వేప నీటితో మొహం కడుక్కుంటే అద్భుత ప్రయోజనాలు.. అవేంటంటే..?
Neem Water Benefits: నేటి కాలంలో జీవన పరిస్థితులు, వాతావరణ కాలుష్యం వల్ల చాలామంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
Neem Water Benefits: నేటి కాలంలో జీవన పరిస్థితులు, వాతావరణ కాలుష్యం వల్ల చాలామంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు మార్కెట్‌లో లభించే అన్ని బ్యూటీ ప్రొడాక్ట్స్‌ని వాడుతున్నారు. కానీ ఎటువంటి ఫలితం ఉండటం లేదని బాధపడుతున్నారు. ఇలాంటి వారు వేప నీటిని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. వేప నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అలర్జీలకి చెక్
వేప నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతాయి. వేప నీటితో రోజు ఫేస్ క్లీన్ చేస్తే చర్మ అలర్జీలు, దద్దుర్లు, దురదలు మొదలైన సమస్యల నుంచి బయటపడవచ్చు.
మొటిమలకి చెక్
వేప నీటితో ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇది చర్మంపై ఉండే మురికిని, జిడ్డుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మొటిమల మంటను కూడా తగ్గిస్తుంది.
జిడ్డు, పొడి చర్మానికి చెక్
వేపలో ఉండే యాంటీఆక్సిడెంట్, క్రిమినాశక లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. ఇది చర్మంలో ఉండే అదనపు నూనెను నియంత్రిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
మచ్చలకి చెక్
వేప నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అదే సమయంలో ముఖంపై ఉన్న మచ్చలు, టానింగ్, చర్మం నల్లబడటం వంటివి తొలగిపోతాయి.