Women Health: 'ఆమె' కోసం ఐదు సూపర్‌ఫుడ్స్.. అప్పుడే ఈ క్యాన్సర్ల నుంచి విముక్తి..!
Women Health: వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషులు, స్త్రీల ఆహార అవసరాలు వేరు వేరుగా ఉంటాయి.
Women Health: ఈరోజుల్లో మహిళలు ఇల్లు లేదా ఆఫీసు పనులతో చాలా బిజీగా ఉంటున్నారు. దీని కారణంగా వారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషులు, స్త్రీల ఆహార అవసరాలు వేరు వేరుగా ఉంటాయి. ఈ పరిస్థితిలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. అయితే వారు ఎలాంటి సూపర్‌ఫుడ్స్ తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.
పండ్లు
మహిళలు ప్రతిరోజు కచ్చితంగా కొన్ని పండ్లని తీసుకోవాలి. బొప్పాయి, బెర్రీలు, ద్రాక్ష వంటి పండ్లను తినవచ్చు. ద్రాక్షపండు గుండెకు చాలా మంచిది. ఇది మహిళల్లో స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెర్రీస్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్‌ని నివారిస్తాయి. బొప్పాయి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
బీన్స్
బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళలకు చాలా మంచి ఆహారం. బీన్స్ తినడం వల్ల రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
పెరుగు
పెరుగులో కాల్షియం అధికంగా లభిస్తుంది. మహిళలు రోజూ ఒక గిన్నె పెరుగు తినవచ్చు. ఇది శరీరంలో కాల్షియం లోపాన్ని భర్తీ చేస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. మహిళలు తక్కువ కొవ్వు పెరుగు తినాలి. ఇది ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయడానికి సహాయం చేస్తుంది.
అవిసె గింజలు
అవిసెగింజలు ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఫైబర్, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. మీరు ఈ విత్తనాలను సలాడ్, పెరుగు మొదలైన వాటిలో చేర్చుకొని తినవచ్చు. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. రొమ్ము క్యాన్సర్ నుంచి మహిళలను రక్షించడానికి పనిచేస్తాయి.
పాలకూర
పాలకూరలో ఉండే ఫోలేట్ మహిళలకు చాలా మేలు చేస్తుంది. ఇది గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ల్యూటిన్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటిచూపు పెరుగుతుంది. ఇది చర్మంపై ముడతలను కూడా తొలగిస్తుంది.