Weight Loss Tips: ఈ డ్రింక్స్ తాగండి.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు..!
Weight Loss Tips: ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి.
Weight Loss Tips: ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి. చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఒబిసీటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఒబిసీటీ అనేది కేవలం అధిక బరువు సంబంధించినది మాత్రమే కాదు..దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు అధిక బరువు సమస్యను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ, ప్రస్తుతం అందరూ బరువును అదుపులో ఉంచుకునేందుకు శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యాయామం చేయడం, చక్కటి ఆహార నియమాలు పాటించడం వంటివి చేస్తున్నారు. వ్యాయామం, ఆహార నియమాలతో పాటు కొన్ని రకాల పానీయాలతో కూడా బరువు తగ్గవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం
త్రిఫల:
త్రిఫల చూర్ణం ఆయుర్వేద ఔషధం. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను ఎండబెట్టి పొడి చేసి సమాన భాగాల్లో కలిపి త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల త్రిఫల చూర్ణం కలిపి రాత్రంతా ఆ మిశ్రమాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. త్రిఫల చూర్ణంకు సంబంధించి ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ట్యాబ్లెట్లు లభిస్తాయి.
అల్లం టీ:
అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదని భావిస్తారు కానీ అలా అనుకోవడం పొరపాటు. అల్లం టీతో సులువుగా బరువు తగ్గవచ్చు. ఇక అల్లం టీను ఎలా తయారు చేసుకోవాలంటే..ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొద్దిగా అల్లం తురుము వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులో తేనె లేదా నిమ్మరసం కలుపుకొని ప్రతి రోజూ ఉదయం సేవిస్తే సలువుగా బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ను దూరం చేయడంలో అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది.
నిమ్మరసం:
నిమ్మరసంలో మన శరీర మెటబాలిజంను పెంచుతుంది. ఈ రసంలో ఉండే పాలీఫినాల్స్ బరువును తగ్గించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అంతేకాదు శరీరంలోని ప్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ నిమ్మరసం, చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలపాలి. ఈ నీటిని ఉదయం పూట పరగడుపునే తాగాలి. ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతుంది.
యాపిల్ సిడార్ వెనిగార్:
అధిక బరువుతో పాటు పొట్ట భాగంలో అధిక శాతం కొవ్వుతో బాధపడుతున్నవారికి యాపిల్ సిడార్ వెనిగార్ ఉత్తమ పరిష్కారం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే ఎసిటిక్ ఆమ్లం ఉదర కొవ్వు, శరీర బరువు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో విశేషంగా సహాయపడుతుంది. 12 వారాల పాటు క్రమం తప్పకుండా యాపిల్ సిడార్ వెనిగార్ మిశ్రమాన్ని సేవిస్తే 2 నుంచి 3 కిలోల బరువు సులువుగా తగ్గుతుంది. యాపిల్ సిడార్ వెనిగార్ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆపిల్ సిడార్ వెనిగార్, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ కారప్పొడి వేసి బాగా కలపాలి. భోజనం చేసే అరగంట ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల ఉదర కొవ్వుతో పాటు నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది.
పసుపు నీళ్లు:
పసుపు సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. గాయాలను, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు, క్రమం తప్పకుండా పరగడుపున ఒక గ్లాస్ పసుపు టీ తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పసుపు చెంచా తేనె కలుపుకొని తాగితే శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.
మొత్తంగా, పైన చెప్పుకున్న డ్రింక్స్ తో పాటు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అధిక బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.