Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-02 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-02 14:17 GMT

తెలంగాణ... 

-కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి రామచంద్ర రెడ్డి....

-మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది....

-మియపూర్ న్యూ సైబర్ హిల్స్ లో కుటుంవంతో నివాసం ఉంటున్న రామచంద్ర రెడ్డి....

-బెడ్ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని రామచంద్ర రెడ్డి ఆత్మహత్య....

-తన వల్ల ఇంట్లో కుటుంబకులకు కారోనా సోకకూడదనే ఉద్దేశంతో తను ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లభ్యం....

-రామచంద్ర రెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియపూర్ పోలీసులు....

2020-10-02 13:34 GMT

హైదరాబాద్..

-నూతన వ్యవసాయ చట్టంపై భారతీయ జనతా కిసాన్ మోర్ఛా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం...

-సోమాజిగూడాలోని ఎన్ కే ఎమ్ గ్రాండ్ హోటల్ లో రౌండ్ టేబుల్ సమావేశం..

-రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ..

-సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ నిపుణులు, మేధావులు..

2020-10-02 13:31 GMT

లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మొర్చా అధ్యక్షులు...

-ప్రస్తుతం ఉన్న పరిస్థతుల్లో ఎక్కడైతే పండిస్తాడో అక్కడే అమ్ముకోవాలని ఉంది కానీ కొత్త చట్టం ద్వారా రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు..

-తెలంగాణ లో రైతులు 400 కోట్లు ప్రభుత్వానికి సేస్ పేరుతో చెల్లిస్తున్నారు ..

-మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగం లో నిపుణులు సిఫార్సు చేసినవి మాత్రమే అమలు చేశారు...

-రైతులకు న్యాయం జరగాలంటే దళారుల వ్యవస్థ పోవాలని ఆ రోజు నిపుణులు సూచించారు...

-వ్యవసాయ బిల్లు కు సంబంధించి రాజకీయాలు చేయకండి.దీని వల్ల రైతులు నష్టపోతున్నారని రైతులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు..

-రాష్ట్రం లో నేరుగా 30 లక్షల మందికి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుంది..

-యువత గ్రామాలకు వెళ్లి వ్యవసాయం పైన మొగ్గుచూపుతున్నారు...

-రైతు సంఘాలకు విజ్ఞప్తి రైతులకు మేలు జరిగేలా చూడండి రాజకీయ నాయకులు చెప్పుడు మాటలు నమ్మకండి...

2020-10-02 13:24 GMT

-జయ ప్రకాష్ నారాయణ లోకసత్తా వ్యవస్థాపకులు ..

-2011 లో దేశం మొత్తం లో 8 కోట్ల టన్నుల ధాన్యాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా అంతే నిల్వలు ఉన్నాయి..

-ప్రపంచం లో ఇతర దేశలో బియ్యం ధరలు భారీగా ఉన్నప్పుడు మన దగ్గర నిల్వలు ఎక్కువగా పెంచి ప్రభుత్వం ఎగుమతులు నిషేధించింది ఫలితంగా   ధరలు పూర్తిగా పడిపోయాయి...

-2012 లో మన రాష్ట్రంలో 750 పలికితే పక్క రాష్ట్రం లో 1200 పలుకుతుంది రైతులు పక్క రాష్ట్రాలకి అమ్మడానికి లేదు అని ఆంక్షలు విధించింది దాని ద్వారా   రైతులు తీవ్రంగా నష్టపోయారు...

-1.రైతులు పండించిన ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవాలని

-వ్యవసాయ చట్టాల్లో మార్పులు అవసరం రైతులకు గుత్తాధిపత్యం ఉండాలి...

-పండించిన దాన్యం ఎక్కడ రేటు వస్థే అక్కడ అమ్ముకోవాలి...

-2.నిత్యావసర వస్తువుల చట్టం కొరత వచ్చినప్పుడు ధరలు పెరిగినప్పుడు ఉన్నపలంగా ఎగుమతులు నిషేదిస్తరు దీని ద్వారా రైతులు నష్టపోతారు..

-ఎవరు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అన్నప్పుడు ధరలు పెరుగుతాయని అందరిలో భయం ఉంది

-నిల్వ ఉండడం వల్ల ధరలు పెరుగుతాయనడం ఆధారాలు లేని వాదన..ఇది ఆర్థిక శాఖ ములసుత్రాలకు పూర్తిగా విరుద్దం..

-3.కాంట్రాక్ట్ వ్యవసాయం..దీనిపై రైతులకు స్వేచ్చ ఉంటుంది ..

-దీని వల్ల కాంట్రాక్ట్ వాళ్ళు సహాయం చేస్తారు.రేటు వస్తేనే అమ్మావచ్చు లేదంటే వదులుకోవాలి...

-రైతులకు ఆంక్షలు లేకుండా స్వేచ్చ గా చేసుకున్న వ్యవసాయం ఈ బిల్లులు చెప్తుంది..

-ఈ చట్టాలు అద్భుతం కాదు ఇది రైతులకు అవసరం..

-ప్రభుత్వాలకు సూచనలు:

1. పంటలు నిల్వలు చేసుకోవడానికి సరైన గిడ్డంగి సదుపాయం ఉండాలి రెట్లు వచ్చినప్పుడు రైతులు అమ్ముకుంటారు..

2. రైతులకు కొనుగోలుదారులకు మధ్య దళారుల వ్యవస్థ ఉంది.దీని ద్వారా రైతులు నష్టపోతున్నారు..

3. అంతర్జాతీయ వాణిజ్యం లో పాలుపంచుకోవాలి..

2020-10-02 13:17 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-46 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 95.10 మీటర్లు

-ఇన్ ఫ్లో 1,21,100 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 1,41,200 క్యూసెక్కులు

2020-10-02 13:13 GMT

కిషన్ రెడ్డి @ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి...

-అన్ని ఉత్పత్తుల ధరలు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి..

-రైతులు విత్తనాల తయారు గతంలో రైతులే తయారు చేసుకునే విధానం ఉండేది..

-ఇప్పుడు విత్తనాల నుండి ఎరువుల తయారీ వరకు అన్ని బహుళ జాతి కంపెనీలమయం అయిపోయింది..

-రైతులకు లాభాలు చేకూర్చడం ,రైతుల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చింది...

-పంజాబ్ లో జరుగుతున్న ఉద్యమం కేవలం రైతులు కాకుండా పోటీ పడి రాజకీయ నాయకులే ఆందోళన చేస్తున్నాయి..

-కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చారు ఇప్పుడే అదే పార్టీ వ్యతిరేకిస్తుంది..

-రాష్ట్ర ముఖ్యంత్రికి దీనిని వ్యతిరేకిస్తున్న నాయకులకు సవాల్ ఎం ఎస్పీ నీ రద్దు చేయదలుచుకొలేదు..

-పత్తి ,ధాన్యం ,గోధుమలు చివరి గింజ వరకు భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

-గతంలో కంటే ఎక్కువ కాటన్ కొనుగోలు కేంద్రాలు తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నాం..

-ఆహార బద్రత పథకం ద్వారా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్ సప్లై చేస్తుంది...

-రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ కి సుమారు 80 వేల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాం..

2020-10-02 10:48 GMT

సిద్దిపేట: సిద్దిపేట పట్టణం రెడ్డి సంక్షేమ భవనంలో మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో

కీ,శే సోలిపేట రామలింగారెడ్డి యాదిలో... 'స్వప్న సాధకుడు' పుస్తకావిష్కరణ సభ...

పాల్గొన్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రసమయి బాలకిషన్, నందిని సిధారెడ్డి,

హరీష్ రావు కామెంట్స్ :

👉 మరసం అనేక సభలో నేను, లింగన్న అనేక వేదికలు పంచుకున్నాము.. ఈరోజు మన మధ్యలో లింగన్న లేకపోవడం బాధాకరం..

👉వార్త రిపోర్టర్ గా ఉన్న నాటి ఇల్లు,ఇప్పటికీ అదే ఇల్లు అదే పద్ధతి ఏమాత్రం మార్పులు లేవు

లింగన్న ధర్మం పక్షాన నిలిచిన వ్యక్తి ..

👉 స్టూడెంట్ జీవితం నుండి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి.. సీఎం కెసిఆర్ గోదావరి జలాలను మంజీర నదిలో కలపడం జరిగింది

👉కాళేశ్వరం నీళ్లతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతి ఏకరాని నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారు.

👉 2019లో 27లక్షల ఎకరాల వరి సాగు అయితే, ఇప్పుడు 54 నాలుగు లక్షల ఎకరాల వరి సాగు చేస్తున్నారు..

👉గతంలో దుబ్బాకలో తాగునీరు దొరికేది కాదు.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత,లింగన్న ఆధ్వర్యంలో దుబ్బాక ప్రజలకు తాగునీరు ఇవ్వడం జరిగింది..

👉 ప్రతి ఇంటికి తాగునీరు,సాగు నీరు ఇవ్వడమే రామలింగ రెడ్డి లక్ష్యం.. నా మిత్రునిగా,ఉద్యమ కారుడిగా లింగన్న ఆశయాలను నేరవేస్తాను..

2020-10-02 10:42 GMT

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దుబ్బాక నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల నినాదాలు..

- దుబ్బాక ఉపఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టాలని పెద్దఎత్తున నినాదాలు..

- దుబ్బాకలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, రమేష్ గుప్తా గెలిచే అభ్యర్థి అని నేతల వాదన..

- ఎన్టీఆర్ విగ్రహం వద్ద హల్ చల్ చేసిన నాయకులు, కార్యకర్తలు టిటిడిపి అధ్యక్షుడు యల్.రమణ రూమ్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు...

2020-10-02 10:38 GMT

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దుబ్బాక నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల నినాదాలు..

- దుబ్బాక ఉపఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టాలని పెద్దఎత్తున నినాదాలు..

- దుబ్బాకలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, రమేష్ గుప్తా గెలిచే అభ్యర్థి అని నేతల వాదన..

- ఎన్టీఆర్ విగ్రహం వద్ద హల్ చల్ చేసిన నాయకులు, కార్యకర్తలు టిటిడిపి అధ్యక్షుడు యల్.రమణ రూమ్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు...

2020-10-02 10:34 GMT

కామారెడ్డి : రైతు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామరెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా

షబ్బీర్ అలీ ఇంటి నుంచి గాంధీ గంజ్ వరకు భారీ ర్యాలీ

బీజేపీ హటావ్.. దేశ్ కో బచావ్ అంటూ నినాదాలు

షబ్బిర్ అలీ కామెంట్స్

- కేంద్ర ప్రభుత్వం రైతులను చులకనగా చూస్తోంది

- అందుకే రైతులకు అన్యాయం చేసే వ్యతిరేక బిల్లుని తెచ్చింది

- రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలి

- బిల్లు రద్దు కోసం ఈ నెల 31 వరకు సంతకాల సేకరణ చేపడతాం

Tags:    

Similar News