విటమిన్ 12 లోపం పెద్ద సమస్య.. ఈ ఆహారాలే దానికి పరిష్కారం..!
విటమిన్ 12 లోపం పెద్ద సమస్య.. ఈ ఆహారాలే దానికి పరిష్కారం..!
Vitamin 12: మన శరీరం, గుండె, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ B12 ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి. రక్త కణాల నిర్మాణంలో ఈ విటమిన్ ముఖ్ పాత్ర పోషిస్తుంది. శరీరంలో దీని లోపం ఏర్పడితే ఎముకలు బలహీనంగా మారతాయి. కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ఆహారాన్ని తీసుకోని వ్యక్తులకు రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే విటమిన్ B12 సమృద్ధిగా లభించే ఆహారాలని తీసుకోవడం ఉత్తమం. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1. బ్రోకలీ
ఆకుపచ్చ కూరగాయలలో బ్రోకలీ చాలా మంచి ఆహారం. ఇందులో విటమిన్ B12తో పాటు విటమిన్ B-9 అంటే ఫోలేట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. దీన్ని సలాడ్‌లా చేసుకుని తింటే చాలా ఆరోగ్యకరం.
2. గుడ్లు
గుడ్లు సూపర్‌ఫుడ్ అని చెబుతారు. సాధారణంగా వీటిని ప్రోటీన్‌కి గొప్ప వనరుగా పరిగణిస్తారు. కానీ అవి విటమిన్ B-12 రోజువారీ అవసరాలలో 46 శాతం వాటా కలిగి ఉంటాయి. కనీసం రోజూ 2 గుడ్లు తినాలి.
3. పుట్టగొడుగులు
పుట్టగొడుగులు విటమిన్ B-12 గొప్ప మూలంగా చెబుతారు. విటమిన్ బి-12తో పాటు కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు కూడా పెద్ద మొత్తంలో లభిస్తాయి.
4. చేపలు
నాన్-వెజ్ ఫుడ్ తినడానికి ఇష్టపడే వారికి చేపలు మంచివని చెప్పవచ్చు. ఇది విటమిన్ B12 అవసరాలను మెరుగైన మార్గంలో తీరుస్తుంది.
5. సోయాబీన్
సోయాబీన్ శాకాహారుల ప్రోటీన్ ఆహారంగా చెబుతారు. అయితే శరీరానికి దీనివల్ల విటమిన్ B-12 పుష్కలంగా లభిస్తుంది. మీరు సోయా పాలు, టోఫు లేదా సోయా చంక్స్ తినవచ్చు.