బండి సంజయ్ ....,బీజేపీ రాష్ట్ర... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
బండి సంజయ్ ....,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పాని పాట లేని ఇతర పార్టీలు వ్యవసాయ చట్టాలపై రాద్ధాంతం చేస్తున్నాయి.. వాటి కుట్రల కుతంత్రాలు బట్టబయలు చేస్తాం
ప్రతి రైతును కలిసి వ్యవసాయ చట్టాల పై వివరిస్తాం
భారత దేశ చరిత్రలో ఎవరు చేయని సాహసం నరేంద్ర మోడీ నేతృత్వంలో ని బీజేపీ ప్రభుత్వం చేసింది
దళారి వ్యవస్థకు రాజకీయ పార్టీలు మద్దత్తు తెలుపుతున్నాయి..
దళారి వ్యవస్థను రూపు మాపేందుకు తెచ్చిన చట్టం ఇది..
మార్కెట్ యార్డ్ లలో రైతులు దోపిడీకి గురవుతున్నారు
రైతుల కు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 న కాదు... సెప్టెంబర్ 26 న
సీఎం ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి
ప్రజల్ని ఎలా దోచుకోవడం, ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనే ఎప్పుడు ఆలోచిస్తారు
విశ్వాస ఘాతకుడు సీఎం కేసీఆర్
సీఎం కి చట్టం గురించి అన్ని తెలుసు మోడీ కి పేరు వస్తుందని వ్యతిరేకిస్తున్నారు
కళ్ళుండి నిజాలు చూడాలని కాబోది కేసీఆర్
కుళ్లు కుతంత్రాలతో నిండి పోయిన నీ మనసును ప్రక్షాళన చేసుకో
తాను పండించిన రైతు తన పంటకు ధరను నిర్ణయించుకోవడం తప్పా
మార్కెట్ యార్డ్ లో రైతు ల దగ్గర టాక్స్ లు వసూల్ చేస్తున్న వారికి చేస్తున్నది మాత్రం శూన్యం
రైతు తన కొడుకు రైతు కాకూడదు అనే భావనతో ఉండే వాడు... ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది..
ఇరిగేషన్ అంశాల పై ఇప్పుడు కేంద్రానికి లేఖ రాసిన సీఎం ఈ 6 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు... సోయి లేకుండా ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడు
అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడొచ్చు కదా... లేఖ రాయడం వెనుక ఉద్దేశ్యం ఏంది... ?
కాంగ్రెస్ పార్టీ ని పట్టించుకునే పరిస్థితి తెలంగాణ లో లేదు
దుబ్బాక లో trs నేతలు కాళ్ళ వేళ్ల పడుతున్నారు ... పైసలు తీసుకున్న ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారికే ఓటు వేస్తారు.