Women: ఆ సమయంలో మహిళలు బరువు పెరుగుతారు.. ఎందుకంటే..?

Women: ఆ సమయంలో మహిళలు బరువు పెరుగుతారు.. ఎందుకంటే..?

Update: 2022-02-11 08:30 GMT

Women: ఆ సమయంలో మహిళలు బరువు పెరుగుతారు.. ఎందుకంటే..?

Women: మహిళలందరు పీరియడ్స్‌ సమయంలో చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కూడా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కానీ అందరు మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య బరువు పెరగడం. అసలు పీరియడ్స్‌ సమయంలో మహిళలు ఎందుకు బరువు పెరుగుతారు. దీనికి గల కారణాలు ఏంటి తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

పీరియడ్స్ ప్రారంభమైన వెంటనే మహిళలలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. పొత్తికడుపు నొప్పితో పాటు ఛాతి బరువుగా అనిపించడం, భయం, ముఖంపై మొటిమలు, మానసిక స్థితిలో మార్పు, చిరాకు వంటివి ఉంటాయి. దీనితో పాటు బరువు కూడా పెరుగుతారు. ప్రస్తుతం కొంతమంది మహిళలకు కడుపులో వాపు వస్తుంది. ఏదైనా తింటే ఉబ్బరంగా ఉంటుంది. వాస్తవానికి పీరియడ్స్  సమయంలో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ పరిమాణం అధికంగా పెరుగుతుంది. దీని కారణంగా శరీరం అకస్మాత్తుగా బరువు పెరుగుతుంది.

పీరియడ్స్ సమయంలో నొప్పిగా ఉండటం వల్ల శరీరం అలసిపోతుంది. దీని వల్ల వ్యాయామం చేయడం లేదా జిమ్‌కి వెళ్లడం మానేస్తాం. అంతేకాదు ఈ సమయంలో అతిగా తినడం వల్ల శరీరంలో కేలరీల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో బరువు పెరగడం ప్రారంభమవుతుంది. పీరియడ్స్‌ సమయంలో మహిళలు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. ప్రొజెస్టెరాన్ స్థాయి పెరుగుదల కారణంగా ఇది జరుగుతుంది. రకరకాల పదార్థాలు తినడం వల్ల పొట్ట ఉబ్బి ఎసిడిటీ, మలబద్ధకం ఏర్పడుతాయి. దీంతో విపరీతంగా బరువు పెరుగుతారు. 

Tags:    

Similar News