White Hair: తెల్లజుట్టుని ఈ సహజమైన పద్దతిలో నల్లజుట్టుగా మార్చుకోండి..!

White Hair: ఒకప్పుడు తెల్లజుట్టు వచ్చిందంటే వారు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నారని అర్థం.

Update: 2022-08-02 15:00 GMT

White Hair: తెల్లజుట్టుని ఈ సహజమైన పద్దతిలో నల్లజుట్టుగా మార్చుకోండి..!

White Hair: ఒకప్పుడు తెల్లజుట్టు వచ్చిందంటే వారు వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నారని అర్థం. కానీ ప్రస్తుతం 25 నుంచి 30 ఏళ్ల యువత కూడా తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతోంది. దీని వెనుక జన్యుపరమైన కారణం ఉండవచ్చు. కానీ ఎక్కువగా చెడ్డ జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. మన జుట్టులో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం తగ్గడం ప్రారంభమైతే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో మీరు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులను తీసుకురావడం ముఖ్యం. అయితే తెల్ల జుట్టుని సహజంగా తెల్లగా ఎలా మార్చాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. మీరు ఉసిరి, మందార పువ్వులు, కొన్ని నువ్వులు, కొబ్బరి నూనెను మిక్స్‌ చేసి ఒక పేస్ట్ సిద్ధం చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మూలాలకు మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

2. ఉల్లిపాయ జుట్టుకు ప్రయోజనకరంగా చెబుతారు. దీని కోసం గ్రైండర్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలను రుబ్బి తరువాత రసాన్ని కాటన్ క్లాత్‌తో ఫిల్టర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిని తలపై మసాజ్ చేయాలి.

3. ఆరోగ్యకరమైన ఆహారాలు లేకుండా ఆరోగ్యకరమైన జుట్టును ఊహించలేరు. జుట్టుకు సరైన పోషకాహారం అందాలంటే దీని కోసం క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలి. ఇది అంతర్గతంగా జుట్టుకు మేలు చేస్తుంది.

4. జుట్టు మూలాలు బలంగా ఉండాలంటే ఆయిల్ మసాజ్ చాలా ముఖ్యం. ఈ పరిస్థితిలో బాదం నూనె, కొబ్బరి నూనె చాలా ఉపయోగపడుతుంది.

5. గోరింటాకు బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి అందులో కొబ్బరి నూనె, మజ్జిగ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలకి పట్టించి మసాజ్ చేయాలి. దీని ప్రయోజనాలు కొద్ది రోజుల్లోనే కనిపిస్తాయి.

Tags:    

Similar News