Women Health: 30 ఏళ్లు దాటిన మహిళలకి అలర్ట్.. ఈ విషయాలలో జాగ్రత్త..!
Women Health: 30 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు అనేక వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది.
Women Health: మహిళలు వయసు పెరుగుతున్నకొద్ది వారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చెడు ఆహారం, చెడు జీవనశైలి కారణంగా ఆయుష్షు కూడా తగ్గిపోతుంది.30 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు అనేక వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో చాలా ప్రమాదకరమైన వ్యాధులు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ వయసు దాటిన మహిళలలో రోజు రోజుకి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
బోలు ఎముకల వ్యాధి
30 సంవత్సరాలు దాటిన మహిళలు ఎక్కువగా బోలు ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోకుంటే ఎముకలు బలహీనంగా మారుతాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఎముకలు బలహీనపడుతాయి. ఇది కాకుండా ఆహారంలో కాల్షియం లేకపోవడం లేదా శరీరంలో కాల్షియంకు హాని కలిగించే వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడుతాయి. ఈ కారణాల వల్ల ఆస్టియోపోరోసిస్ సమస్య వస్తుంది.
సంతాన సమస్యలు
జీవనశైలి సరిగ్గా లేదంటే 30 ఏళ్ల తర్వాత మహిళలలో సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. కొంతమంది మహిళల్లో 30 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి క్రమంగా బలహీనపడుతుంది. దీని కారణంగా గర్భధారణకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితిలో సరైన ఆహారం ఈ సమస్యను కొంతవరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
రొమ్ము క్యాన్సర్
50 ఏళ్లు పైబడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల అధ్యయనం ప్రకారం 30 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళల్లో కూడా రొమ్ము క్యాన్సర్ పెరుగుతుంది. దీని లక్షణాలు 20 ఏళ్ల వయస్సులో కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించడం అవసరం. వెంటనే చికిత్స తీసుకుంటే పర్వాలేదు కానీ ఆలస్యం జరిగితే వ్యాధి ముదురుతుంది.