కర్నూలు జిల్లలో విషాదం: మూడు గంటల వ్యవధిలో తల్లీ కొడుకుల దుర్మరణం
కర్నూలు.
- కోవెలకుంట్ల మండలం జోలదరాసి గ్రామంలో విషాదం...ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి...
- వైసిపి సీనియర్ నేత రామేశ్వర్ రెడ్డి (55) కరోనా తో మృతి.
- కుమారుడు కరోనా సోకి మృతి చెందడంతో తల్లడిల్లి పోయి,తనువు చాలించిన తల్లి .
- 3 గంటల వ్యవధిలోనే తల్లి కుమారుడి మృతి....
తూర్పుగోదావరి జిల్లా కరోనా అప్డేట్స్
తూర్పుగోదావరి
- జిల్లాలో రికార్డు స్థాయిలో కోలుకున్న కరోనా పాజిటీవ్ పేషెంట్స్
- జిల్లాలో మార్చి 21 తొలి కరోనా కేసు తాకినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకూ 21వేల 171 పాజిటీవ్ కేసు నమోదు
- గత రెండ్రోజులలో రికార్డు స్థాయిలో డిశ్చార్జిలతో 13,317కి చేరుకున్న కోలుకున్న వారి సంఖ్య
- జిల్లాలో ప్రస్తుతం 7,864 యాక్టీవ్ కేసులు
- జిల్లాలో ఇంత వరకూ 172కు చేరిన కరోనా మారణాలు
గుంటూరు జిల్లా కరోనా అప్డేట్స్
గుంటూరు...
- జిల్లాలో విజృపిస్తున్న కరోనా
- జిల్లా వ్యాప్తంగా1001పాజిటివ్ కేసులు నమోదు....
- గుంటూరు కార్పోరేషన్ అత్యధిక ంగా 333పాజిటివ్ కేసులు నమోదు...
- పిడుగురాళ్ల లో 94కేసులు....
విశాఖ జిల్లా కరోనా అప్డేట్స్
విశాఖ
- విశాఖ లో కొనసాగుతున్న వైరస్ వర్రీ..
- అనూహ్యంగా నిన్న ఒక్కరోజు 11 వందల కు పైబడి కరోనా పోజటీవ్ కేసులు.
- ఇప్పటికే 12 వేలు దాటిన కేసులు...
శ్రీకాకుళం జిల్లా కరోనా అప్డేట్స్
శ్రీకాకుళం జిల్లా..
- జిల్లాలో 7,133 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..
- ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3895 మంది బాధితులు డిశ్చార్జ్..74 మంది మృతి..
- ప్రస్తుతం జిల్లాలో 3164 ఆక్టీవ్ కేసులు..
తుంగభద్ర హెచ్ఎల్సీ నీరు ఆంధ్రాకు
అనంతపురం:
తుంగభద్ర హెచ్ఎల్సీ నీరు ఆంధ్రాకు చేరిక.
500 క్యూసెక్కుల నీరు సరిహద్దు నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవాహం.
వాతావరణం: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీదన ద్రోణి
వెదర్ అప్ డేట్
- ఈ నెల 4 వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.
- ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ..
- వీటీ ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర లో వర్షాలు
బెరైటీస్ గనుల తవ్వకాల పనులు తాత్కాలికంగా నిలిపివేత
కడప :
- ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట బెరైటీస్ గనుల తవ్వకాల పనులు తాత్కాలికంగా నిలిపివేత...
- ఏపీఎండీసీ మంగంపేట శాఖలో పనిచేసే కార్మికుల్లో 10 మందికి సోకిన కరోనా ...
- బెరైటీస్ గనుల్లో డీవాటరింగ్ పనులు మినహాయించి అన్ని విభాగాల పనులు తాత్కాలికంగా నిలిపివేతకు యాజమాన్యం అదేశాలు...
గంజాయి పట్టివేత
తూర్పుగోదావరి
- రాజవొమ్మంగి మం. జడ్డంగిలో రూ.3లక్షల విలువైన 150 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు
- గంజాయి తరలిస్తున్న జీపు స్వాధీనం
- తమిళనాడుకు చెందిన ఇరువుర్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు
తూర్పుగోదావరిలో మరో మూడు కోవిడ్ కేంద్రాలు
తూర్పుగోదావరి
- కరోనా కరాళనృత్యం నేపధ్యంలో జిల్లాలో అదనంగా మరో ఆరు కొవిడ్ కేంద్రాలు
- అమలాపురం, రామచంద్రపురం, తుని ఏరియా ఆసుపత్రులను, మండపేట, పిఠాపురం, రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను కొవిడ్ కేంద్రాలుగా మారుస్తాఁ
- హోమ్ క్వారంటైన్‌లో ఉన్న కరోనా బాధితులను అత్యవసరమైతే ఆయా కొవిడ్ కేంద్రాలకు తరలిస్తాం
-జిల్లా కొవిడ్ నోడల్ అధికారి సోమసుందరరావు