Sugar Levels Controlled: షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం లేదా.. గులాబి పండు రోజు తింటే బెటర్ ఫలితాలు..!
Sugar Levels Controlled: నేటి రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా చాలామంది డయాబెటీస్‌కి గురవుతున్నారు.
Sugar Levels Controlled: నేటి రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా చాలామంది డయాబెటీస్‌కి గురవుతున్నారు. ఇది దీర్ఘకాలిక సమస్య. మందుల ద్వారా కాకుండా సహజసిద్దంగా తగ్గించుకోవడం ఉత్తమం. ఇందుకోసం సరైన ఆహారవిధానాలని పాటించాలి. అయినప్పటికీ కొంతమందికి బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కావు. ఈ సమయంలో ప్రతిరోజు డ్రాగన్ ఫ్రూట్ తినాలి. ఇది పెరిగిన గ్లూకోజ్ స్థాయిలని కంట్రోల్ చేస్తుంది. ఈ పండు తినడం వల్ల షుగర్ పేషెంట్లకి కలిగే లాభాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ కొంత ఖరీదైనదే కానీ ఆరోగ్యం బాగుపడాలంటే కచ్చితంగా తినాల్సిందే. ఇది ఆరోగ్యానికి ఔషధాని కంటే తక్కువేమి కాదు. 100 గ్రాములలో 60 గ్రాముల ఆరోగ్యకరమైన కేలరీలు, 1.2 గ్రాముల ప్రోటీన్, జీరో ఫ్యాట్, 13 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ ఉన్నాయి. దీంతోపాటు శరీరానికి విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం కూడా లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ దక్షిణ మెక్సికో, మధ్య అమెరికా దేశాలలో పండుతుంది. అయినప్పటికీ నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్ చక్కెర స్థాయిని ఎలా తగ్గిస్తుంది?
డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ జాతికి చెందిన మొక్క. అనేక జంతువులపై చేసిన పరిశోధనల ప్రకారం ఈ పండు యాంటీ-డయాబెటిక్ ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రీడయాబెటిస్, టైప్-2 మధుమేహం ఉన్న రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక వ్యక్తికి మధుమేహం వచ్చిన తర్వాత గుండెపోటు వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కొన్నిసార్లు రోగి మరణించే అవకాశాలు ఉంటాయి. దీనిని నివారించడానికి తప్పనిసరిగా డ్రాగన్ ఫ్రూట్ తినాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.