White Hair Problem: తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోండి.. ఈ 3 పద్ధతులు సూపర్..!
White Hair Problem: సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ నల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే జుట్టు తెల్లబడుతోంది.
White Hair Problem: సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ నల్ల జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే జుట్టు తెల్లబడుతోంది. దీని కారణంగా చాలామంది ఫంక్షన్లు, పార్టీలకు రాలేకపోతున్నారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. బ్లాక్ టీ
తెల్ల జుట్టుకు బ్లాక్ టీ ఉత్తమ పరిష్కారం అని చెప్పాలి. ఎందుకంటే ఇది జుట్టుకు టోనర్ లాగా పనిచేస్తుంది. బ్లాక్ టీ తయారుచేసి చల్లారక తలస్నానం చేసేటప్పుడు తలకు బాగా పట్టించాలి. జుట్టు పూర్తిగా ఆరిపోయాక శుభ్రమైన నీటితో కడగాలి. మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు.
2. హెయిర్ మాస్క్
కొన్నిరకాల హెర్బల్ పౌడర్లతో ఇంట్లోనే హెయిర్ మాస్క్ రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక చెంచా నీలిమందు, ఒక చెంచా త్రిఫల పొడి, ఒక చెంచా బ్రహ్మీ పొడి, 2 చెంచాల బ్లాక్ టీ, ఒక చెంచా ఉసిరి పొడి, ఒక చెంచా కాఫీ పొడిని గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో నీరు పోసి తక్కువ మంట మీద వేడిచేసి చల్లారాక ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేయాలి. 30 నుంచి 45 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
3. మెంతి గింజలు
ఆహార రుచిని పెంచడానికి మెంతి గింజలను ఉపయోగిస్తారు. కానీ ఈ గింజల సాయంతో తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకోసం మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నిద్రలేవగానే ఈ గింజలను గ్రైండ్ చేసి హెయిర్ మాస్క్ లాగా తలకు పట్టించాలి. కొన్ని గంటలపాటు ఆరనివ్వాలి. తరచుగా ఇలా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే తెల్లజుట్టు కనిపించదు.