Rose Water: రోజ్ వాటర్‌ని ఇలా వాడితే ఆ సమస్యకి చెక్.. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది..!
Rose Water: దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో సూపర్‌గా పనిచేస్తుంది.
Rose Water: భారతదేశంలో రోజ్ వాటర్‌ని ప్రాచీనకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దీనిని బ్యూటీ ఉత్పత్తులలో ఎక్కువగా వాడుతారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. రోజ్ వాటర్‌ని ఎలా ఉపయోగించాలి దాని ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
ముడతలకి చెక్
కళ్ల చుట్టూ ఉన్న చర్మం వదులుగా మారినట్లయితే రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం కొన్ని చుక్కల రోజ్ వాటర్ తీసుకొని కళ్ల కింద అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.
డార్క్ సర్కిల్స్
కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే రోజ్ వాటర్ మీకు సహాయపడుతుంది. ముందుగా గంధపు పొడిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్‌ను కళ్ల చుట్టూ అప్లై చేయాలి. ఇది నల్లటి వలయాలని తొలగిస్తుంది.
కళ్ళకి విశ్రాంతి
ఈ రోజుల్లో కళ్ల కింద నల్లటి వలయాలు ఉండటం సర్వసాధారణం. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు కళ్ళు చెడ్డగా కనిపిస్తాయి. కాటన్ బాల్‌పై కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి దానిని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వీటిని కళ్లపై 30 నిమిషాల పాటు పెట్టుకోవాలి. దీనివల్ల కళ్ల చికాకు నుంచి బయటపడతారు. చాలా మంచి అనుభూతి చెందుతారు.
కళ్ళు ఎర్రబడటం నయమవుతుంది
కళ్ళు అలసటగా, ఎర్రగా ఉంటే కళ్ళలో రోజ్ వాటర్ వేయాలి. దీంతో కళ్లు ఎర్రబడటం నయమవుతుంది. రాత్రి పూట అప్లై చేయడం మంచిది.