Dental Scaling: డెంటల్ స్కేలింగ్ ఎప్పుడు చేయించాలి. దీని వల్ల ప్రయోజనాలేంటి..?
Dental Scaling: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇందుకోసం దంతాలను క్లీన్‌గా ఉంచుకోవడం అవసరం. కానీ చాలా మంది వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపరు.
Dental Scaling: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇందుకోసం దంతాలను క్లీన్‌గా ఉంచుకోవడం అవసరం. కానీ చాలా మంది వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపరు. దీని వల్ల దంతాల ఆరోగ్యం పాడైపోతుంది. దంతాలు రాలిపోవడం, పసుపు రంగులోకి మారడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతారు. ఈ సమస్యల నివారణకు మీరు డెంటల్ స్కేలింగ్ చేసుకోవచ్చు. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. అయితే డెంటల్ స్కేలింగ్ అంటే ఏమిటి.. అది నోటి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.
మంచి ఆరోగ్యం కోసం నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా డెంటల్ స్కేలింగ్ చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల దంతాల నుంచి ఫలకం, టార్టార్ తొలగిపోతుంది. ప్రజలు ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ స్కేలింగ్ చేయించుకోవాలి. వాస్తవానికి దంతాల మీద పేరుకుపోయే బ్యాక్టీరియా గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. ఈ టార్టార్ దంతాలలో అనేక వ్యాధులకు కారణం అవుతుంది. అందువల్ల ప్రజలు డెంటల్ స్కేలింగ్ చేయించుకోవాలి. ఇది చాలా సమస్యలను తొలగిస్తుంది.
చిగుళ్ల వ్యాధి నివారణ
ఫలకం, టార్టార్ చిగుళ్ల వ్యాధికి కారణమవుతాయి. ఏదైనా చిగుళ్ల సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే అది పీరియాంటైటిస్‌కు దారితీస్తుంది. ఇది దంతాల నష్టానికి కారణమవుతుంది. మీరు ప్రతి 6 నెలలకోసారి డెంటల్ స్కేలింగ్ చేయించుకుంటే చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది. ఫలకం, టార్టార్ ఏర్పడటం వల్ల దంతాల రంగు మారి మరకలు ఏర్పడతాయి. స్కేలింగ్ దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
దంత క్షయం నివారణ
స్కేలింగ్ దంతాలపై ఫలకం లేకుండా చేస్తుంది. కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) ప్రజలు ప్రతి ఆరు నెలలకు స్కేలింగ్ చేయాలని సిఫార్సు చేశారు. చిగుళ్ల వ్యాధి రాకుండా, దంతాలు పుచ్చిపోయే ప్రమాదాన్ని తగ్గించేందుకు స్కేలింగ్ అవసరమవుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటే నోటి ఆరోగ్యం బాగుంటుంది. అనేక వ్యాధుల ముప్పు తగ్గుతుంది.