Drinking Alcohol: మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకండి..!

Update: 2021-11-20 12:00 GMT

 మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకండి..!

What not to Eat After Drinking Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత మొత్తుకున్నా జనాలు వినడంలేదు. ముఖ్యంగా యువత దీనికి ఎక్కువగా బానిసఅవుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది మద్యం సేవించిన తర్వాత ఇష్టమొచ్చిన ఆహారాలను తింటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఒక్కోసారి చాలా ప్రమాదపరిస్థితులు ఎదురవచ్చు. అందుకే మద్యం తాగాక కొన్ని ఆహాన పదార్థాలను తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.

1. మద్యం సేవించిన తర్వాత పాల ఉత్పత్తులను తినవద్దు

ఆల్కహాల్ జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. మద్యం సేవించాక మీరు పాలు తాగితే అందులో ఉన్న పోషకాల ప్రయోజనం మీకు లభించదు. అందువల్ల మద్యం తాగాక పాలు తాగకండి.

2. స్వీట్లు తినకూడదు

ఆల్కహాల్‌తో పాటు స్వీట్లు ఎప్పుడు తినకూడదు. ఎందుకంటే మత్తు రెట్టింపు అవుతుంది. చాలా మంది మద్యం తర్వాత తీపిని తెలిసేలా తింటారు అయితే నిజమైన అర్థంలో తీపి పదార్థాలు మద్యం తర్వాత విషం లాంటివని గుర్తుంచుకోండి.

3. జిడ్డుగల స్నాక్స్ తినవద్దు

మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా ఆయిల్ స్నాక్స్ తీసుకోకూడదని గుర్తుంచుకోండి. చాలా సార్లు మద్యపానం చేసే వ్యక్తులు చిప్స్ తింటారు ఎందుకంటే అవి సులువుగా అందుబాటులో ఉంటాయి కానీ దాహం ఎక్కువగా అనిపిస్తుంది. తద్వారా ప్రజలు ఎక్కువగా మద్యం తాగుతారు. అందుకే వీటిని తినవద్దు

4. సోడా లేదా శీతల పానీయం ప్రమాదకరం

మీరు సోడా, శీతల పానీయాలతో మద్యం సేవించకూడదు. ఈ రెండూ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటికి బదులుగా నీరు లేదా ఐస్ కలుపుకొని ఆల్కహాల్ తాగవచ్చు. లేదంటే మీరు ఏమీ కలపాల్సిన అవసరం లేని ఆల్కహాల్‌కు వెళ్లడం మంచిది.

Tags:    

Similar News