మీ కాలివేళ్లు,పాదాలు తిమ్మిర్లు వస్తున్నాయా..! అయితే ఈ విటమిన్ లోపం..
* శరీరానికి పోషకాలతో పాటుగా విటమిన్లు కూడా అవసరం. * తగినంతగా ఈ విటమిన్ తీసుకోకపోవడం ద్వారా విటమిన్ B12 లోపం ఏర్పడుతుంది
Vitamin B12: శరీరానికి పోషకాలతో పాటుగా విటమిన్లు కూడా అవసరం. విటమిన్ల లోపంతో చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన గ్రంధులు పనిచేయవు. శరీరం పట్టు తప్పుతుంది బలహీనంగా తయారవుతుంది. అన్ని రోగాలకు నిలయంగా మారుతుంది.
అయితే అన్ని విటమిన్లలో విటమిన్ B12 కూడా చాలా ముఖ్యం. ఇది లేకుంటే చేతి కాళ్ల వేళ్లలో, పాదాలలో తిమ్మిర్లు వస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తి తగ్గిపోయి రక్తహీనత వంటి కోలుకోలేని వ్యాధికి గురికావల్సి ఉంటుంది. B12 లోపం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే వీలైనంత త్వరగా చికిత్స పొందాలి. లేదంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి.
విటమిన్ B12 లోపం లక్షణాలు..
డిప్రెషన్, మానసిక సామర్థ్యం క్షీణించడం, అలసట, మెమరీ సమస్యలు, పాలిపోయిన చర్మం, నడవడంలో ఇబ్బంది, మూడ్ ఛేంజ్ కావడం, ఊపిరి ఆడకపోవడం, తలతిరగడం, చెదిరిన దృష్టి, నోటి పూతలు, తిమ్మిరి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తరచుగా కాలి వేళ్లల్లో, చేతుల్లో తిమ్మిరి ఏర్పడితే ఇది విటమిన్ B12 లోపాన్ని సూచిస్తుంది. విటమిన్ B12 స్థాయిలను చెక్ చేయడానికి సాధారణ రక్త పరీక్షలు చేయించుకోవాలి.
విటమిన్ B12 ఏ ఆహారంలో ఉంటుంది..
ఆహారం ద్వారా తగినంతగా ఈ విటమిన్ తీసుకోకపోవడం ద్వారా విటమిన్ B12 లోపం ఏర్పడుతుంది. గుడ్లు, డైరీ, సాల్మన్, ట్రౌట్, గొడ్డు మాంసం, సార్డినెస్, జంతువుల కాలేయం, మూత్రపిండాలలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తులలో కూడా విటమిన్ B12 పుష్టిగా ఉంటుంది.
శాకాహారులు విటమిన్ B12 సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా లేదా పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం ద్వారా కవర్ చేయవచ్చు. విటమిన్ B12 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది DNA తయారీలో సహాయపడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది.