Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 03 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ: తె.05-06 వరకు తదుపరి తదియ | రేవతి ఉ.08-11 వరకు తదుపరి అశ్వని | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: రా.02-49 నుంచి 04-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సరస్వతి బ్యారేజ్
10 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 117.65 మీటర్లు
పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 7.87 టీఎంసీ
ఇన్ ఫ్లో 42,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 20,000 క్యూసెక్కులు
కేంద్ర ప్రభుత్వనికి రాసిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...
జగన్మోహన్ రెడ్డి తో డిన్నర్ చేసుకునే మీరు ఇద్దరు కూర్చొని జలవివాదలపై ఎందుకు మాట్లాడుకోరు..
మీరు ఇద్దరు కూర్చుని చర్చించుకుంటాం అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది..
జలవివాదంలో కేంద్ర ప్రభుత్వనిది ఏ పొరపాటు లేదు..
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక అంగీకారానికి వస్తే కేంద్రం ఎందుకు వద్దు అంటుంది..
మహారాష్ట్ర రాష్ట్ర , తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే కేంద్రం అంగీకరించలేదా..?
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి చర్చించుకొని కావలసినటువంటి హక్కు సాధించుకోవాలి..
లేదు అంటే సమస్యలు పరిష్కారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
గత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే వాయిదా వేయించారు ..
ఇద్దరు కలిసి కూర్చుని చర్చించుకుని సమస్య పరిష్కారం చేసుకోవాలనిజరగాలని కోరుకుంటున్నాను ..
తెలంగాణ హక్కులు తెలంగాణ కాపాడాలి తెలంగాణకు అన్యాయం జరగకూడదు ...
కాంగ్రెస్ టిడిపి హయాంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని అందరికీ తెలుసు ..
రెండు రాష్ట్రాలు కూడా ఇప్పటికైనా కూర్చొని సమస్యను పరిష్కారించుకోవాలి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి @ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో
రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది..
దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు కార్యకర్తలు అ విస్తృతంగా కార్యక్రమలు చేపట్టారు..
రాష్ట్రంలో బిజెపి బలపడాలని టీఆరెఎస్ కు ప్రత్యామ్నయంగా ఎదగాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు...
ఒకసారి జాతీయ పార్టీ చెప్పిన తర్వాత అభ్యర్థిని అధికారికంగా ప్రకటన చేస్తాం
మరిన్ని ఎన్నికల ప్రచార రూపకల్పన చేయాలని నిర్ణయం తీసున్నం సుకున్నాం
యాదాద్రి ఆలయంలో కోవిడ్ నిబంధనల్లో సడలింపులు.
యాదాద్రి: యాదాద్రి దేవస్థానంలో కోవిడ్ నిబంధనల్లో సడలింపులు.....
రేపటి నుంచి అభిషేకాలు, అర్చనలు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన, వ్రతాలు పునరుద్ధరణ.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అనుమతి.
బీజేపీ కార్యాలయంలో ముగిసిన ముఖ్యనేతల సమావేశం
దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయం
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమ వైపు తిప్పుకుంటామంటోన్న కమలనాధులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇల్లందు ఎమ్మెల్యే హరి ప్రియ భర్త హరి సింగ్, తనను వేధిస్తున్నారని హత్య చేయడానికి ప్రయతీస్తున్నారని నాకు రక్షణ కల్పించాలని కొత్తగూడెంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన ఇల్లందు కు చెందిన యువకుడు సుదర్శన్..
టీఎస్ హైకోర్టు....
ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని హైకోర్టు ఆదేశం
సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశం
నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్ లాక్ విధానం ప్రకటించిన హైకోర్టు
హైకోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని నిర్ణయం
జిల్లాల్లో కోర్టులు తెరిచి భౌతిక విచారణ కొనసాగించాలని నిర్ణయం
బండి సంజయ్ ....,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పాని పాట లేని ఇతర పార్టీలు వ్యవసాయ చట్టాలపై రాద్ధాంతం చేస్తున్నాయి.. వాటి కుట్రల కుతంత్రాలు బట్టబయలు చేస్తాం
ప్రతి రైతును కలిసి వ్యవసాయ చట్టాల పై వివరిస్తాం
భారత దేశ చరిత్రలో ఎవరు చేయని సాహసం నరేంద్ర మోడీ నేతృత్వంలో ని బీజేపీ ప్రభుత్వం చేసింది
దళారి వ్యవస్థకు రాజకీయ పార్టీలు మద్దత్తు తెలుపుతున్నాయి..
దళారి వ్యవస్థను రూపు మాపేందుకు తెచ్చిన చట్టం ఇది..
మార్కెట్ యార్డ్ లలో రైతులు దోపిడీకి గురవుతున్నారు
రైతుల కు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 న కాదు... సెప్టెంబర్ 26 న
సీఎం ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి
ప్రజల్ని ఎలా దోచుకోవడం, ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనే ఎప్పుడు ఆలోచిస్తారు
విశ్వాస ఘాతకుడు సీఎం కేసీఆర్
సీఎం కి చట్టం గురించి అన్ని తెలుసు మోడీ కి పేరు వస్తుందని వ్యతిరేకిస్తున్నారు
కళ్ళుండి నిజాలు చూడాలని కాబోది కేసీఆర్
కుళ్లు కుతంత్రాలతో నిండి పోయిన నీ మనసును ప్రక్షాళన చేసుకో
తాను పండించిన రైతు తన పంటకు ధరను నిర్ణయించుకోవడం తప్పా
మార్కెట్ యార్డ్ లో రైతు ల దగ్గర టాక్స్ లు వసూల్ చేస్తున్న వారికి చేస్తున్నది మాత్రం శూన్యం
రైతు తన కొడుకు రైతు కాకూడదు అనే భావనతో ఉండే వాడు... ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది..
ఇరిగేషన్ అంశాల పై ఇప్పుడు కేంద్రానికి లేఖ రాసిన సీఎం ఈ 6 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు... సోయి లేకుండా ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడు
అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడొచ్చు కదా... లేఖ రాయడం వెనుక ఉద్దేశ్యం ఏంది... ?
కాంగ్రెస్ పార్టీ ని పట్టించుకునే పరిస్థితి తెలంగాణ లో లేదు
దుబ్బాక లో trs నేతలు కాళ్ళ వేళ్ల పడుతున్నారు ... పైసలు తీసుకున్న ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారికే ఓటు వేస్తారు.
యూపీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ..
రేపు హైదరాబాదులో యూపీఎస్సీ పరీక్ష ఉదయం సాయంత్రం రెండు పరీక్షల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు...
ముఖ్యమైన బస్టాప్ లలో అభ్యర్థులకు అవసరమైన బస్సుల సమాచారం తెలియజేసినందుకు సూపర్వైజర్ లను నియమించిన ఆర్టీసీ...
ఇందుకోసం 6 జిపు ల ద్వారా తనిఖీ సిబ్బందితో ఉదయం సాయంత్రం నిఘా ఏర్పాటు...
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ ఏర్పాట్లు...
అభ్యర్థులకు అవసరమైన సమాచారం తెలియజేసేందుకు కోటి 9959226160, రేతి ఫైలు 9959226154 ఈ నెంబర్ల ద్వారా తమకు కావాల్సిన ప్రయాణ సమాచారం పొందవచ్చు..
మరొకొద్ది సేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం.
దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక పై చర్చ.
హాజరు కానున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయపార్టీ ఉపాధ్యాయక్షురాలు డీకే అరుణ , పార్టీ జాతీయ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ , దుబ్బాక పార్టీ ఇంచార్జ్ జితేందర్ రెడ్డి .