Health Tips: వయసు ప్రకారం నిద్రపోవాలి.. లేదంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు..!
Health Tips: మనిషి తన వయస్సును బట్టి నిద్రపోవాలి.
Health Tips: మనిషి తన వయస్సును బట్టి నిద్రపోవాలి. ఒకవేళ రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి మీ వయస్సు మీ నిద్రను నిర్ణయిస్తుంది. రకరకాల వయసువారు రకరకాల నిద్రగంటలని తీసుకుంటారు. ఇలా చేయకుంటే మానసిక సమస్యలు పెరుగుతాయి. రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులు వస్తాయి. దీంతోపాటు కాలేయం, మూత్రపిండాల వ్యాధులు సంభవిస్తాయి. ఏ వయస్సు ఎన్ని గంటలు నిద్రించాలో ఈరోజు తెలుసుకుందాం.
దినచర్యలో వ్యాయామం
మీకు మంచి నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండాలంటే దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవాలి. నిద్రలేమి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యాయామం ద్వారా సరిదిద్దుకోవచ్చు. అన్నింటిలో మొదటిది మంచి నిద్ర పొందడానికి శరీర గడియారాన్ని సెట్ చేయాలి. మొబైల్ దగ్గర ఉంచుకోవద్దు. కథలు చదవడానికి, మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నించాలి. ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది.
వయస్సు ప్రకారం నిద్ర
- 3 నెలల పిల్లలు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి.
- 4 నుంచి 11 నెలల పిల్లలు రోజుకు 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి.
- 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటల నిద్ర తీసుకోవాలి.
- 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటల నిద్ర తీసుకోవాలి.
- 6 నుంచి 13 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 11 గంటల పాటు నిద్రించాలి.
- 14 నుంచి 17 ఏళ్ల పిల్లలు 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి.
- యువత 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.
- 65 ఏళ్లు పైబడిన వారు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.