Side Effects Lack Sleep:వామ్మో నిద్రలేమితో క్యాన్సర్..డయాబెటిస్ బోనస్..ఇంకా ఎన్నో

Side Effects Lack Sleep:నిద్రలేమి వంటి చెడు జీవనశైలి వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.తగినంత నిద్ర లేకపోవటం ఎంత ప్రమాదకరమో ఇఫ్పుడు తెలుసుకుందాం.

Update: 2024-08-01 05:31 GMT

Sleep: వామ్మో నిద్రలేమితో క్యాన్సర్..డయాబెటిస్ బోనస్..ఇంకా ఎన్నో

Lack Sleep: నిద్రలేమి అనేది అనేక జబ్బులకు కారణం అవుతోంది. ఈ ఆధునిక జీవన యుగంలో పని ఒత్తిడి పెరిగి ప్రతి ఒక్కరిలోనూ నిద్రపోవడానికి సమయం దక్కడం లేదు. ఫలితంగా మెదడుపై ఇతర శరీర భాగాలపై ఒత్తిడి పెరిగి నిద్రలేమి వల్ల పలు రకాల జబ్బులు వస్తున్నాయి. అయితే తాజాగా ఒక అధ్యయనంలో నిద్రలేమి వల్ల క్యాన్సర్ సైతం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణుల బృందం పేర్కొంది. నిద్రలేమి వంటి చెడు జీవనశైలి వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.తగినంత నిద్ర లేకపోవటం ఎంత ప్రమాదకరమో ఇఫ్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి క్యాన్సర్‌కు ఎలా కారణం?

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 6-7 గంటల నిద్ర అవసరం. కానీ చాలా మంది అనేక కారణాల వల్ల దీని కంటే తక్కువ నిద్రపోతారు. 6-7 గంటల కంటే తక్కువ నిద్రపోతే, పెద్దప్రేగులో పాలిప్స్ పెరుగుతున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. ఇది క్రమంగా క్యాన్సర్‌గా మారుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నిద్రలేమి వల్ల వచ్చే క్యాన్సర్లు ఇవే:

క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. నిద్రలేమి వల్ల వచ్చే అన్ని రకాల క్యాన్సర్ల గురించి తెలుసుకుందాం.

రొమ్ము క్యాన్సర్ :

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నిద్ర లేమి వల్ల పెరుగుతోంది. నిద్రలేమి వల్ల వచ్చే క్యాన్సర్లలో ఇదీ ఒకటి. రాత్రిపూట పని చేసే, సరిగ్గా నిద్రపోని, సరైన నిద్ర షెడ్యూల్‌ను పాటించని మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయన నివేదిక ప్రచురించింది. నిద్ర తగ్గినప్పుడు, శరీరంలో మెలటోనిన్ హార్మోన్ తగ్గుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తుంది.

ప్రోస్టేట్ క్యాన్సర్ :

పురుషులను వణికిస్తున్న క్యాన్సర్ ఇది. తక్కువ నిద్రపోయే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు పని చేస్తున్న వారు తమకు తెలియకుండానే నిద్రలేమికి గురవుతున్నారు. ఇది పురుషులలో మెలటోనిన్ హర్మోన్ తగ్గడం వల్ల జరుగుతుంది.

లింఫోమా:

నిద్రలేమి కారణంగా వచ్చే మరో క్యాన్సర్ లింఫోమా. నిద్రలేమితో శరీరంలో అసాధారణమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ కనిపిస్తుంది.

కాలేయ క్యాన్సర్:

నిద్రలేమి కాలేయ క్యాన్సర్‌కు కారణమవుతుంది. నిద్రలేమికి, లివర్ క్యాన్సర్‌కి మధ్య సంబంధం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. నిద్ర లేమి జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది చివరికి క్యాన్సర్‌గా మారుతుంది. అలాగే, దీర్ఘకాలిక నిద్ర లేకపోవడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుంది.

ఇవే కాదు నిద్రలేమి వల్ల డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

Tags:    

Similar News