముంపు గ్రామమైన వేములఘాట్ ఏంపీటీసీ ఘణపురం కల్పన శనివారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దత్తు తెలుపుతూ మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిక.


Tags:    

Similar News