Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-03 02:34 GMT
Live Updates - Page 2
2020-10-03 12:43 GMT

అమరావతి


బుద్ధా వెంకన్న టీడీపీ ఎమ్మెల్సీ


మంత్రి పదవిపోతుందనే, ధర్మాన మతిచలించి మాట్లాడాడు


వెధవలకు పదవులిస్తే, ధర్మానలానే మాట్లాడతారు.


మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, 420 మంత్రి అన్నమాటలన్నీ ఆయనకే వర్తిస్తాయి.


చంద్రబాబుని, టీడీపీనేతలను తిడితే సాక్షిమీడియాలో బాగాచూపిస్తారనే మంత్రులు దుర్భాషలాడుతున్నారు.


దేవుడున్నాడని పదేపదే చెప్పే జగన్ కు, రాబోయే ఎన్నికల్లో, ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యే మిగులుతుంది.


ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే సబ్బంహరి ఇంటిగోడను కూల్చారు.


కూల్చడం అంటూ మొదలుపెడితే, అవినీతిపునాదులపై కట్టిన జగన్ ఇంటినే ముందు కూల్చాలి.


తనపై ఉన్న కేసులనుమాఫీ చేయించుకోవడానికే విజయసాయి ఎంపీ అయ్యాడు.


ఆయనలాంటివాళ్లు రాజ్యసభకు వెళ్లబట్టే, పెద్దలసభ ప్రతిష్ట దెబ్బతిన్నది.


మితిమీరి మాట్లాడే వారందరికీ టీడీపీ ప్రభుత్వం రాగానే వడ్డీతో సహాచెల్లిస్తాం.


2020-10-03 12:42 GMT

శ్రీకాకుళం జిల్లా..


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతి రైతులను ఉద్దేశ్యించి


మంత్రి ధర్మాన కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు.


ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చావు.


ఒకసారి మోదీ, ఒక సారి వాజ్ పాయ్ ముఖంతో ముఖ్యమంత్రి అయ్యావు.


సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రి గా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన నీకు విజ్ఞత, పరిణితి ఎక్కడ ఉంది.


రాజధాని ప్రకాశం జిల్లా,నూజివీడు ప్రాంతం లో వస్తుందని చెప్పి అమరావతిలో నీ మనుషులతో భూములు కొనిపించావు.


తరువాత అమరావతి రాజధాని చెప్పావు.


అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తే


రాజధాని రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నావు.


రైతులను అన్యాయం గా రెచ్చగొట్టి పెయిడ్ వర్కర్స్ తో ఉద్యమాన్ని నడిపిస్తున్నావు.


టీషర్టు, టర్కీ టవల్ వేసుకుని అన్యాయం జరిగిపోతోందంటున్నారని చెబుతూ వాడకూడని పదజాలాన్ని ఉపయోగించిన మంత్రి.


నేను మాట్లాడిన మాటలు ప్రెస్ వారు రాసుకొండి ఫరవాలేదు.


పాపాత్ముల కోసం మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు తెలియకుండానే వస్తున్నాయి.


ఎంత నిగ్రహించుకున్నా ఆగడం లేదు.


రైతులను మోసం చేసి ఎవరూ బాగుపడలేదు అనే బాధతో మాట్లాడుతున్న మాటలు ఇవి.


మూడు ప్రాంతాల ను అభివృద్ధి చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి.


అధికార వికేంద్రీకరణ కోసం నేను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను సిద్ధం.


చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఈ ముగ్గురిలో ఎవరితో అయినా నేను పోటీ కు సిద్ధం.


నాతో ఎవరు పోటీ కు వస్తారో తేల్చుకొండి.


2020-10-03 09:29 GMT

కృష్ణాజిల్లా


గన్నవరం నియోజకవర్గంలో తారాస్ధాయికి చేరిన గ్రూపు తగాదాలు


బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వైసీపీ లొల్లి


సచివాలయ భూమి పూజ కార్యక్రమంలోనే రెండు వర్గాలుగా తగాదా


భూమిపూజా కార్యక్రమంలో బాహాబాహీకి దిగిన రెండు వర్గాల వైసీపీ కార్యకర్తలు


ఎంఎల్ఏ వంశీ సమక్షంలోనే తగాదా జరగడం సంచలనంగా మారింది


2020-10-03 09:28 GMT

నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి..


EC గంగిరెడ్డి మరణంపట్ల ప్రఘాడసంతాపం తెలియజేస్తున్నాను...


గంగిరెడ్డి బెనారస్ లో విద్యాబ్యాసం నుండి వామాపక్ష అభిమానిగావున్నారు..


యెర్రగుంట్లలో ఒకదఫా కామ్రెడ్ చండ్రరాజేశ్వరరావు , వికే. ఆది నారయణరెడ్డి తదితురలపై దాడిజరిగినపుడు స్వర్గీయ గంగిరెడ్డి స్వయంగా తమ యింటికి అహ్వానించి అర్దరాత్రి పూట దాదాపు 50 మందికి బోజనాలు ఏర్పాటు చేశారు...


జిల్లాలో చిన్నపిల్లల వైద్యులుగా , ఒక రూపాయి డాక్టర్ గా ప్రసిద్దిచెందిన గంగిరెడ్డిగారిమరణం పట్ల సంతాపం తెలియజేస్తూ వారికుటుంబ సబ్యులకు సానుబూతి తెలియజేస్తున్నాను.


2020-10-03 09:28 GMT

కడప :


పులివెందుల చేరుకున్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయం...


ఎంపి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కెవిపి రామచంద్రరావు, తులసిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి... తదితర ప్రముఖుల నివాళి...


2020-10-03 07:19 GMT

అమరావతి

అనివార్య కారణాల వల్ల ఈ నెల 5 న జరగాల్సిన జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా

త్వరలో మరో తేదీ ఖరారు చేస్తామని చెబుతున్న సీఎంవో కార్యాలయం


2020-10-03 07:19 GMT

అమరావతి-


అక్టోబరు 16 తేదీన కనక దుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ,


ముఖ్యమంత్రి వైఎస్ జగన్


వర్చువల్ విధానంలో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్న నేతలు


రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో పాటు భూమిపూజ


కార్యక్రమాల్లో పాల్గోనున్న నితిన్ గడ్కరీ

7584 కోట్ల రూపాయల విలువైన 16 ప్రాజెక్టుల భూమిపూజ

పూర్తైన 8038 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్. - ఎం.టి.కృష్ణబాబు, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి


2020-10-03 07:19 GMT

అమరావతి


రాష్ట్రంలో రెండు శిల్పారామాల అభివృద్ధికి పరిపాలన అనుమతులు


మొత్తం 13 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన సర్కార్


శ్రీకాకుళం లో కొత్త శిల్పారామం ఏర్పాటు లో భాగంగా తోలివిడత పనులకు మూడు కోట్ల రూపాయలు


తిరుపతి శిల్పారామం లో పలు అభివృద్ది కార్యక్రమాలకి 10 కోట్ల రూపాయిలు కేటాయించిన ప్రభుత్వం


ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్


2020-10-03 07:18 GMT

అమరావతి

సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి కి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్

భారతీ రెడ్డి తండ్రి గంగిరెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్

ప్రజల డాక్టర్ గా పేదల డాక్టర్ గా కడప జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియా డిన గవర్నర్


2020-10-03 07:18 GMT

తూర్పుగోదావరి.. పెద్దాపురం..

మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్...

నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు బూతులు మాట్లాడడం సంస్కార హీనం.

మంత్రి కృష్ణ దాసు తిరిగి ఉచ్చరించడానికి కూడా వీల్లేకుండా మాట్లాడారు – ఓ డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? :

ఫైగా నిర్లజ్జగా రాసుకోండి ఏమీ భయం లేదని బహిరంగంగా మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది.

వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు – జగన్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్

అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం నడుపుతున్నారంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాన వెంటనే క్షమాపణలు చెప్పాలి

Tags:    

Similar News