Women Health: ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్లు, చేతుల్లో వాపులు ఎందుకు వస్తాయి..?

Women Health: అమ్మ అవడం ఒక అదృష్టం. ఇందుకోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు.

Update: 2024-05-16 12:30 GMT

Women Health: ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్లు, చేతుల్లో వాపులు ఎందుకు వస్తాయి..?

Women Health: అమ్మ అవడం ఒక అదృష్టం. ఇందుకోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్‌ఫమ్‌ అయిన తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. అందులో ఒకటి కాళ్లు, చేతులు వాపునకు గురవడం. సాధార ణంగా ఈ సమస్యను అందరు గర్భిణులు ఎదుర్కొంటారు. దీనిని వైద్య భాషలో ఎడెమా అంటా రు. ఇది ఎందుకు వస్తుంది.. చికిత్స విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో పాదాలలో వాపు చాలా సాధారణం. శిశువు అవసరాలను తీర్చడానికి శరీరం ఉత్పత్తి చేసే అదనపు రక్తం, ద్రవం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా పాదాలలో మాత్రమే కాకుండా చేతులు, ముఖం, శరీరంలోని ఇతర భాగాలలో వాపులు వస్తాయి. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్, హెచ్‌సిజి, ప్రోలాక్టిన్ వంటి అనేక హార్మోన్ల స్థాయి మహిళల శరీరంలో గణనీయంగా పెరుగుతుంది. దీని కారణంగా ఎడెమా (వాపు) రావడం మొదలవుతుంది. బరువు పెరగడం వల్ల కూడా పాదాలు వాపుకు గురవుతాయి.

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ప్రోటీన్, హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల కాళ్లలో వాపులు వస్తాయి. అయితే డెలివరీ తర్వాత పాదాలు సాధారణ స్థితికి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా నిలబడి ఉండకూడదు. పాదాలకు విశ్రాంతి ఇవ్వడానికి మంచంపై ఒక దిండును ఉంచి సుమారు 20 నిమిషాల పాటు పడుకోవాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే పాదాల వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పొటాషియం లేకపోవడం వల్ల పాదాలలో వాపు వస్తుంది. దీని కారణంగా మహిళలు అధిక రక్తపోటు, నీటి నిలుపుదల సమస్యలతో బాధపడుతారు. నివారించడానికి పొటాటో, అరటి, దానిమ్మ, పిస్తా, బత్తాయి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

Tags:    

Similar News