Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-02 01:18 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-02 17:46 GMT

- ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 8,230 మంది

- 2601 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

- ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం 40 లక్షలు

2020-08-02 17:43 GMT

- అమరావతి: రేపు ఉదయం 11 .15 నిమిషాలకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.

2020-08-02 17:39 GMT

గుంటూరు: ఏపీ డిప్యూటీ స్పీకర్,బాపట్ల శాసనసభ సభ్యులు కోన రఘుపతికి కరోనా పాజిటివ్.

- రేపు పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నాను.

- కార్యకర్తలు, నాయకులు ఎవరు రావద్దు.

- నియోజకవర్గ ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, త్వరలోనే కరోనాను జయించి తిరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తాను.


2020-08-02 17:34 GMT

అమరావతి: ''ఈ -రక్షాబంధన్'' - ఆంధ్రప్రదేశ్ పోలీస్-సిఐడి విభాగం, సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా సైబర్ సేఫ్టీ అవేర్‌నెస్

నెల-ఆగస్టు 3 2020 ను నిర్వహిస్తున్నాయి.,

- రక్షాబంధన్ వేడుకలను ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది.

- సైబర్ క్రైమ్ నేరాలపై మహిళలకు బాలబాలికలకు మీద అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాము

- రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు కార్యక్రమం కొనసాగుతుంది

- ఈ నెలలో ఆన్‌లైన్ కార్యకలాపాలు సైబర్‌ / ఆన్‌లైన్ భద్రతా అవగాహనను వెబ్‌నార్లు, రేడియో ప్రోగ్రామ్‌లు, నిపుణుల నుండి సైబర్ చర్చలు,

- సర్వేలు, క్విజ్, నినాద రచన పోటీలు వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.

- సైబర్ నేరాల అవగాహన -వెబ్‌నార్లు పాల్గొనడానికి, చూడటానికి YouTube link

https://www.youtube.com/channel/UC9HKNl3ztEyKgSq8DcnLHMQ?view_as=subscriberయూట్యూబ్‌లో కనెక్ట్ అవ్వండి.

- సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం రేపు ప్రారంభం.

2020-08-02 13:40 GMT

తూర్పుగోదావరి: ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో మరమత్తుల నిర్వహణకోసం విద్యుత్ స్తంభం ఎక్కి షాక్ కు గురై ప్రైవేటు విద్యుత్ కార్మికుడు గుత్తుల నాగ సురేంద్ర మృతి.

మృతదేహంతో ముమ్మిడివరం సబ్ స్టేషను వద్ద 216 జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న మృతుని బందువులు. మృతుని కుటుంబానికి న్యాయం చేయ్యాలంటూ  నినాదాలు.


2020-08-02 13:35 GMT

తూర్పుగోదావరి -రాజమండ్రి: కువైట్ లో ఉపాధికై వెళ్ళిన మామిడికుదురు (మం)

- పాశర్లపూడి గ్రామానికి యువకుల ఆకలితో అలమటిస్తున్నారు. 

- కరోనా లాక్ డౌన్ కారణంగా ఐదు నెలల నుంచి ఇంట్లోనే ఉండటంవల్ల గల్ఫ్ వలస కార్మికులకు జీతాలు ఇవ్వని యాజమాన్యం.

- ఆకలితో అలమటిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉపాధి కై వెళ్ళిన యువకులు

- కనీసం మంచినీళ్లు దొరకడం లేదంటున్న బాధిత యువకులు

- ఆంధ్రలో పలు జిల్లాల నుంచి ఉపాధికై కువైట్ వెళ్ళిన యువకుల అందరి పరిస్థితి దయనీయంగా వుందని ఆవేదన చెందుతున్న గల్ఫ్ వలస కార్మికులు.

- సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి తమను జీవించి ఉండగానే తమా పిల్లలువద్దకు చేర్చాలని వేడుకుంటున్న బాధిత యువకులు, వారి బంధువులు 

2020-08-02 12:16 GMT

శ్రీకాకుళం జిల్లా:

- సంతబొమ్మాలి మండల నౌపాడలో గ్రామస్థుల ఇక్కట్లు..

- ఇళ్లలోకి చేరుకున్న వర్షపు నీరు..

- రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

- పరిస్థితి పరిశీలించేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బంది..

- అధికారులను చుట్టుముట్టిన గ్రామస్థులు..

- తమ సమస్యను పరిష్కరించేవారకు అక్కడి నుంచి వెళ్లేందుకు వీలు లేదంటూ ఆందోళన..

2020-08-02 12:15 GMT

- తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ కు కరోనా పాజిటివ్



2020-08-02 12:14 GMT

కర్నూలు జిల్లా: 

- శ్రీశైలంలో కరోనా విజ్రంభిస్తుడంతో మరో వారం రోజుల పాటు శ్రీశైలంలో భక్తుల దర్శనాల నిలిపివేత పొడిగింపు.ఈవో కేఎస్ రామారావు.

- శ్రీశైల క్షేత్ర పరిధిలో లో కరోనా కేసులు విస్తరించడంతో గత నెల 15 నుండి ఇప్పటి వరకు పొడిగిస్తూ వస్తున్నా భక్తుల దర్శనాల నిలిపివేత

- యధావిధిగా స్వామి అమ్మవార్ల నిత్యకైంకర్యాల పూజల నిర్వహణ

2020-08-02 12:10 GMT

- మరికొద్ది రోజులు హాస్పటల్ లో నే ఉండాల్సిందిగా వైద్యుల సూచన

- వైద్యుల సూచన మేరకు హాస్పటల్ లోనే చికిత్స తీసుకుంటున్నట్లు ప్రకటించిన అభిషేక్ బచ్చన్

- “దురదృష్టవశాత్తు కొన్ని కొమొర్బిడిటీల కారణంగా కోవిడ్ -19 పాజిటివ్‌గా ఉండి ఆసుపత్రిలోనే ఉన్నారు.

- నా కుటుంబం కోసం మీ నిరంతర శుభాకాంక్షలు మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు. చాలా వినయంగా, రుణపడి ఉంటాను.

- నేను దీన్ని ఓడించి (కరోనాను) ఆరోగ్యంగా తిరిగి వస్తాను! ప్రామిస్” అంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్



Tags:    

Similar News