పసిపిల్లల్లో తక్కువ బరువు సమస్యలు.. ఈ పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు..!

Child Care Tips: తల్లిదండ్రులకు పిల్లలే వారి ప్రపంచం.

Update: 2022-09-17 15:00 GMT

పసిపిల్లల్లో తక్కువ బరువు సమస్యలు.. ఈ పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు..!

Child Care Tips: తల్లిదండ్రులకు పిల్లలే వారి ప్రపంచం. తమ బిడ్డలని మిగిలిన వారి కంటే మెరుగ్గా, అందంగా కనిపించేలా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే నేటి కాలంలో చాలా మంది పిల్లలు తక్కువ బరువు సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసే విషయం. ఆరోగ్యకరమైన ఆహారం అందించినా బరువులో తేడా ఉండటం లేదు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. పసిపిల్లల్లో తక్కువ బరువు సమస్యలని తొలగించడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పరిశుభ్రత లేకపోవడం

మీ పిల్లలు తక్కువ బరువు సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం కారణమై ఉంటుంది. తల్లిదండ్రులు చేతులు కడుక్కోకుండా పిల్లలకు ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు నెమ్మదిగా అనారోగ్యానికి గురవుతారు. పరిశుభ్రత లోపించడం వల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం

కొంతమంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను తేలికగా తీసుకుంటారు. ఇది పెద్ద సమస్యలకి కారణం అవుతుంది. పరిశుభ్రత లోపించడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో వైద్యం అందించకపోతే ప్రాణాలకే ప్రమాదం.

నవజాత శిశువులకు అదనపు సంరక్షణ

నవజాత శిశువులకు అదనపు సంరక్షణ అవసరం. చిన్న పిల్లలను తల్లితో ఎక్కువసేపు ఉంచాలి. ఇది పిల్లల ఉష్ణోగ్రతను సరిచేస్తుంది. శిశువుకు 6 నెలల పాటు తల్లి పాలు మాత్రమే అందించాలి. కానీ బరువు తక్కువగా ఉన్న నవజాత శిశువులు తల్లి పాలు తాగడం కష్టం. దీని కోసం కొన్ని రోజులు వేచి ఉండాలి. పిల్లవాడు పాలు తాగడం ప్రారంభించిన తర్వాత బరువు సులువుగా పెరుగుతారు.

Tags:    

Similar News