Health Tips : చాయ్ లో చక్కెరకు బదులు బెల్లం వాడుతున్నారా? అయితే ఈ సమస్య తప్పదు

Health Tips : ఇప్పుడంందరూ ఫిట్‌నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. చక్కెరను వీలైనంత వరకు తగ్గిస్తున్నారు.

Update: 2024-06-25 12:30 GMT

Health Tips : చాయ్ లో చక్కెరకు బదులు బెల్లం వాడుతున్నారా? అయితే ఈ సమస్య తప్పదు 

ఇప్పుడంందరూ ఫిట్‌నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. చక్కెరను వీలైనంత వరకు తగ్గిస్తున్నారు. బదులుగా టీ,కాఫీ ఇతర డ్రింక్స్ లో ఆరోగ్యకరమైన స్వీట్నర్లను వాడుతున్నారు. మనం దేశంలో ఎక్కువగా ఉపయోగించే స్వీట్నర్ బెల్లం. అయితే స్వీట్లు, కొన్ని రకాల పచ్చళ్లలో కూడా బెల్లాన్ని వాడుతుంటారు. అయితే పాలతో బెల్లం కలుస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. బెల్లంలో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, పాస్ఫరస్, విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి. అయినా కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బెల్లం పాలతో ఆరోగ్యం దెబ్బతింటుందా?

షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కరలేని చాయ్ తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వీరు చాయ్ లో బెల్లం కలుపుకుని తాగుతుంటారు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం విరుద్ధ ఆహారం లేదా చెడు ఆహార కలయికలు పేలవమైన జీర్ణక్రియకు దారితీస్తాయి. జీర్ణక్రియ తర్వాత విషపూరిత వ్యర్థాలను శరీరంలో ఉత్పత్తి చేస్తాయి. బెల్లం, పాలు అలాంటి కలయికలో ఒకటని ఆయుర్వేదం అంటోంది. పాలు శరీరాన్ని చల్లబరిస్తే బెల్లం వేడిచేస్తుందని..శీతలశక్తి కలిగిన పదార్థంతో వేడిచేసే పదార్థం తీసుకున్నప్పుడు జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందని చెబుతోంది.

ఇక ఆయుర్వేద నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం..చక్కెరకు బదులుగా పటిక బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది. ఇది పాలలాంటి శీతలీకరణ శక్తిని కలిగిన ఆహారం. జీర్ణక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదు.పాలు-చేపలు, తేనె-నెయ్యి, పెరుగు-జున్ను, అరటిపండు-పాలు వీటి కలయిక విరుద్ధమని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి కడుపులో మంటను ప్రేరేపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు దారితీస్తుందని చెబుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News