Women Health: పాల ఉత్పత్తి పెరగాలంటే బాలింతలు ఈ ఫుడ్స్‌ తినాలి.. అవేంటంటే..?

Women Health: తల్లిపాలు బిడ్డకి ఒక వరం లాంటివి. ఇందులో శిశువుకి అవసరమయ్యే అన్నిపోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

Update: 2023-08-06 15:30 GMT

Women Health: పాల ఉత్పత్తి పెరగాలంటే బాలింతలు ఈ ఫుడ్స్‌ తినాలి.. అవేంటంటే..?

Women Health: తల్లిపాలు బిడ్డకి ఒక వరం లాంటివి. ఇందులో శిశువుకి అవసరమయ్యే అన్నిపోషకాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. నవజాత శిశువు అభివృద్ధికి తోడ్పడుతాయి. అందుకే ప్రతి ఒక్క మహిళ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలని అందించాలి. అయితే తల్లి ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. అలాంటి డైట్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

మాంసాహారం

మాంసాహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాలిచ్చే తల్లులకు, శిశువులకు ఇద్దరికీ అవసరం. చికెన్, మటన్, కాలేయం వంటివి తినాలి. సీఫుడ్ తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంద. అయితే అన్నీ తినకూడదు. సాల్మన్ చేపలు, సీవీడ్, షెల్ఫిష్, సార్డినెస్ వంటివి తినవచ్చు. గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు కూడా తీసుకోవాలి. శాకాహారులైతే బాదంపాలు తాగవచ్చు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.ఇది తల్లి పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

పండ్లు, కూరగాయలు

బెర్రీలు, టమోటాలు, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలే, వెల్లుల్లి, బ్రోకలీ వంటి ముదురు ఆకుపచ్చని కూరగాయలు తినాలి. చిక్కుళ్లు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలలో మంచి ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కొత్తగా మాతృత్వాన్ని పొందిన వీటిని ఎక్కువగా తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

ఫైబర్ పదార్థాలు

బంగాళదుంపలు, బటర్‌నట్ స్క్వాష్, చిలగడదుంపలు, బీన్స్, కాయధాన్యాలు, ఓట్స్, క్వినోవా, బుక్వీట్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. మెంతులు ఫైటోఈస్ట్రోజెన్ కు మంచి మూలం. ఒక చెంచా మెంతులను ఒక కప్పు నీటితో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిపి రోజుకు 3 సార్ తీసుకోవాలి. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

ఖర్జూరం

ఖర్జూరం తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఖర్జూరాలలోని పోషకాలు ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. 8నుంచి 10 ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి. ఆహారంతో సరిపడా నీరు తాగాలి.

Tags:    

Similar News