Women Health: ప్రెగ్నెన్సీ సమయంలో ఈ విటమిన్లు తప్పనిసరి.. లేదంటే శిశువు ఎదుగుదలపై ఎఫెక్ట్..!

Women Health: అమ్మ అవ్వాలని ప్రతి మహిళ ఆరాటపడుతుంది. ప్రెగ్నెన్సీ కన్‌ఫమ్‌ అయితే ఎంతో మురిసిపోతుంది.

Update: 2024-05-02 10:30 GMT

Women Health: ప్రెగ్నెన్సీ సమయంలో ఈ విటమిన్లు తప్పనిసరి.. లేదంటే శిశువు ఎదుగుదలపై ఎఫెక్ట్..!

Women Health: అమ్మ అవ్వాలని ప్రతి మహిళ ఆరాటపడుతుంది. ప్రెగ్నెన్సీ కన్‌ఫమ్‌ అయితే ఎంతో మురిసిపోతుంది. తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోయాడం కష్టమని తెలుసు అయిన ప్పటికీ మాతృత్వపు అనుభవం కోసం అన్నిటికి సిద్దపడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ కన్‌ఫమ్‌ అవడంతో అసలు కథ మొదలవుతుంది. కడుపులో ఉండే పిండం ఎదుగుదల కోసం చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారం, విటమిన్లు, సప్లిమెంట్లతో కూడిన డైట్‌ మెయింటెన్‌ చేయాలి. లేదంటే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. అంతేకాదు డెలివరీ సమయంలో సమస్య లు ఎదురవుతాయి. ఈ రోజు ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి విటమిన్లు అవసరమవుతాయో తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ ఆరోగ్య విషయంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులకు అనుగుణంగా శరీరానికి వివిధ రకాల విటమిన్లు అవసరమవుతాయి. ప్రధానంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ అవసరం. వీటివల్ల బిడ్డ, తల్లి అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. ప్రారంభంలో న్యూరల్ ట్యూబ్ (మెదడు, వెన్నుపాము) అభివృద్ధి చెందడానికి శరీరానికి తగినంత ఫోలిక్ యాసిడ్ అవసరం. ఇది నరాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం పచ్చి కూరగాయలు, బీన్స్, పప్పులు తినడం మంచిది.

కాల్షియం

ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం తీసుకోవాలి. శిశువు అస్థిపంజరం అభివృద్ధికి శరీరానికి పెద్ద మొత్తంలో కాల్షియం అవసరమవుతుంది. బాదం లేదా ఓట్స్, బ్రోకలీ వంటి కూరగాయలు, పాలను తీసుకోవడం వల్ల శిశువు ఎముకలు దృఢంగా మారుతాయి.

ఐరన్ కంటెంట్

రక్త సరఫరా సమయంలో ఎర్ర రక్త కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఐరన్ తోడ్పడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. శరీరంలోని రక్తహీనత సమస్యను పరిష్కరించడానికి టోఫు, బీన్స్, బచ్చలికూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవడం మంచిది.

మెగ్నీషియం

గర్భధారణ సమయంలో అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటి మెగ్నీషియం. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన హృదయ స్పందన రేటు, హృదయనాళ పనితీరును మెయింటెన్‌ చేయడానికి సాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం, గుమ్మడి గింజలు, జీడిపప్పు, అవకాడో వంటివి తీసుకుంటే శరీరానికి కావాల్సిన మెగ్నీషియం అందుతుంది.

విటమిన్ డి

ఇది కాల్షియం శోషణకు అవసరమైన పోషకం. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సాయపడుతుంది. గర్భిణీలు 600 యూనిట్ల విటమిన్ డి తీసుకోవాలి.

Tags:    

Similar News