సిజేరియన్ డెలివరీ వల్ల వీక్ అయ్యారా..! ఈ డైట్ పాటిస్తే మునుపటి ఆరోగ్యం మీ సొంతం
Cesarean Delivery: మహిళలు ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. చాలా మంది వీక్ అయిపోతారు...
Cesarean Delivery: మహిళలు ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. చాలా మంది వీక్ అయిపోతారు. జుట్టు ఊడిపోవడం, ఎముకలు పెళుసుగా మారడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వీరికి చాలా విశ్రాంతి అవసరం అంతేకాదు మంచి ఆహారం కూడా తినాలి. మరోవైపు పిల్లలకు కూడా పాలు పట్టాలి కాబట్టి బలంగా ఉండాలి. అందుకోసం కచ్చితమైన డైట్ పాటించాలి. అప్పుడే మునుపటి ఆరోగ్యం తిరిగివస్తుంది.
ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు కచ్చితంగా ఉండాలి. అయితే డెలివరీ తర్వాత మహిళ జీర్ణవ్యవస్థ క్షీణిస్తుంది కాబట్టి ఆమె ప్రతిదీ తినలేదు. అందువల్ల నిపుణుడిని సంప్రదించిన తర్వాత మహిళల డైట్‌ని సిద్ధం చేసుకోవాలి. ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసుకుందాం. కాల్షియం లోపాన్ని అధిగమించడానికి మహిళలు తమ ఆహారంలో పాలు, పెరుగును చేర్చుకోవాలి. ఇందుకోసం రోజూ ఒక గ్లాసు కొవ్వు పాలు తాగాలి.
ఇది కాకుండా మధ్యాహ్న భోజనంలో పెరుగు తినాలి. చలికాలంలో మఖానా, పసుపు, లవంగాలు, యాలకులు మొదలైనవి వేసి పాలు తాగవచ్చు. సిజేరియన్ డెలివరీ తర్వాత జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీని వల్ల చాలా సార్లు మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని కోసం మీరు పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి. పీచు పండ్లను ఎక్కువగా తినాలి. సలాడ్ తీసుకోవాలి. పప్పులు, బీన్స్, పచ్చిమిర్చి, స్ట్రాబెర్రీలు, చిలగడదుంపలు మొదలైన వాటిని ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.
సిజేరియన్ తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మలబద్ధకం సమస్య నివారించడానికి పుష్కలంగా నీరు తాగాలి. ఇది కాకుండా హెర్బల్ టీ, కొబ్బరి నీరు, సూప్ తీసుకోవాలి. అల్లం-క్యారెట్ సూప్, టొమాటో సూప్, బీట్‌రూట్ సూప్ తాగవచ్చు. కనీసం 6 నెలల పాటు ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తినాలి. బయటి ఆహారాన్ని, జిడ్డుగల మసాలా ఆహారాన్ని పూర్తిగా మానుకోవాలి. కచ్చితంగా రాత్రి 8 గంటలలోపు భోజనం ముగించాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. యాక్టివ్‌గా ఉంటారు.