Vomiting Problem: ప్రెగ్నెన్సీలో వాంతులు రావడానికి ఇదే కారణం..!
Vomiting Problem: జీవితంలో ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. ప్రెగ్నెన్సీ అనేది వారికి ఒక అందమైన అనుభూతి.
Vomiting Problem: జీవితంలో ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. ప్రెగ్నెన్సీ అనేది వారికి ఒక అందమైన అనుభూతి. కానీ అంతే మొత్తంలో శారీరక సమస్యలను కూడా అనుభవిస్తారు. ఒక మహిళ తల్లి కావడం అంటే చచ్చి పుట్టడమే అని పెద్దలు చెబుతారు. అంత రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ అన్ని సమస్యలను తట్టుకోవడానికి సిద్దమవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో తనతోపాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా చూసుకోవాలి. ఈ పీరియడ్‌లో మహిళలు ఎక్కువగా వాంతులు చేసుకుంటారు. అయితే ఇది చాలా సర్వసాధారణం.
దాదాపు 70 నుంచి 80 శాతం మహిళలు ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన మొదటి మూడు నెలల్లో వికారం లేదా వాంతులతో ఇబ్బందిపడుతారు. కానీ కొంతమంది స్త్రీలు వాంతుల కారణంగా చాలా భయపడతారు. అందుకే ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. అయితే ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో స్త్రీలు ఎందుకు వాంతులు చేసుకుంటారు. వాటిని ఎలా నివారించాలి.. తదితర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
వాంతులు ఎందుకు వస్తాయి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో హార్మోన్లు వేగంగా మారుతుంటాయి. గర్భాశయంలో పిండం అభివృద్ధికి కోరియోనిక్ గోనాడోట్రోఫిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ సమయంలో ఈ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది నేరుగా కడుపుని ప్రభావితం చేస్తుంది. వాంతులు చేసుకోవడానికి కారణం ఇదే. అయితే ఈ సమస్యను నివారించడానికి చాలా హోం రెమెడీస్ ఉన్నాయి.
సోంపు నీరు
నోటి దుర్వాసనను పోగొట్టడానికి సోంపును ఉపయోగిస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఫెన్నెల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి పొట్ట సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
నిమ్మకాయ నీరు
మీరు గర్భధారణ సమయంలో వాంతుల సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే నిమ్మకాయ నీటిని తాగవచ్చు. ఈ హోం రెమెడీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలపాలి. దీన్ని తాగడం వల్ల స్త్రీల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కడుపులో ఎసిడిటీ తగ్గుతుంది.