High Cholesterol: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. కొవ్వును కరిగించే ఈ 3 నూనెలు వాడాల్సిందే..!

Cholesterol Free Oils: కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆహారంలో ఎలాంటి నూనెలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Update: 2023-04-16 15:30 GMT

High Cholesterol: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. కొవ్వును కరిగించే ఈ 3 నూనెలు వాడాల్సిందే..!

Cholesterol Free Oils: మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల అనేది తీవ్రమైన వ్యాధులకు కారణంగా మారుతుంది. దీనికి కారణం ఆహారంలో నాణ్యత లేకపోవడం, జీవనశైలిలో మార్పులు. కొలెస్ట్రాల్ కాలేయం నుంచి బయటకు వచ్చే మైనపు లాంటి పదార్థం. ఇది శరీరంలోని కణ త్వచాలతో సహా శరీరంలోని ప్రతి భాగంలో కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ శరీరంలో విటమిన్ డి, హార్మోన్, పిత్తాన్ని తయారు చేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఆహారంలో గుడ్లు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు వంటి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో సమస్యలు వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, పార్కిన్సన్స్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆహారంలో ఎలాంటి నూనెలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే నూనెలు:

1. ఆలివ్ నూనె: ఆలివ్ నూనెను ఎక్కువమంది జుట్టు సమస్యలకే ఉపయోగిస్తుంటారు. అయితే, ఆలివ్ నూన్ ధరలు అధికంగా ఉండడంతో.. ఎక్కువ మంది వీటిని ఉపయోగించేందుకు వెనకాడుతుంటారు. ఆలివ్ నూనెలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె అధికంగా ఉంటాయి. అందుకే ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె సమస్యలను తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

2. అవిసె గింజల నూనె: అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ నూనెను రోజూ ఉపయోగించడం వల్ల శరీరంలో అధికంగా నిల్వ ఉన్న కొవ్వులను నియంత్రించడంలో బాగా పనిచేస్తాయి.

3. వేరుశెనగ నూనె: వేరుశెనగ నూనె లేదా పల్లీ నూనె ఉపయోగించి కూడా కొవ్వును తగ్గించుకోవచ్చు. పల్లీ నూనెలో విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పుకుండా వెరుశెనగ నూనెను ఆహారంలో ఉపయోగిస్తుండాలి.

Tags:    

Similar News