White Hair: 25 నుంచి 30 ఏళ్లలో జుట్టు తెల్లగా మారుతోంది.. కారణం ఏంటంటే..?
White Hair:25 నుంచి 30 ఏళ్లలో జుట్టు తెల్లగా మారుతోంది.. కారణం ఏంటంటే..?
White Hair: పూర్వకాలంలో ఒక వ్యక్తికి 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జుట్టు తెల్లబడేది. కానీ ప్రస్తుతం 25 నుంచి 30 ఏళ్ల వయసులోనే జుట్టు తెల్లగా మారుతోంది. చాలామంది యువత ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. మరోవైపు జుట్టు తెల్లబడటాన్ని నివారించేందుకు హెయిర్ డైని వాడితే జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అయితే ఈ పరిస్థితికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
1. హార్మోన్ల అసమతుల్యత
నిజానికి హార్మోన్లలో అసమతుల్యత ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల రుగ్మతలు మొదలవుతాయి. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత జుట్టు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా తెల్ల జుట్టు మొదలవుతుంది.
2. కాలుష్యం
ప్రస్తుతం ప్రతి నగరంలో కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఇది జుట్టు త్వరగా నెరిసిపోవడానికి కారణమవుతుంది. దీని వల్ల జుట్టు పొడిబారడమే కాకుండా రాలడం, చిట్లిపోవడం జరుగుతుంది. కలుషితమైన గాలి మెలనిన్‌ని పాడుచేస్తుంది. దీని కారణంగా జుట్టు తొందరగా తెల్లగా మారుతోంది.
3. టెన్షన్
ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి చాలా బిజీగా మారింది. గతంతో పోలిస్తే పని ఒత్తిడి బాగా పెరిగింది. టెన్షన్ వల్ల జుట్టు తెల్లబడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
4. సిగరెట్లు తాగడం, బీడీలు తాగడం ఆరోగ్యానికి హానికరం. అయితే ధూమపానం వల్ల మీ జుట్టు తొందరగా తెల్లబడుతుంది. అందుకే ఇలాంటి చెడు అలవాటును ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది.