Skipping: స్కిప్పింగ్‌తో సులువుగా బరువు తగ్గవచ్చు..!

Skipping: స్కిప్పింగ్‌తో సులువుగా బరువు తగ్గవచ్చు..!

Update: 2022-05-15 08:30 GMT

Skipping:స్కిప్పింగ్‌తో సులువుగా బరువు తగ్గవచ్చు..!

Skipping: స్కిప్పింగ్‌ చేయడం చాలా సులభం. ఈ సాధారణ వ్యాయామంతో మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే కొంతమంది తప్పు మార్గంలో చేస్తారు. దాని వల్ల వారు ఫలితం పొందలేరు. రోజూ అరగంట పద్దతి ప్రకారం స్కిప్పింగ్‌ చేస్తే 15 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. కానీ కొంతమంది రోజు స్కిప్పింగ్‌ చేస్తారు కానీ ఎటువంటి ఫలితం ఉండదు. దీంతో పాటు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందవచ్చు. స్కిప్పింగ్‌ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇది మీ రక్త ప్రసరణను మెరుగ్గా చేస్తుంది.

ప్రతిరోజూ 10 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం వల్ల బీపీ, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు. అయితే శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఎముకలలో నొప్పి సమస్య ఉంటే స్కిప్పింగ్‌ చేయడం వల్ల తొలగిపోతుంది. దీంతో పాటు మీ బీపీ కూడా నార్మల్‌ అవుతుంది. ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే వారు తప్పనిసరిగా స్కిప్పింగ్‌ చేయాలి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు.

ఖాళీ కడుపుతో స్కిప్పింగ్‌ చేయడం మంచిది కాదు. దీని కారణంగా కడుపులో నొప్పి సమస్య ఏర్పడవచ్చు. అంటే మీకు లాభానికి బదులు నష్టం జరుగుతుంది. అలాగే ఆహారం తిన్న వెంటనే స్కిప్పింగ్‌ చేయరాదు. మీరు 1 గంట తర్వాత ఈ వ్యాయామం చేయవచ్చు. స్కిప్పింగ్‌ చేయడానికి ముందు తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

Tags:    

Similar News