HARISH RAO: లింగన్న ధర్మం పక్షాన నిలిచిన వ్యక్తి : హరీష్ రావు
సిద్దిపేట: సిద్దిపేట పట్టణం రెడ్డి సంక్షేమ భవనంలో మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో
కీ,శే సోలిపేట రామలింగారెడ్డి యాదిలో... 'స్వప్న సాధకుడు' పుస్తకావిష్కరణ సభ...
పాల్గొన్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రసమయి బాలకిషన్, నందిని సిధారెడ్డి,
హరీష్ రావు కామెంట్స్ :
👉 మరసం అనేక సభలో నేను, లింగన్న అనేక వేదికలు పంచుకున్నాము.. ఈరోజు మన మధ్యలో లింగన్న లేకపోవడం బాధాకరం..
👉వార్త రిపోర్టర్ గా ఉన్న నాటి ఇల్లు,ఇప్పటికీ అదే ఇల్లు అదే పద్ధతి ఏమాత్రం మార్పులు లేవు
లింగన్న ధర్మం పక్షాన నిలిచిన వ్యక్తి ..
👉 స్టూడెంట్ జీవితం నుండి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి.. సీఎం కెసిఆర్ గోదావరి జలాలను మంజీర నదిలో కలపడం జరిగింది
👉కాళేశ్వరం నీళ్లతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతి ఏకరాని నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారు.
👉 2019లో 27లక్షల ఎకరాల వరి సాగు అయితే, ఇప్పుడు 54 నాలుగు లక్షల ఎకరాల వరి సాగు చేస్తున్నారు..
👉గతంలో దుబ్బాకలో తాగునీరు దొరికేది కాదు.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత,లింగన్న ఆధ్వర్యంలో దుబ్బాక ప్రజలకు తాగునీరు ఇవ్వడం జరిగింది..
👉 ప్రతి ఇంటికి తాగునీరు,సాగు నీరు ఇవ్వడమే రామలింగ రెడ్డి లక్ష్యం.. నా మిత్రునిగా,ఉద్యమ కారుడిగా లింగన్న ఆశయాలను నేరవేస్తాను..